Friday, March 19, 2010

శ్రీకృష్ణ కమిటీ కి ప్రజా రాజ్యం నివేదిక


ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్స్ నివేదిక ఎలా సమర్పించాలో కూడా నిర్ణయించుకోలేని స్థితి లో ఉంటే కొత్త పార్టీ అయిన PRP ఒక స్పష్టమైన నిర్ణయం తో నివేదిక ముసాయిదా తయారుచేయటం ఆలోచించదగ్గ విషయం. ఒక విషయం పై తమ వైఖరి కూడా స్పష్టంగా చెప్పని ఈ పార్టీలు రెండు ప్రాంతాలవారిని మభ్యపెడుతూ ద్వంద్వ వైఖరి అవలంబించటం దారుణం.
నేను వార్తలలో చూసినంత వరకు ఇప్పటి వరకు లగడపాటి రెండు మూడు నివేదికలు, టిజి వెంకటేష్ ఒక నివేదిక సమైక్యాంధ్ర గురించి ఇవ్వగా, TVS వాళ్ళు తెలంగాణ తరుపున రెండు నివేదికలు సమర్పించారు. ఇక మొదటి నుంచి తెలంగాణ వాదం నెత్తిన పెట్టుకున్న TRS ని ఏమనాలో మాత్రం అర్థం కావట్లేదు. మాకు అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ జరిగింది అని మీడియా సమావేశం లో ఆంధ్ర/సీమ ల మీద దొంగల ముద్ర వేసిన వీళ్ళు నివేదిక సమర్పించటానికి ఇన్ని రోజులు ఎందుకో అర్థం కాదు. అసలు ఏమీ లెక్కలూ లేకుండా ఇన్నాళ్లు ఇన్ని ఆరోపణలు ఎలా చేశారో వాళ్లకే తెలియాలి. మరి TRS పార్టీ సంగతి పక్కన పెడితే professors అని చెప్పుకుంటున్న కోదండరామ్, జయశంకర్ లు నివేదిక తయారు చేయకుండా యే గడ్డి పీకుతున్నారో వాళ్లకే తెలియాలి. తెలంగాణ గురించి ఉత్తిత్తి సంధార్భాలలో మీడియా లో ప్రగల్భాలు పలికే జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వీహెచ్, కాకా, కేకే, అందరికన్నా మించి మధుయాస్కీ వాళ్ళ వాళ్ళ నివేదికలు ఎందుకు సమర్పించట్లేదో వాళ్లకే తెలియాలి. రాజ్యసభ సీటు కోసం వెహెచ్ అన్నీ మూసుకొని అధిష్టానాన్ని వెనకేసుకొస్తున్నాడు. కమిటీ నిర్ణయం అనుకూలంగా లేక పోతే రాజీనామా చేస్తాడట మధుయాస్కీ గాడు. అనుకూలంగా రావటానికి మీరెవరన్నా నివేదికలు సమర్పిస్తే కదా. ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణ sentiment అని చెప్పి అమాయకపు విద్యార్ధుల ప్రాణాలు బలిగొంటారు? ఎన్నాళ్ళు మీరు మీ పదవుల్లో తెలంగాణా కు ఏమీ వెలగబెట్టలేక కోస్తా సీమల మీద విష ప్రచారం చేస్తారు?
ఇక మంచో చెడో ఒక నిర్ణయం తీసుకున్న చిరంజీవి కి అభినందనలు. ఇంక ప్రజారాజ్యం రాసిన పాయింట్లలో నాకు నచ్చినది పసుపు పచ్చ రంగు లో అలికాను. ఒక తెలంగాణ వ్యక్తి, రాయలసీమ నుంచి పోటీ కి నిలబడితే ఒక కోస్తా వ్యక్తి అతనికి పోటీ కూడా పెట్టకుండా ఉండటం అనేది ప్రాంతాలు వేరైనా తెలుగు వాడు ఒక్కటే అన్న ఇకమత్యాన్ని సూచిస్తుంది. ఈ విషయం లో తెలుగు వారి ఆరాధ్యదేవుడు NTR rocks. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే తెలుగు జాతి కలిసే ఉండాలి అనే నినాదంతో బహుశా మొదట తెలంగాణా లోనే పర్యటించేవాడేమో, ఆయన వాక్పటిమకి తెలంగాణా సోదరులు అగ్ర తాంబూళం పట్టి నీరాజనాలు పలికే వారేమో. ఎంతైనా NTR లేని లోటు తెలుగుజాతికి పూడ్చలేని లోటు.