మన తెలుగు బ్లాగర్ల ఉత్సాహం చూసి నేను కూడా తెలుగు బ్లాగు రాయాలని ఎన్నో రోజులుగా అనుకుంటూ చివరికి ఇప్పుడు "నేను కూడా కూడలి లో చేరాను. ఒక బ్లాగు రాస్తున్నాను".
ఇక ఒక బ్లాగు తయారు చేయాలంటే ముందు చేయాల్సింది ఒక పేరు తయారు చెయ్యటం. ఇది ఎంతైనా చాలా కష్టమైన పని. ఇప్పటికే మన తెలుగు బ్లాగర్లు అందరూ మనకున్న కొన్ని మంచి, పిచ్చి అలాగే వింత, కొత్త, చెత్త పేర్లన్నీ పెట్టేసుకున్నారు. ఇంక నేను కూడా బాగా అలోచించి.. చించి ఇలా "పుల్లాయన" అనే కొత్త, వింత పేరు ఐతే వెరైటీ గా ఉంటుంది అని ఇలా పెట్టుకున్నాను. ఆ పేరు వెనక పెద్ద కథే ఉంది. దాని గురించి తర్వాత ఎప్పుడన్నా చెప్తాను లెండి. ప్రస్తుతానికైతే అలా ఫిక్స్ అయిపోయాను.
ఇక అందరూ తమ తమ బ్లాగుల్లో రాజకీయాలు, సినిమాలు, స్వగతాలు ఇలా ఒకటేమిటి, చాలా రాస్తున్నారు. నేను కూడా అలాగే నాకు తోచిన అంశాల గురించి రాస్తాను. మన తెలుగు బ్లాగర్లకు "లేఖిని", "కూడలి" లాంటి మంచి పనిముట్లను అందించిన చావా, వీవెన్ లాంటి వాళ్లు, అలాగే తెలుగు బ్లాగుల్లో మంచి ఉపయోగపడే విషయాలు అందిస్తున్న మన మిత్రులందరూ మనస్ఫూర్తిగా అభినందనీయులు.
8 comments:
పేరు తమాషాగా బావుంది, పుల్లాయన
వెల్కం!!
ఆహ్వానం. లేఖిని కంటే కూడా ట్రాంస్లిటరేషను టూల్ అక్షరమాల నాకు బాగా ఉపయోగపడుతున్నది నాకు ఇప్పుడు. దీనితో నేరుగా టైప్ చేయవచ్చును.
వర్డ్ వెరిఫికేషం తీసివేస్తే నా బోటి వ్యాఖ్యాతలకి సులభంగా వుంటుంది.
Welcome to our world
swaagatam..blaaglokaniki.
పుండు కి పుల్ల మొగుడు అని ఒక సామెత ఉంది,మరి ఈయన ఏ పుండుకి మొగుడవటానికి వస్తున్నారో?అవునూ,మొన్నెవరికో వస్తున్నా ఆగు అని వార్నింగు ఇచ్చింది మీరేనా?
ధన్యవాదాలు అందరికి.
శరత్ గారు,
మీ సూచనలను పాటిస్తాను.
రాజేంద్ర గారు,
మరీ వార్నింగ్ ఇచే సీను నాకు లేదులెండి. ఇప్పుడే కదా చేరింది.
ఇక్కడి నుంచి ప్రస్తానం మొదలౌతుంది...
Post a Comment