Showing posts with label చిరు. Show all posts
Showing posts with label చిరు. Show all posts

Sunday, August 8, 2010

ఉప్పొంగిన అభిమానం అంటే ఇది

ఉప్పొంగిన అభిమానం అంటే సొంత పత్రికలో, సొంత ఛానెల్ లో, అరువు తెచ్చుకున్న ఇంకో ఛానెల్లోనో 24 గంటలు ఉప్పొంగిన అభిమానం అంటూ ఊదరు కొట్టుకోవటం కాదు, రెండు నెలల ముందు యాత్ర తేదీలను చెప్పి యేర్పాట్లు చేయమని MLA, MP ల వారసులతో కోట్లు ఖర్చు పెట్టించి 100 కి పైగా వాహనాలతో కాన్వ్యాయ్ పెట్టి, లారీ లలో జనాలను తరలించి అది సొంత బలంగా డబ్బా కొట్టుకోవటం కాదు. అతి తక్కువ ప్రచారం తో ఒకరు తరలించకుండా సొంతంగా అడుగడుగునా, ఊరూరా, పల్లె పల్లెనా వేలల్లో తరలివస్తే దాన్ని ఉప్పొంగిన అభిమానం, జన నీరాజనం అంటారు.




Monday, June 7, 2010

పోలవరం నిర్వాసితులతో 'చిరు'

ఒక ప్రొజెక్టు ను ఎంత బాగా చేసినా దాన్ని ఒక logical end/conclusion కు తీసుకు రావటం చాలా ముఖ్యం. చిరు కు మంచి మార్కులు తెచ్చిపెట్టిన పోలవరం యాత్ర లో భాగంగా చిరు ఖమ్మం, గోదావరి జిల్లాల్లోని నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విన్నారు. మొక్కుబడిగా 'మమ' అనిపించటమో లేకపోతే "రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా?" అంటూ ఒక standard చౌక బారు విమర్శ చేయటమో కాకుండా ఒక పద్ధతి ప్రకారం నిర్వాసితులతో కూడా భేటీ అయ్యి రాజకీయ ప్రసంగాలతో సమయం వృధా చేయకుండా ఎక్కువ సమయం నిర్వాసితులతోటే మాట్లాడించి వారి సమస్యలను విని వాటిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు చిరు.All the Best Chiru.



Wednesday, May 19, 2010

చిరు పోలవరం యాత్ర vs 'ఈనాడు'

'పోలవరం' కోసం 'చిరు' చెప్పట్టిన యాత్ర మిగతా రాజకీయ పార్టీలకు సమస్యలపై ఎలా ఉద్యమించాలో దిశానిర్దేశం చేసేలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఒకే అంశం మీద ఇంత తీవ్రతతో చిరు చేస్తున్న ఉద్యమం అభినందనీయం.

ఇక పోతే ఎప్పటిలాగే మన దిక్కుమాలిన మీడియా మాత్రం ఇంత మందికి మేలు చేసే ఒక పర్యటనకు సరైన coverage ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ పార్టీలకు మేలు చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి. మండే వేసవిలో సాయంత్రం నాలుగు గంటలకు రోడ్ షో లో మొదలు పెట్టి రోజుకి కనీసం 15 నుంచి 20 చోట్ల ప్రసంగిస్తూ రాత్రి 1 గంట వరకు యాత్ర, తర్వాత ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి ప్రయాణం, వేరే ప్రాంతం చేరుకొనే సరికి రాత్రి 2, మళ్ళీ పొద్దున 9 కల్లా ఆ ఊళ్ళో కార్యకర్తలతో, అభిమానులతో సమావేశాలు, ఆ తర్వాత మీడియా సమావేశం, తర్వాత భోజనం, కాసేపు విశ్రాంతి మల్లి రోడ్ షో షురూ...స్థూలంగా గత 14 రోజులు చిరు దినచర్య ఈ విధంగానే జరిగింది. ఇకపోతే వచ్చిన ప్రజా స్పందన మాత్రం అపూర్వం. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఊళ్లకు ఊళ్ళు పోటీ పడ్డట్లుగా ఒక ఊరిని మించి ఇంకో ఊళ్ళో జనాలు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట దాటినా, యాత్ర మూడు నాలుగు గంటలు ఆలస్యమైనా అలసట లేకుండా ఎదురు చూశారు. 15 రోజుల పాటు దాదాపు 6 జిల్లాల్లో ఏకబిగిన పర్యటిస్తూ జనాల మధ్యలో గడిపాడు. ఇంత చేసినా పాపం చిరు కి ఒకటి రెండు రోజులు మినహా ఈనాడు paper లో ముఖ్యవార్తలలో చోటు లభించలేదు. విడ్డూరం ఏంటంటే కనీసం రాష్ట్ర రాజకీయాల గురించి రాసే పేజీ లో అతి తక్కువ సార్లు చిరు గురించి రాశాడు. సాధ్యమైనన్ని సార్లు ఏదో ఒక మూలనో, వసుంధర పక్కనో లేక ఆటల పేజీ పక్కనో వేస్తాడు. ఇక ఆ మూల వేసిన వార్త online edition లో మాత్రం బూతద్దం తో వెతికితే తప్ప కనిపించదు. మన చంద్రబాబు అండ్ కో లు మాత్రం ఇంట్లో కూర్చొని బిర్రుగా తిని మధ్యానం దిట్టంగా నిద్రపోయి సాయంత్రం బోర్ కొట్టి జనాలకు ఒక్క పైసా కూడా ఉపయోగపడని ఒక చౌక బారు విమర్శ చేయగానే దానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చి తాటికాయంత అక్షరాలతో రాస్తాడు. ఇది ఈనాడు తీరు.

జిల్లా పేపర్లు ఈ విషయం లో బాగా నయం. వాళ్ళకు ఆ పేపర్ల హైకమాండ్ నుంచి అంతా ఒత్తిడి ఉండదేమో బహుశా. యాత్ర కు వస్తున్న స్పందన గురించి ఎక్కువ శాతం నిజాలు రాశారు, బాగానే coverage ఇచ్చారు.

Friday, May 14, 2010

'పోలవరం' ఆవశ్యకత తెలిపే వీడియో

ఒక ప్రాజెక్ట్ ఆవశ్యకత ను ఇంత చక్కగా చెప్పే వీడియో ఎప్పుడైనా చూశారా?


Friday, May 7, 2010

చిరు పోలవరం యాత్ర effect...ఒత్తిడి లో congress, TDP

ఒక చిన్న పార్టీ అయినా ఈ విషయం లో పెద్ద పార్టీలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచింది ప్రజారాజ్యం. పకడ్బందీ ప్రణాళిక తో రూపొందించిన ఈ యాత్ర రెండో రోజుకు చేరుకోనేలోపే సత్ఫలితాలను ఇస్తుంది. ఒక పక్క యాత్ర కు విశేషమైన జన స్పందన లభిస్తుండగా ఇంకో పక్క మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి ప్రాజెక్టులకోసం నడుం బిగిస్తున్నాయి. congress MP లు ఇప్పటికే ప్రధానిని కలిసి పోలవరం ప్రాజెక్టు జాతీయహోదా కోసం విజ్ఞప్తి చేయగా తెలుగు దేశం కూడా పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామంటుంది. మొత్తానికి అన్నీ పార్టీలు ప్రజా హితమైన ప్రాజెక్టుల మీద దృష్టి సారించాయి. ఈ బుద్ధేదో ముందే ఉంది ఉంటే మనకు ఇన్ని సంవత్సరాల పాటు రైల్వేలలో, కేంద్ర నిధులలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదేమో.

ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక కొత్త పార్టీ రావటం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు అన్న దానికి ఇది perfect ఉదాహరణ. పోతే ప్రజారాజ్యం కూడా చిన్నగా గాడిలో పడుతుంది అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కల్లా prp ఉండదు అని, prp congress లో కలిసి పోతుంది అని దుష్ప్రచారం చేసే వాళ్ళకు చిరంజీవి చెప్పే సమాధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది.



Tuesday, May 4, 2010

ఆసక్తి రేపుతున్న చిరు "పోలవరం" యాత్ర

రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్, దశాబ్దాలుగా మూలుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పై చిరంజీవి చేపట్టిన పోలవరం యాత్ర పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతుంది. రాజకీయాల్లో అడుగు పెట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకపోయినా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రజారాజ్యం భారీ కసరత్తే చేసింది. మొదట మండల స్థాయి సమావేశాలు, తర్వాత జిల్లా స్థాయి సమావేశాలతో జిల్లాలలో ఇప్పటికే ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసింది. దానికి తోడు రెండు మూడు రోజుల క్రితం, పోలవరం ఆవశ్యకత ను చాటి చెప్పే cd లను posters ను విడుదల చేశారు. పార్టీకి ఉన్న తక్కువ వనరులను ఉపయోగించుకుంటూ ఇంత చక్కగా plan చేసి ఒక ప్రజా హిత కార్యక్రమం కోసం ఉద్యమించటం చాలా బాగుంది.

ఇకపోతే సందట్లో సడేమియా లాగా తెరాస పోలవరం ప్రాజెక్ట్ తెలంగాణ కు వ్యతిరేకం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. గోదావరి పరివాహక ప్రాంతం లో చిట్ట చివర కట్టే ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఎలా నష్టపోతుందో వారికే తెలియాలి. పోలవరం ద్వారా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఆ మాటకి వస్తే మునిగి పోయే ప్రాంతాలు తూర్పు, పశ్చిమ గోదావరి లోనూ, చత్తీస్గడ్, ఒరిస్సాలోను ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ జిల్లాలకు వచ్చే తాగునీరు, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా అందే తాగు నీరు, పోలవరం ద్వారా రాయలసీమ కు నీళ్ళు ఇవ్వటం ద్వారా, శ్రీశైలం నుంచి రాయలసీమ కు ఇవ్వాల్సిన నీటి పై ఒత్తిడి తగ్గి, తెలంగాణ కు ఎక్కువ నీరు అందుతుంది. ఇదే కాకుండా పోలవరం లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణ లోని ఎత్తి పోతల పధకాలకు ఉపయోగపడుతుంది

ఇకపోతే చిరు పర్యటన మొదలు కాకముందే దాని effect కొద్ది కొద్దిగా కనపడుతుంది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన రెండు కళ్ళ చంద్రబాబు మొన్నే ప్రధాన మంత్రికి లేఖ రాశాడు, ప్రాణహిత, పోలవరం ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించమని. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని ప్రాజెక్టుల కోసం ఇలా యాత్ర చేపట్టాలని చూస్తున్నారట. ఇలా ఉద్యమం పేరు చెప్పుకొని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పైసా పని కూడా చేయకుండా పబ్బం గడుపుకుతున్న వారు కూడా ఇలా నిజమైన ప్రజాహిత కార్యక్రమాల మీద దృష్టి సారించటం చిరు సాధించిన మొదటి విజయంగా చెప్పుకోవచ్చు.

ఈ యాత్ర విజయవంతమౌతుందని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతుందని ఆశిద్దాం.

Thursday, April 22, 2010

చిరoజీవి తెలంగాణ ద్రోహి కాదు...

సమైక్యరాష్ట్రం కోరుకొనే వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు. రాష్ట్రం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తెలంగాణ ప్రజలలో కూడా సమైక్యం కోరుకొనే వాళ్ళు ఉన్నారు.

ద్రోహి అంటే పైకి ఒకటి చెప్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వారు.
ఉదా:
1) తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే అని తెలంగాణ లో చెప్తూ తెలంగాణ ను అడ్డుపెట్టుకొని పెద్ద పెద్ద పదవులను కొట్టేసి తెలంగాణా కి పైసా పని చేయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ద్రోహులు.
2) తెలంగాణ కు అనుకూలం అని చెప్తూ సీమాంధ్ర లో నిరాహార దీక్షలు, బస్సు యాత్రలు చేయించి అక్కదేమో సమైక్యం అని, ఇక్కడేమో జై తెలంగాణా అని రెండు ప్రాంతాల ప్రజలను మభ్య పెడుతున్న తెలుగుదేశం రెండు ప్రాంతాల ద్రోహి
౩) అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణా అంటూ ఉద్యమం పేరు చెప్పుకొని డబ్బులు గుంజుకుంటూ, సొంత నియోజక వర్గం లో వరదలు వచ్చి అంతా పోతే కనీసం ఏమీ చేయకుండా...దోపిడీ దారులు, వలస వాదులు, ఉద్యోగాలు, వివక్ష, వెనకబాటుతనం అంటూ రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేసి అమాయక విద్యార్ధుల ప్రాణాలు బలి దీసుకొని, చివరికి శ్రీకృష్ణ కమిటీ దగ్గర స్వయంపాలన అంటూ మాట మార్చి, సమ్మగా ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మీటింగులు పెట్టుకుంటున్న kcr/TRS తెలుగు ప్రజల అతి పెద్ద ద్రోహి.


వీళ్లందరు చేసిన ఏ ఒక్క దుర్మార్గపు పని చిరంజీవి చేయలేదు. తన నిర్ణయం మార్చుకున్నాడు తప్ప, నిర్ణయం మార్చుకోలేదు అని చెపుతూ రెండు ప్రాంతాలు, రెండు నాల్కలు, రెండు కళ్ళు అని వేదాలు వల్లే వేయట్లేదు.

చివరిగా: చిరంజీవి కి సమైక్యంగా ఉండాలంటు తెలంగాణ లో పర్యటించే అన్నీ హక్కులు ఉన్నాయి. Really looking forward to it.

పదునెక్కుతున్న చిరు మాటలు













రాష్ట్ర కమిటీ సమావేశం లో చిరు ఉద్వేగంతో చేసిన ప్రసంగం బాగుంది. ఎంతో ఆకర్షణ ఉన్న సినిమా రంగంలో 30 యేళ్లుగా character/వ్యక్తిత్వం కాపాడుకున్నాను అంటూ తెలుగు బిడ్డనైన నాకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తెలంగాణా లో పర్యటించే అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పటం బాగుంది. ఇది చాలా correct. సమైక్యంగా ఉండాలని కొంత మంది తెలంగాణా వారు కూడా కోరుకుంటున్నారు. సమైక్యం అన్నంత మాత్రాన వారిని తెలంగాణా దోషులుగా TRS చిత్రించటానికి ప్రయత్నించటం దారుణo.

Tuesday, December 23, 2008

చిరు భేష్

మిగతా వాళ్ల సంగతి తెలీదు కాని నాకు మాత్రం మొదటి నుంచి చిరు ప్రభుత్వాన్ని విమర్శించే అంశాలు నచ్చుతున్నాయి.
చాలా మంది ప్రజా యాత్రలు చేస్తున్నారు కాని, చిరు యాత్రలకి వాటికి తేడా ఏంటంటే, చిరు స్థానిక సమస్యల పైన ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. మొదట చిరు బహిరంగంగా బైటకు వచ్చి ప్రజలను కలిసింది సిరిసిల్ల లోని నేత కార్మికులను. అప్పటి వరకు అసలు దాని గురించి పెద్దగా చర్చే జరగలేదు. ఎప్పుడైతే చిరు అక్కడికి వెళ్ళాడో పాలక పక్షం నుంచి ప్రతి పక్షం దాక అందరు దాని గురించే చర్చించారు కొన్ని రోజులు. ఇది ముమ్మాటికీ చిరు గొప్పతనమే. సిరిసిల్ల తర్వాత పోలేపల్లి పర్యటన కు కూడా అలాంటి స్పందనే లభించింది. ఇంక తర్వాత శ్రీకాకుళం పర్యటన లో కోడి రామ్మూర్తి గారి గురించి చర్చించి ఆయన గుర్తుగా ఏదో చేస్తాము అని చెప్పారు. ఇవ్వాల్టి రోజుల్లో ఇందిరమ్మ ని, రాజీవయ్యని తప్ప మన పాలకులు తెలుగు నాట ఎంతో ఖ్యాతి గడించిన అమర వీరులను అసలు పట్టించుకుంటున్నారా చెప్పండి. వీళ్ళని ఎన్నుకొని మన ఆత్మ గౌరవాన్ని మనమే చంపుకుంటున్నాం.
ఇక ఈమధ్య పర్యటనల విషయానికి వస్తే, ఎన్ హెచ్ ౯ (తొమ్మిది) ప్రస్తావన.. హైదరాబాదు నుంచి విజయవాడ కి బస్సు లో వెళ్ళే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. రాత్రి బయల్దేరాలంటే గంటలు గంటలు ట్రాఫిక్ జామ్. ఎన్నింటికి ఇంటికి చేరతామో తెలియని పరిస్థితి. రాష్ట్రం లో బాగా రద్దీ ఉండే రోడ్లలో అది ఒకటి. సంవత్సరాల తరబడి దాని పరిస్థితి అలానే ఉన్నా పట్టించుకున్న నాధుడే లేడు. నల్గొండ లోని ఫ్లోరైడ్ సమస్య కుడా ఇలాంటిదే. ఇలాంటి నిజమైన సమస్యలను ప్రస్తుతించటం లో విపక్షాలు కుడా విఫలం అయ్యాయనే చెప్పాలి.
ఇంక చిరు మీద విమర్శల విషయానికి వస్తే చిరు మార్పు అంటున్నాడు కాని, మార్పు అంటే ఏంటో చెప్పట్లేదు. సరైన అజెండా లేదు చిరు కి అంటున్నారు. మార్పు అంటే ఏదో సినిమా లో చూపినట్లు హైదరాబాదు కి సముద్రం తేనవసరం లేదు . చేసే పనులే సక్రమంగా చేస్తే ప్రజలందరికీ ఫలాలు సక్రమంగా అందుతాయి. ఇంక అజెండా విషయానికి వస్తే ఏ ఒక్క పార్టీ కి ఆయినా సరి ఆయినా అజెండా ఉందా, ప్రభుత్వాన్ని కిందకి దించటం తప్ప. అదే ఉంటే సమైక్య ఆంధ్రా వాదన వినిపించే సిపిఐ , సిపిఎం వాళ్ళు తెరాస లాంటి పార్టీ లతో పొత్తు పెట్టుకుంటారా?
ఇప్పడు చిరు ముందున్న అతి పెద్ద సవాలు ఎన్నికల వరకు ఈ ఊపు ని కొనసాగించి ఎన్నికల్లో గెలవటం. ఆ తర్వాత తను కోరుకున్న మార్పు ప్రజలకు చూపించటం. ఈ రెండిట్లో ఎంత వరకు విజయం సాధిస్తాడో వేచి చూడాల్సిందే.
ఇంకా నేను కోరుకోనేదేంటంటే ఆచరణ లో ఆదరణ కోల్పోతున్న తెలుగు కి కూడా చిరు ఏదన్నా చేయాలని.