Thursday, January 14, 2010

సంక్రాంతి ని పొంగల్ చేయకండే!

అరవం ఎఫెక్ట్ అంటే ఇదేనేమో. అట్టు దోశ అయింది, చారు కాస్తా సాంబార్ అయింది. కనీసం సంక్రాంతి ని అన్నా సంక్రాంతి అని చక్కగా పిలుచుకుందాం.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

11 comments:

సిరిసిరిమువ్వ said...

మా బాగా చెప్పారు.
మీకు మీ కుటుంబసభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

శిశిర said...

నిజమేనండి. సంక్రాంతి శుభాకాంక్షలు.

Anil Dasari said...

నిజమే. భారతీయులు దీపావళిని దివాలీ అన్నా, తెలుగోళ్లు సంక్రాంతిని పొంగల్ అన్నా నాకొళ్లు మండుద్ది :-)

శ్రీ said...

మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతి,పొంగల్ మాట పక్కన పెట్టండి.సీమలో అట్టు అని ఎవరూ అనరు,మేము దోశ అనే పిలుస్తాము.కాబట్టి దోశ మన తెలుగు పదమే!చారుని రసం అంటారు కానీ సాంబార్ అనరే! మీరు ఆవేశంలో రాసినట్టున్నారు.

Anonymous said...

ఇ౦తకీ తెల౦గాణలో వీటినేమ౦టారో?

Maruti said...

మీకు మీ కుటుంభ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు.

Anonymous said...

many moons ago... i was in eluru and eating at hotel with my sibling. i asked for 'charu' and my sibling said 'should ask for rasam what charu?' and put face like i committed a crime. i was stunned because i spoke telugu whereas the hotel was used for tamil 'rasam.'

we the telugus are the first to stab our own language.

btw sri, the area you belong to is kalahasti - which is like a stones throw from tamilnadu. so your language of 'dosa' does not count. ;-) aTTu is correct word.

శ్రీ said...

ఎంతసేపు నాది కరెక్టు,నీది కరెక్టు కాదు అని కొట్టుకోవడం ఎందుకు ?

మనందరం తెలుగు వాళ్ళమే! మనందరం భారతీయులమే!

సుజాత వేల్పూరి said...

సర్లెండి, మా అత్తగారు నిన్న పొద్దున్న ఫోన్ చేసి "హాపీ పొంగల్" అంటే మండి పోయింది నాకు. తగాదా వేసుకున్నా పండగపూట.

చారు వేరు, సాంబారు వేరు. మనకసలు దప్పళం (పులుసు) కాన్సెప్ట్ తప్పించి సాంబారు కాన్సెప్ట్ లేదు. సాంబారు పూర్తిగా తమిళులదే!

మన చారుకి, తమిళ రసానికి కూడా పోలికలు తక్కువే! ఎవరి రెసిపీ వారిదే!

కనుమ రోజు గారెలు(వడలు కాదు) తినాలంటారుగా, ఏర్పాట్లు ఎంత వరకూ వచ్చాయి?

kvrn said...

yes. Better to give greetings for happy 'Sankranti'than as 'pongal'

పుల్లాయన said...

సిరిసిరి మువ్వ, శిశిర, అబ్రకదబ్ర, మారుతి, kvrn,
ధన్యవాదాలు
శ్రీ,
ధన్యవాదాలు. చిత్తూరు సంగతి తెలీదు కానీ కడప లో మాత్రం ఇప్పటికీ కూడా చాలా ఇళ్ళల్లో అట్టు అంటారు. ఆమ్లెట్ ని కూడా కోడిగుడ్డు అట్టు అంటారు అక్కడ అంటే ఆశ్చర్యపోతారేమో మీరు.

సుజాత గారు,
మీరు అన్నట్లు రెసీపీ లు ఎవరివి వారికే ఉన్నా, పప్పు చారు, నీళ్ళ చారు, గారె లు, పునుగులు మరుగున పడిపోయి సాంబారు, రసం, వడ, బోండ౦ అయిపోయాయండి.
ఈసారి నేను ఇంటికి వెళ్లలేదు కాబట్టి ఆ గారెలు తినే అదృష్టం లేదండి నాకు.
anonymous 1,
తెలంగాణా సంగతి నాకు కూడా తెలియడండి, ఈ మాట TRS వాళ్ళకి తెలిస్తే కొత్త పదమ్ ఏదన్నా సృష్టిస్తారేమో
anonymous 2,
"we the telugus are the first to stab our own language."
I totally agree.

అందరికీ మరొక సారి సంక్రాంతి శుభాకాంక్షలు