Thursday, February 26, 2009

ఆర్టిసి బస్సు.

ఇవ్వాళ టీ కొట్టు లో "ఈనాడు" కనపడితే అలా చూసేసరికి, ఎవరో మాదిగ (ఎమార్పీఎస్) కార్యకర్తలు ఆర్టిసి బస్సు ని తగల పెట్టారు అని రాశారు. చాలా బాధేసింది. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్లు ఎవరు ఏ గొడవ చేయాలనుకున్నా వచ్చి ఆర్టిసి బస్సు మీద పడతారు. అసలు బస్సు ఏం పాపం చేసింది. మన రాష్ట్రం లో బైటికి వెళ్లాలంటే ఎక్కువ మంది వాడేది బస్సు. మనం ఏ ఊరు వెళ్లాలంటే ఆ ఊరికి చేర్చటమేనా ఆ బస్సు కాని ఆ సంస్థ కాని చేసే పాపం. అసలు అలా కాల్చేవాళ్లు జీవితం లో ఎన్ని సార్లు ఎక్కుంటారు బస్సు ని? అంతలా ఉపయోగపడే బస్సు ని ఎవడబ్బ సొమ్మని కాలుస్తారు ఆ దరిద్రులు, వాళ్లని ఇలాంటి విషయాలు చేయమని ప్రొత్సహించే రాజకీయ నాయకులు? నా ఉద్దేశం లో ఆ బస్సు ఖరీదు వసూలు చేయటం తో పాటు యావజ్జీవ శిక్ష విధించాలి అలా బస్సులని తగలబెట్టిన వాళ్లకి. ఏదన్నా నిరసన వ్యక్తం చేయాలంటే చేయాలంటే చేయాల్సిన విధానం లో చేయాలి గాని ఇలా జనాలకి ఉపయోగపడే వాటినల్లా తగల పెడితే ఎలా?

7 comments:

oremuna said...

మీరు కొంచె అతిగా పదాలు వాడినట్టున్నారు.
ఉదా - దరిద్రుడు

మీ భావాలు ఇంత కంటే సున్నితంగా చెప్పవచ్చు.

ఇహ పోతే ఆర్టీసీ బస్సు తగలబెట్టడం
కోపం అన్ని విచక్షణాలోచనలను తొలగిస్తుంది.

పుల్లాయన said...

మీరన్నట్లు దరిద్రులు అతి పదంగా నెను భావించట్లేదు. కాకపొతే "ఎవడబ్బ .. " అని రాసింది కొద్దిగా ఎక్కువయ్యుండొచ్చు. కాకపొతే మీరన్నట్లు బ్లాగు పోస్ట్ రాసేటప్పుడు కొద్దిగా కోపం ఎక్కువయ్యి అలాంటి పదాలు దొర్లాయి.

అశోక్ చౌదరి said...

మీరు అన్నదాంట్లో తప్పు ఏమి లేదు అలాంటి వాళ్ళని అలానే పిలవాలి

పద్మనాభం దూర్వాసుల said...

బస్సులను తగలబెట్టడం ఒక ఎత్తైతే, దానిని సమర్ధిస్తూ ధీమగా మీడియా ముందు తప్పేముంది, కోర్కెలు తీర్చకపోతే ఇంకా తగలబెడతాం అంటూ వాళ్ల నాయకుడు, అదేనండి "చిందుల కృష్ణుడు" అనడం మరీ హాస్యాస్పదం.

Unknown said...

వీళ్ళ మీద ప్రజా ప్రయోజనాల వాజ్యం కింద కేసు పెడితే తిక్క కుదురుతుందేమో???

పద్మనాభంగారు,
ఖర్మ చూసారా... తప్పు చేసిన వాడి పేరు పలకటానికి కూడా ఆలోచించే రోజులొచ్చాయి...
ఒరెమూనా గారు,
దరిద్రుడు అనకుండా నాయనా అరివీర దేశ భక్తా వినరా ఆలోచించరా.... అని బుజ్జగిస్తూ చెప్పాలా? ఇంకెన్నాళ్ళు బుజ్జగిస్తాం?

ఇంకా ఇక్కడ వాడిన పదాలు చాలా తక్కువని వారికి అవి సరిపోవని తెలియజేసుకుంటున్నాను.

krishna rao jallipalli said...

మీరేమి తప్పుగా బాషా ప్రయోగం చేయలేదు. నిజానికి మీరు వాడిన పదం చాలా చిన్నది. తప్పు, నేరం, ద్రోహం, మోసం చేసే వారి విషయంలో బాష నియమాలు అస్సలు పాటించక్కర లేదు. ఎందుకంటె .. మనం ఎన్ని అన్నా వాళ్ళు (అంటే తప్పు, నేరం, ద్రోహం, మోసం, ఘోరం చేసే వాళ్ళు ) తిరిగి మనలని ఏమి అనలేరు .. పీక లేరు. కుక్కిన పెనులాగా పది ఉంటారు. వీళ్ళ యెడల ఉదాసీనత, బాష సంస్కారం అస్సలు పనికి రావు. మిగతా వాళ్ళకైనా కొంచంలో కొంచం బుద్ధి వస్తుంది.

పుల్లాయన said...

ధన్యవాదాలు అశోక్ గారు, పద్మనాభం గారు, ప్రదీప్ గారు, క్రిష్ణారావు గారు. హై కోర్టులో కేసు వేసి కొత్త తీర్పు ఇవ్వాలి ఇలాంటి వాళ్లకి, జీవితంలో ఇంకెప్పుడూ ఆర్టిసి బస్సు ఎక్కనివ్వకుండా!.