Showing posts with label చిరంజీవి. Show all posts
Showing posts with label చిరంజీవి. Show all posts

Monday, February 7, 2011

prp మూసేశారు...అందరూ పండగ చేసుకోండి.

TDP అభిమానులు: మీరు పండగ చేసుకోండి. prp వోట్లు చీల్చటం వల్లే ఓడిపోయాం అన్నది మీ వాదన కాబట్టి మీకు ఇది పెద్ద పండగే. ఇక మీ ఛానెల్స్ లో మీరు ఒక పార్టీ గురించి దుమ్మెత్తి పోయాల్సిన అవసరం లేదు. మీ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది.

కాంగ్రెస్ అభిమానులు: మీరు కూడా పండగ చేసుకోండి. ప్రజారాజ్యం తెలుగు దేశం వొట్ల కన్నా మీ వోట్లే ఎక్కువ చీల్చింది అన్నది మీ భావన కాబట్టి మీకు కూడా మంచిదే. మీ పార్టీ కి free గా ఒక ప్రచార కర్త దొరికాడు కూడా.

prp అభిమానులు: హమ్మయ్య ప్రజా రాజ్యం పార్టీ ఇంక మూసేశారు. ఇంక ఎంత అడ్డమైన వెధవ చిరు ని కామెంట్ చేసీనా బాధ పాడాల్సిన అవసరం లేదు. పార్టీ గురించి ఎప్పుడు ఏ ఛానెల్ వాడు దుష్ప్రచారం చేస్తారో అన్న బెంగ లేదు. పార్టీ నుంచి ఎవరు బైటికి వెళ్లిపోతారో అన్న సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో అన్న ఆలోచన అంతకన్నా లేదు.

చిరు అభిమానులు: మీకు పండగే పండగ. ఈ పాడు రాజకీయాలు మనకు వద్దు. మన 150 వ సినిమా కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇంక దర్శకుడు ఎవరు? పాటలు ఎప్పుడు release అవుతాయి. సినిమా ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో మనం time pass చేసుకుందాం. :)

Saturday, January 1, 2011

శ౦కర్ దాదా అవతారమెత్తి మానవత్వం చాటిన 'చిరు'

గుంటూరు జిల్లా పర్యటన లో చిరు రాజకీయ నాయకులకు సహజంగా ఉండని మానవత్వాన్ని చాటారు. రెండేళ్ల క్రితం bike accident జరిగి కొమా లో ఉన్న ఒక అభిమానిని శంకర్ దాదా సినిమా లో లాగా కదిలించటానికి ప్రయత్నించారు. చిరు ని చూసి ఆ అభిమాని రెండు మూడు సార్లు కళ్లరెప్పలు ఆర్పాడు. అతనిలో కొంచెం కదలిక వచ్చింది. అతని ఇంటికి వెళ్ళటం schedule లో లేకపోయినా, ఒక నాయకుడు అతని విషయం చెప్పేసరికి వాళ్ళ ఇంటికి వెళ్ళి 45 నిముషాలు గడిపాడు. అంటే కాకుండా nims లో వైద్యం చేయిస్తానని మాట కూడా ఇచ్చారు.
ఇక ఇంకో సంఘటన లో కళ్ళు అంతగా కనపడని ఒక ముసలి దంపతులు కాన్వాయ్ దగ్గరకు రావటం గమనించిన చిరు, తన వాహనం దిగి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వారికి కంటి చికిత్స ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చాడు. ఇంకో సందర్భం లో ఆత్మ హత్య చేసుకున్న కుటుంబం లో ఒక తల్లి పిల్లలను ఎలా చదివించాలి అని బాధ పడుతుంటే, మొదట ఇచ్చిన 25 వేలకు అదనంగా పిల్లల చదువుల కోసం ఇంకో 25 వేలు ఇచ్చి ఉన్నత విద్య కోసం తనకు తెలిసిన వల్ల కాలేజ్ లో సీటు ఇప్పిస్తానని చెప్పారు.

ఇలా అన్నీ చోట్ల చిరు మానవత్వాన్ని చూపించారు. విచిత్రం ఏంటంటే చిరు shakehand ఇవ్వలేదని, ఒక ఊరికి రాలేదని ఎవరన్నా అభిమాని చిరు ని తిడితే మాత్రం box పెట్టి మరీ రాసే మీడియా వాళ్ళు ఈ విషయాలకు కనీస coverage కూడా ఇవ్వకపోవటం.





Tuesday, November 23, 2010

పోలవరం కోసం చిరు మరో ప్రయత్నం

పోలవరం ప్రాజెక్ట్ కోసం రెండో సారి చిరు ప్రధానిని కలిసి జాతీయ హోదా కోసం విన్నవించారు. అలాగే రాష్ట్రం లోని పలు సమస్యలను ప్రధాని దృష్టి కి తీసుకువెళ్ళారు. మరి మన 33 మంది MP లకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో.

ప్రధాని ని కలిసి వివరించిన సమస్యలను సరిగ్గా ప్రస్తావించకుండా, విలేఖరుల సమావేశం లో అన్న ఒక మాట ని head line గా పెట్టి జనాలను పక్కదోవ పట్టించే ఈనాడు రాసిన కధానాన్ని కూడా కింద చూడొచ్చు.



Monday, April 26, 2010

'పోలవరం' కోసం ప్రజారాజ్యం పోరు








ఇంతకు ముందు ఒకటి రెండు సమస్యలపై (ఉదా: విద్యుత్ సమస్య, కాకినాడ గాస్ లో వాటా) ప్రజా రాజ్యం ఉద్యమాలు చేసినా పెద్ద ఎత్తున ఒక చక్కటి ప్రణాళిక తో ఇలా ఉద్యమించటం ఇదే మొదటి సారి అనుకుంట.

ఇకపోతే ఈ లింక్ ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడుతుంది, 1941 లో బ్రిటీష్ వాళ్ళ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఆలోచన రూపు దిద్దుకుందట. మరి ఇప్పుడు design మారిందో లేదో తెలీదు కానీ, జాతీయహోదా కోసం ప్రయత్నిస్తున్నారంటే ఇది కచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యుండాలి. దీని శంకుస్థాపన జరిగి కూడా చాలా యేళ్లయినా, కారణాలు ఏవైనా ప్రాజెక్ట్ మాత్రం ముందుకు జరిగినట్లు లేదు.

ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ గురించి, ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం మరి ఎందుకు పట్టించుకోలేదో తేలేదు కానీ, ప్రజారాజ్యం మాత్రం serious గా తీసుకున్నట్లుంది. ఇంతకు ముందు కొన్ని సమస్యలపై ప్రజారాజ్యం ఉద్యమాలు చేసినా (ఉదా: విద్యుత్ కోత, కాకినాడ గాస్) అవి ముఖ్యంగా ఒకటి రెండు రోజులు మాత్రమే సాగాయి. మొదటి సారి ఇప్పుడు ఏకంగా ఇలాంటి సమస్యపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించటం అభినందనీయం. రైతులకు అవగాహన పెంచటం కోసం CD కూడా రూపొందించారట. కచ్చితంగా ఇలాంటి నిజమైన ప్రజాహిత కార్యక్రమాలు, ఉద్యమాలు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాయని భావిద్దాం.
మొత్తానికి ప్రజారాజ్యం మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదుగుతుంది అనిపిస్తుంది.
All The Best PRP.

Monday, February 22, 2010

రైల్వే బడ్జెట్ గురించి ముందు చూపేది?




రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరగగానే అందరూ విమర్శించటం, కేంద్ర మంత్రులు కొద్దిగా అసంతృప్తి నటించి తర్వాత చిన్నగా ఒక వినతి పత్రం సమర్పించటం, దాన్ని రైల్వే వాళ్ళు ఒక చెత్త బుట్ట లో పడేయటం, ఒక వారం రోజులు కాగానే మీడియా ఇంకో కొత్త సంచలనాత్మక వార్తను ఎంచుకొని ఈ సమస్యను గాలికి వదిలేయటం, చిన్నగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోవటం. ఇది ప్రతి సంవత్సరం మార్చి లో మన రాష్ట్రం లో జరిగే తంతే. ఈ మాత్రం దానికి మనకు కేంద్రం లో మంత్రులు, MPs అవసరమా, రాష్ట్రంమ్ లో ప్రభుత్వం, ప్రతిపక్షం అవసరమా? ఇక 30 యేళ్లుగా రాజకీయాల్లో ఉండి, 9 యేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న పెద్దాయన, ఒక రోజు అకస్మాత్తుగా నిద్ర లేచి "అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా" అని ఒక statement మీడియా కి పడేసి మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వస్తుందా అని చూస్తుంటాడు తప్పితే ప్రభుత్వానికి constructive గా ఒక్క సలహా కూడా ఇవ్వడు, ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి చేయడు. అంతా అయ్యాక విమర్శించటానికి మాత్రం రెడీ.

anyways, I really appreciate chiru for doing this


Monday, May 18, 2009

ప్రజా రాజ్యం తుస్సు మన్నదా?

ఒక రెండు మూడు రోజుల్నుంచి ఈనాడు లాంటి విష పత్రికల వాళ్లు, మన బ్లాగు సోదరులు అందరు ప్రజా రాజ్యం తుస్సు మంది అనో ఘోరం గా ఓడింది అని అంటున్నారు. అలా అనటం ఎంత వరకు సమంజసం? 
1) ప్రజా రాజ్యానికి వచిన సీట్లు 18, వోట్ల శాతం సుమారు 16. 130 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీ  కి  36% వోట్లు వస్తే, 30 ఏళ్ల నుంచి ఉన్న పార్టీ కీ 26% వస్తే, 8 నెలలున్న పార్టీ కి 16% శాతం వోట్లు వచ్చాయి. ఇది విజయం కాదా?. 
2) ఒక వేళ శాతం ప్రకారం సీట్లు వచ్చి ఉంటే కాంగ్రెస్ కి సుమారు 100, తెదేపా కి 75, ప్రరాపా కి 50 వరకు వచ్చి ఉండేవి. ఎనిమిది నెలలు వయసు ఉన్న పార్టీ కి ఇంత స్పందన రావటం తుస్సుమన్నట్లా?    
3) వై యెస్ ఇదేళ్లలో, బాబు 9 ఏళ్లలో వాళ్ల వాళ్ల పాలన ఎంటొ ప్రజలకు చూపించారు. వాళ్లకి వోట్లు వేసిన వాళ్లు ఆ పనులని చూసి వోట్ వేసుంటారు ఆయా పార్టీలకు. కాని ఇంత వరకు రాజకీయాల్లోనే లేని ఒక వ్యక్తి కి 16 శాతం వోట్లు రావటం, ముక్కోణపు పోటి లో ఒక్కరితోను పొత్తు లేకుండా తర తరాల నుంది ఉన్న పార్టీ లను ఖంగు తినిపించి 18 సీట్లు గెలుచుకోవటం వోటమి అవుతుందా?   
4) ఈనాడు, సాక్షి లాంటి విలువల్లేని వార్తా పత్రికలు చిరు పార్టీ పెట్టక ముందు నుంచి చేసిన నెగిటివ్ ప్రచారాన్ని తట్టుకొని, ఎన్నికలు ఇంకో పది రోజులు ఉందనగా పరకాల లాంటి వాళ్ల తో ఆడించిన డ్రామాలను  తట్టుకొని అన్ని సీట్లు సాధించటం ఏ రకంగా వోటమి? ఇప్పుడు ఇలా అనే పత్రికలలో ఒక్కళ్లు కూడా ఎన్నికల ముందు చేసిన విశ్లేషణలలో ప్రజా రాజ్యానికి 40 కన్నా సీట్లు వస్తాయని రాయలేదు. ఇప్పుడు మాత్రం తుస్సు, బర్రు అంటారు.
5) ఒక వేళ వై యెస్ గాని, చంద్ర బాబు కాని వాళ్ల పార్టీ లను వదిలి కొత్త పార్టీ ని పెట్టి వాళ్ల వాళ్ల వ్యక్తి గత బలాల మీద 16% వోట్లు సాధించే దమ్ము ఉందా? అసలు వాళ్లకే కాదు మన రాష్ట్రం లో ఎవరికైనా ఉందా? వాళ్లకు వచ్చే వోట్ల లో సిం హ  భాగం వోట్లు ఆయా పార్టీలను తరతరాలుగా వెన్నంటి ఉన్న ప్రజలవి. ఇలా సొంత బలమే పార్టీ బలంగా వచ్చిన వ్యక్తి 18 సీట్లు సాధించాడు.
6) ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టటం తోనే అధికారం లోకి వచ్చాడు. కాని అప్పుడున్నట్లు రాజకీయ శూన్యత, ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పుడు లేవు. అవి లేక పోగా విలువల్లేని మీడియా, దబ్బు ప్రభావం ఇలాంటివి దాపురించాయి. ఇవన్ని మన పత్రికలకు చిరు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు  రాశారు కూడా. వీటిని తట్టుకొని పార్టీ 18 స్థానాల్లో మొదటి స్థానం లో, 34 స్థానాల్లో రెండో స్థానాల్లో నిలిచింది. ఇది ముమ్మాటికీ గొప్పే. అయితే 230 స్థానాల్లో ముడో స్థానం లో ఉంది అని రాశారు మన "largest circulated daily of AP (that circulates largest number lies daily) " వారు.  
 పార్టీ పెట్టగానే 200 సీట్లు వస్తాయనుకోవటం అతిశయోక్తే అవుతుంది. ఈ మంచి ప్రారంభాన్ని పార్టీ మరింత బలోపేతం చేయటానికి వాడుకుంటారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. 

Monday, April 13, 2009

ప్రరాపా మానిఫెస్టో లో నాకు నచ్చిన అంశం

"గత పదిహేనేళ్లు గా రాష్ట్రం లో జరిగిన అవినీతి పై హై కోర్ట్ జడ్జ్ తో విచారణ". రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలలో విపరీత మైన అవినీతి జరిగింది అని అందరికి తెలుసు. ఇక మన గౌరవమైన ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు గారు దీని మీద రాష్ట్ర పతి కి కూడా వినతి పత్రం సమర్పించారు. కాని ఆయన పొరపాటున అధికారం లోకి వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. ఎందుకంటే ఆయనదీ అదే జాతి కదా. ఆయన హయాం లో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్, అప్పుడు ఆరోపణలు చేసిన రెడ్డి గారు కూడా అధికారం లోకి వచ్చాక వాటి మీద చర్య తీసుకోలేదు. ఒకప్పటి మిత్రులు కాబట్టి వాళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మొదటి నుంచి ఉంది అనుకుంటా. 


పిఎస్: బ్లాగు చదివిన వారి కోరిక మేరకు మానిఫెస్టో లింక్ ఇస్తున్నాను.  http://prajarajyam.org/2009/04/09/prajarajyam-manifesto/