కాంగ్రెస్ తో పొత్తు విఫలం కూడా ప్రజారాజ్యానికి ఒకందుకు మంచిదే అయ్యింది. ముందు ముందు పొత్తులకు వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్త లు వహించాలో చెప్పకనే చెప్పింది ఈ పాఠం. పొత్తు విఫలం అవ్వటాన్ని పక్కన పెడితే రాజకీయంగా ప్రరాపా కూడా కొద్దికొద్దిగా ఎదుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒకటి కాంగ్రెస్ లాంటి పార్టీ తో పొత్తు చర్చలు జరపటం ద్వారా తెదేపా లాంటి పార్టీల గొంతులో వెలక్కాయ పడినట్లయింది. ఈ రకంగా ప్రరాపా కూడా రాజకీయంగా ఎత్తులు వేయటానికి ప్రయత్నించటం బాగుంది. ఇక్కడ అన్నిటికన్నా పెద్ద కామెడీ ఏంటంటే ఎందుకు పొత్తు పెట్టుకున్నారో ప్రజలకు వివరణ ఇవ్వాలి అని తెదేపా డిమాండ్ చేయటం. మరి వాళ్ళు 2009 ఎన్నికల్లో అప్పటి వరకు బండబూతులు తిట్టుకున్న తెరాస తో పొత్తు పెట్టుకొని జనాలకు ఏమి వివరణ ఇచ్చారో వాళ్లకే తెలియాలి. ఇక పొత్తు లేకుండా ఒక్క ఎన్నికల్లో కూడా బరిలోకి దిగని వామ పక్షాల వాళ్ళు కూడా ఈ విషయం మీద తోక ఊపే వాళ్ళే.
ఈ మధ్య ప్రరాపా లో కనిపిస్తున్న ఇంకో మార్పు ఏంటంటే ఎవరన్నా విమర్శిస్తే వాళ్ల చెంప పగిలేలా సమాధానం చెప్పటం. మొదట్లో ఎవరన్నా విమర్శిస్టే వాళ్ళ పాపానికి వాళ్ళేపోతారు అని ఊరుకొనే వాళ్ళు ప్రరాపా వాళ్లు. ప్రత్యర్ధులందరు టికెట్లు అమ్ముకున్నారు అని అని భారీగా విమర్శించినా దాని మీద పెద్దగా స్పందించకపోవటం వల్ల పార్టీ కి భారీ నష్టమే జరిగింది. ఆ విషయం లేట్ గా అయినా లేటెస్ట్ గా తెలుసుకున్నట్లున్నారు. వామ పక్షాలు పొత్తు మీద విమర్శిస్తే "పొత్తుల్లో చరిత్ర సృష్టించిన మీరు మాట్లాడకుండా ఉంటే మంచింది" అన్నీ వంగా గీత గట్టి సమాధానమే చెప్పింది. తెదేపా వాళ్ళు ఒక చర్చ లో మీరు ఎందుకు విధానాలని మార్చుకొని పొత్తు పెట్టుకుంటున్నారు అని అడిగిన దానికి "సంక్షేమ పధకాలకు వ్యతిరేకం అని చెప్పిన చంద్ర బాబు మనిషికి రెండు వేలు ఇచ్చి రాష్ట్రాన్ని దివాళా తీసే పధకాన్ని తెచ్చి మీ మౌళిక మైన విధానాలనే మార్చుకున్నారు". అలాంటి మీరు మమ్మల్ని మా విధానాలు మార్చుకున్నాము అంటూ అనటం హాస్యాస్పదం అని వాసిరెడ్డి పద్మ సమాధానం బాగుంది.
ఏది ఏమైనా ప్రరాపా కి ఇలా దెబ్బ మీద దెబ్బ తగలటం వల్ల పార్టీ లో కొద్ది కొద్దిగా కసి పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. మరి చూద్దాం ఈ కసి అన్నా పార్టీ ని నిలబెడుతుందో లేదో.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
7 comments:
yes
अगर् ग्रेटर् हैदराबाद् चुनाव् मे कांग्रेस् हार् गया तो, तब् कांग्रेस् प्र.रा.पा.से जरूर् दोस्ती करेगी.
ఈ మద్య ఒక కుసా౦ప్రదాయ౦ ప్రబల౦గా చలామణీ అవుతో౦ది.
"మీరు ఇ౦తకు ము౦దు ఇలాగే చేసారు.మే౦ చేస్తే తప్పా?" అని.
అటువ౦టి వాటికి మీలా౦టి మేధావుల మెచ్చుకోలు.....మన సమాజ౦ ఎటు పోతో౦దో.
ఎవరయినా విమర్శిస్తే చెంప పగిలేలా ఏమిటి, తలపగిలేలా సమాధానం ఇవ్వటం, ప్ర.రా.పా. కి ముందునుండి ఉన్న లక్షణమే, కావాలంటే జీవితరాజసేఖర్ కంపెనీ ని అడగండి. :)
ఇక TDP, మిగతా వాళ్లకు కాంగీ తో "ప్ర.రా.పా." ఎందుకు పొత్తు పెట్టుకొంటున్నది అని సమాధానం తెలిసిన ప్రశ్న మళ్లీ మళ్లీ అడగటం జోకే. ప్ర.రా.పా. పెట్టిననాడునుండి, ఎన్నికలలో సీట్లు ఇచ్చినప్పుడుకాని, ఆఖరకు ఎలక్షన్ రిజల్ట్స్ రాత్రికాని కాంగీ పంచన పాలె "కాపు" గానే ఉంది అన్న సంగతి వీళ్లకు తెలియకనా?
అనుమానం ఎమయినా ఉంటే, ఒక్కసారి సామినేని ఎదురుగా ఊరు పేరు లేని వాడిని, గెలిచినా లేకపోయినా కాస్త పోటీ ఇవ్వగలిగిన వాళ్లను కాదని లగడపాటికి ఎదురుగా ఓ 420 గాడిని, బాలశౌరి ఎదురుగా కూర్చుంటే లేవలేని వాడిని (ఈ పాలె "కాపు" టికెట్స్ కు ఇలాంటి నిదర్శనాలు ఎన్నొ) ఎందుకు చాలా కష్టపడి నిలబెట్టారో ఒక్క సారి అలోచిస్తే అర్ధమవుతుంది.
ఇప్పుడు పబ్లిక్ గా ఆటలో అరటిపండు చేసినందుకు కసి రావాల్సింది, టికెట్స్ అప్పుడు ఆటలో అరటిపండులయిన వాసిరెడ్డి పద్మలకో, గలభా రాణిలకో కాదు, పార్టీ ని రోడ్డులో పెట్టి అమ్మటానికి రెడీ అయిన ఆత్మబంధువు కం బామ్మర్ది కం డైరెక్టర్ కం నిర్మాతకు. ఆయన ఎలా చెబితే అలా నడిచే మన అందరివాడయిన జీరో లాగా ప్రవర్తిసున్న హీరో గారికి.
వివరణ అంటూ అడగాల్సింది అయినా, వాళ్లు చెప్పుకోవాల్సింది అయినా వాళ్ల మీద ఇంకా నమ్మకం చావని మీలాంటి కొద్ది మంది నిజమయిన అభిమానులకు.
వివరణ అంటూ అడగాల్సింది అయినా, వాళ్లు చెప్పుకోవాల్సింది అయినా వాళ్ల మీద ఇంకా నమ్మకం చావని మీలాంటి (bahu) కొద్ది మంది నిజమయిన అభిమానులకు.
Great comment.
రాజకీయాల పైన నాకు కాస్త అవగాహన తక్కువే..నేను "ప్రజారాజ్యం" వస్తుంది ప్రజల రాజ్యం వస్తుంది అనుకున్నా ..
I am not a fan of PRP however expected a good change in state after elections.
Post a Comment