చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతు, లక్ష కోట్ల బడ్జెట్ తో దేశం లోనే అతి పెద్ద రాష్ట్రం గా ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రాన్నే అగ్నిగుండం గా మార్చేశాడు కెసిఆర్. పొత్తు పెట్టుకోని కూడా పట్టుమని పది సీట్లు గెలవలేని వీ(రు)డు ఇంక భవిష్యత్తు అంధకారమే కానున్న తరుణo లో ఏదో ఒకటి చేసి పూర్వ వైభవం తేవటం కోసం రాష్ట్రాన్నే పణంగా పెట్టాడు.
దీనికోసం వీడు వేయని ఎత్తు లేదు. యూనివర్సిటీలకు వెళ్ళి మీకు ప్రభుత్వోద్యోగాలు రాక పోవటానికి కారణం ఆంధ్రా వాళ్ళు అని రెచ్చగొట్టాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి పాపం పుణ్యం లేకుండా విద్యార్ధులు చదువుకొనే యూనివర్సిటీలల్లో రాజకీయ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అయినా ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలు ఎన్నున్నాయి? ఎంత మందికి వస్తున్నాయి అని ఆలోచించే విచక్షణ కూడా లేదా యూనివర్సిటీ విద్యార్ధులకు? ఒక వేళ తెలంగాణా వస్తే వీళ్లందరికి ఉద్యోగాలు వస్తాయి అని కెసిఆర్ గారెంటీ ఇస్తాడా?
ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు మాట్లాడే వాళ్లందరి ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహాన్ని తయారు చేసుకుంటే దానికి తెలంగాణా ఉద్యమానికి సంబంధం ఏంటి? బుద్ధున్న వాడు ఎవడైనా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా? పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఎంత వరకు సబబు?
పాపం తెలుగు వాళ్ళ రాష్ట్రం ఏర్పడుతుంది కదా అని తమ సొంత రాజధానినే త్యాగం చేశారు సీమ వాసులు. కర్నూల్ రాజధానిగా కొనసాగి ఉంటే కర్నూల్ ఈ యాభై యేళ్లలో ఎంతలా అభివృద్ధి చెంది ఉండేది? హైదరాబాదు మన అందరి రాజధాని అనే కదా అందరూ అక్కడ పెట్టుబడులు పెట్టింది? హైదరాబాదు ఒక్క తెలంగాణా రాజధాని అయ్యుంటే అన్నీ పెట్టుబదులు వచ్చి ఉండేవేనా? 50 సంవత్సరాల క్రితమే విజయవాడ అన్నీ విషయాల్లో హైదరాబాదు కి సరి సమానంగా ఉండేది. అలాంటి విజయవాడ కి ఈ యాభై సంవత్సరాలలో ఎన్ని కంపనీలు వచ్చాయి? ఎంత అభివృధి జరిగింది?
రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మధ్య తరగతి సాఫ్ట్వేర్, ఫార్మా ఏంజనీర్లు, ఇతర ఉద్యోగులు, వ్యాపారులు 20 సంవత్సరాల హోంలోన్ అంటే సగం జీవితం సంపాదన పెట్టి హైదరాబాద్ లో ఇళ్లు కొంటున్నారు. అలా వచ్చిన డబ్బు వల్ల రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో అర ఎకరం పొలం ఉన్న వాళ్ళు కూడా కోటీశ్వరులయ్యి వాళ్ళ పిల్లల్ను ఇంటెర్నేషనల్ స్కూళ్లలో చదివిస్తూ స్కార్పియో లలో తిరుగుతున్నారు. ఇలాంటి ఉదాహరణలు కోస్తాంధ్ర, రాయలసీమ లో ఉన్నాయా? ఇలా జీవితాంతం సంపాదించుకొనే డబ్బుని హైదరాబాద్ కు దోచిపెడుతుంటే, సెట్లర్స్ దోచుకుంటున్నారు అని ప్రచారం చేశాడు కెసిఆర్. ఇంతకన్నా అబద్ధం ఇంకోటి ఉంటుందా? ఆమాటకొస్తే అసలు సెట్లెర్ కి నిర్వచనం ఏంటి? పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడా? పక్క ఊరి నుంచి వచ్చిన వాడా? లేక పక్క జిల్లా నుంచి వచ్చిన వాడా? హైదరాబాద్ లో 400 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు తెలంగాణా వాళ్ళు కూడా సెట్లర్స్ అని వాళ్లు కూడా హైదరాబాద్ ని దోచుకుంటున్నారు అంటే పరిస్థితి ఏంటి?
ఇక పోతే ఆంధ్రా వలస పాలకులు మనల్ని పాలిస్తున్నారు అని చేసిన ప్రచారం ఇంకోటి. తెలంగాణ నుంచి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, దేశానికి ప్రధాన మంత్రులు అయ్యారు కదా. మరి ఆప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు అలానే అనుకున్నారా? వాళ్ళకి అది ఆత్మ గౌరవ సమస్య అయిందా? తెలంగాణా లో నీటి ప్రాజెక్టులు లేవు అంటే తెలంగాణా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా కట్టలేదు కదా...మరి ఇది తెలంగాణా వాళ్ళ తప్పా లేక ఆంధ్రా వాళ్ళ తప్పా? తెలంగాణా కి జరిగిన మేలు ని గురించి ఎందుకు చెప్పరు ఈ పార్టీ వాళ్ళు? ప్రతిష్టాత్మక ఐఐటి, ఇఎస్ బి, ఎన్ ఐ టి లు తెలంగాణా లో మాత్రమే ఉన్నాయి. ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్, రెడ్డీస్, భెల్, సింగరేణి, మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీ, అంతర్జాతీయ విమానాశ్రయం ఇలా ఎన్నో తెలంగాణా లో ఉన్నాయి. వీటి వల్ల ఎంతో మంది తెలంగాణా వారికి మేలు జరుగుతుంది. ఇవన్నీ మర్చిపోయి నాణానికి ఒక వైపు మాత్రమే చూపించి జనాలను మభ్యపెడుతున్నాడు కెసిఆర్. విచిత్రం ఏంటంటే మిగతా అన్నీ పార్టీలు కూడా ఈ అవకాశ వాదానికి మద్దతు ఇవ్వటం.
తెలంగాణా వెనకాపడి ఉంటే దానికి కారణం అక్కడ ఉన్న రాజకీయ నాయకులు, దానికి విరుగుడు ప్రత్యేక రాష్ట్రం ఎంత మాత్రం కాదు. ప్రత్యేక రాష్ట్రం రాగానే తెలంగాణా లో ఉన్న ఇబ్బందులు అన్నీ పోతాయనుకుంటే అంత కన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. అసలు కెసిఆర్ కి ప్రత్యేక రాష్ట్రం వచ్చాక అబివృద్ధి ఎలా చేయాలి అన్న దానికి మీద కొంచెం అవగాహన అన్నా ఉందా?
ఇక పోతే ఈ చిచ్చు లో కెసిఆర్ తర్వాత పెద్ద విలన్ మీడియా. ఒకటే సంఘటన ని పదే పదే రెవైండ్ చేస్తూ మరీ చూపిస్తూ సామాన్య జనానికి పిచ్చి ఎక్కుస్తున్నారు. వీళ్లకి కెసిఆర్, టిఆర్ఎస్ వాళ్ళు ఏడి చెప్పినా సెన్సేషనే, ఆ రోజంతా అదే వేస్తుంటారు అదేంటో మరి. మొత్తానికి ఆమరణ నిరాహార దీక్షకి కొత్త భాష్యం చెప్పి తాను సాధించాలనుకున్నది సాధించాడు ఈ కెసిఆర్. తన రాజకీయ మనుగడ కోసం తెలుగు ప్రజల మధ్య ఇప్పటివరకూ లేని స్పర్ధలు సృష్టించాడు. కెసిఆర్ లాంటి ఒక్క రాజకీయ నాయకుడుంటే ఇంకా రాష్ట్రానికి వేరే సమస్యలక్కర్లేదు. నిన్న టిజీ వెంకటేష్ చెప్పినట్లు కెసిఆర్ ఆమరణ దీక్ష చేసినా, లగడపాటి చేసినా వాళ్ళిద్దరికి ఏమీ కాదు, మధ్యలో అమాయకపు ప్రజలే బలి అవుతారు. ఇంకేముంది తెలుగు ప్రజలు తన్నుకు చావండి, అన్నెం పున్నెం ఎరుగని బస్సులను తగలబెట్టండి, దాడులు చేయండి, తెలుగు జాతినే నాశనం చేయండి.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
11 comments:
కెసీఅర్ ఆంధ్రజిన్న. జయశంకర్, రామయ్య, హరగోపాల్, నాగేశ్వర్, విద్యాసాగర్ ఈ తొట్టిగాంగు మజ్లిస్ కంటే నీచులు.
బోల్డు చప్పట్లు!
తెలంగాణా వస్తే లాభం ఎవరికి? మామూలు ప్రజా జీవితం ఏమీ మారదు. కానీ ఈ రాజకీయనయకుల స్వార్ధానికి మన రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయిపోయింది. ఎవరో విత్తు నాటి, చెట్టు పెంచి, చెట్టుకు కాయలు కాస్తుంటే, ఈ నేల నాది కనుక చెట్టు నాదే అన్నట్లు గా హైదరాబాదు కోసం తెలంగాణా వేర్పాటువాదులు వ్యవహరిస్తున్నారు. కానీ వీరు ఒక్క విషయం గమనించుకోవాలి. నేడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రమంతటా ప్రతీ కుటుంబం నుంచీ కనీసం ఒక వ్యక్తి అయినా హైదరాబాదు తో అనుబంధం కలిగి ఉన్నారు. అస్సలు తెలంగాణా రాష్ట్రం గురించి మాట్లాడే వారు వారి డబ్బును వారి ప్రాంత అభివృధ్ధికి ఎందుకు వినియోగించట్లేదు? పరిశ్రమలు ఎందుకు పెట్టట్లేదు? పారిశ్రామికంగా అభివృధ్ధి చెందాక - అన్నీ తెలంగాణా కి ఇచ్చేయ్యాలని అడగటం హాస్యాస్పదం. ఎందరో హైదరాబాదుకి అంతర్జాతీయ ప్రతిష్ట తెచ్చి పెడితే, ఈ వెధవ రాజకీయ నాయకుల వల్ల మన ప్రతిష్ట అంతా దిగజారిపోతోంది. ఇక కంపెనీలన్నీ ఏ బెంగుళూరు కో, పూనాకో పరుగులు పెడతాయి. అప్పుడు నష్టం ఎవ్వరికి? ప్రభుత్వ ఉద్యోగాలు ఎలానూ లేవు. ఇక ప్రైవేటు ఉద్యోగాలు కూడ పోతే, అందరూ ఏ ఊరికి వెళ్ళాలి? ఇది ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారికే కాదు, తెలంగాణా వారికి కూడా సమస్యనే కదా! అందుకే ప్రజలే వీరిని తిప్పి కొట్టాలి. కలిసి ఉంటే కలదు సుఖమని నిరూపించాలి.
very well said !
తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామంటూ భారత ప్రభుత్వం ప్రకటించిన క్షణం నుంచి రాష్ట్రంలో వాదోపవాదాలు బాగానే జరుగుతున్నాయి. తెలంగాణ ఎలా ఇస్తారంటూ ఆంధ్ర, రాయలసీమ నాయకులు రాజీనామాల రాజకీయానికి క్షణాల్లో తెరతీశారు.. ఆయా ప్రాంతాల ప్రజలూ భావోద్వేగంతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.. పొట్టిశ్రీరాములు అమర త్యాగంతో సాధించుకున్న రాషా్టన్న్రి ముక్కలు చేయవద్దని ఒకరు.. పెద్ద రాష్ట్రంగా ఉండకుండా చీల్చేందుకు చిదంబరం కుట్ర చేశారని మరి కొందరు.... కేవలం పదకొండు రోజులు నిరాహార దీక్ష చేస్తేనే తెలంగాణ ఇస్తారా అని విమర్శించే వారు ఇంకొందరు.. ఎందుకో తెలియదు కానీ,సమైక్యంగా ఉంటే చాలని ఇంకా కొందరు..... ఎవరికి తోచిన రీతిలో, ఎవరి మనసుకు ఎలా అనిపిస్తే అలా వారి వారి అభిప్రాయాలు చెప్తున్నారు.. తెలంగాణ ఎందుకు ఇవ్వాలో.. ఎందుకు ఇవ్వకూడదో ఇప్పటికైనా ముందుకు వచ్చి చర్చ చేస్తున్నందుకు సంతోషం... ఇది నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం.. ఈ విస్తృత చర్చ వల్ల ఆరు దశాబ్దాల సమస్యకు, ఉద్యమాలకు, ఉద్వేగాలకు పరిష్కారం లభిస్తే అంతకంటే కావలసిందేముంటుంది? పరిష్కారం లభించకుండా సద్దుమణిగితే, నివురు గప్పితే... నిప్పు ఎప్పుడైనా ఎగిసే ప్రమాదం ఉంటుంది.. భావోద్వేగాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, స్వార్థ ప్రయోజనాలకు దూరంగా, సంస్కారవంతమైన రీతిలో, అందరికీ గౌరవాన్ని కలిగించే విధంగా, మర్యాదలను అతిక్రమించకుండా ఒక అన్ని ప్రాంతాల ప్రజల సుఖ సంతోషాలకు అనుకూలంగా పరిష్కారాన్ని సూచించగలిగితే ప్రజలు సుభిక్షంగా ఉంటారు....మనకు కావలసింది నేతలు సుభిక్షంగా ఉండటం కాదు.. వారి వ్యాపారాలు సుసంపన్నం కావటం కాదు.. రియల్ వ్యాపారులు సమృద్ధిగా ఉండటం కాదు.. సామాన్య ప్రజలు ఉద్యోగాలు, ఉపాధి కల్పనలు, వనరుల వినియోగం, మనోభావాల పరిరక్షణ, భాష, యాస, పండుగ, పబ్బం, సంస్కృతి, నాగరికత, జాతీయతల పట్ల పరస్పర గౌరవ మర్యాదలతో, మన్ననలతో సుఖంగా, సంతోషంగా కలిసి మెలిసి ఉండేందుకు అవసరమైన పరిష్కారం సూచించగలగాలి... అన్ని ప్రాంతాల్లో ఎంతోమంది పెద్దలు ఉన్నారు. విజ్ఞులున్నారు... సావకాశంగా ఆలోచించండి.. సావధానంగా అవలోకించండి... ఆత్మను చంపుకోకుండా, నిజాయితీతో మనందరి క్షేమాన్ని, సంక్షేమాన్ని, సౌభ్రాతృతను దృష్టిలో ఉంచుకుని పరిష్కారాన్ని ఆలోచించండి...ప్రభుత్వానికి సూచించండి...
http://kovela.blogspot.com/2009/12/blog-post_14.html
there is no development in 50 years of united A.P, how can there be development continuing like this...when you can say that there wont be change if it is divided, then it should not be problem to people who oppose it.
Look at irrigation projects, atleast politicians will think about them when it is divided, if it still continues united then like always from 50 years projects will be in telangana..but water will go to coasta..why everybody make it look like split..why can't you understand the plight of telangana people...
(ఆంధ్రా వాళ్లు చెడ్డ వాళ్లు అని చెప్పడం నా ఉద్ధెశ్యం కాదు)
ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజల కంటె 20 ఎండ్లు ముందున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లెవల్ ప్లే గ్రౌండ్ కాదు. ప్రభుత్వ ఉద్యోగాలలో చాలా అన్యాయం జరిగింది. జోనుల వారిగా నియామకాలయ్యె రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో మన కండ్ల ముందె ఒపెన్ కాటగిరిని ఆంధ్రా వాళ్లతో నింపినారు. ఆంధ్రా జోనులలొ ఒపెన్ కాటగిరిని వారే నింపుకున్నారు. ఇది బాహటంగా జరిగింది.
ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో తెలంగాణకు అవకాశం లేదు. ఎందుకంటె రాష్ట్రాన్ని ఒక జోను/యూనిట్ గా చూస్తారు కాబట్టి.
అదే తెలంగాణ ఒక రాష్ట్రమైతె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వారికి చాలా దక్కేవి. మీరు గమనించండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రైల్వేస్ లొ, ఎల్.ఈ.సి లో, పబ్లిక్ సెక్టార్లలో ,బ్యాంకింగ్ లో అంతా ఆంధ్రా వాళ్లె ఉంటారు.
ఒక ఉదాహరణ
17 ఎండ్ల క్రితం నేను ఒక ఆర్.ఇ.సి (ఇప్పుడు ఎన్.ఐ.టి) లో చేరాను 4 సంవత్సరాల కోర్సు లోని మన రాష్ట్ర కోటా 50 సీట్లలో ముగ్గురం మాత్రమే తెలంగాణ వాళ్లం. ఎందుకంటె ఇతర రాష్ట్ర ఆర్.ఇ.సి.లలో జోనల్ సిస్టమును పక్కకు పెట్టి బాహటంగా ఆంధ్రా వాళ్లతొ నింపుతున్నారు.. కాబట్టి ఆంధ్రా వాళ్లతొ నిండిపోయింది.
ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే లేవు కదా అంటున్నారు. అవును లేవు. కాని జరగవలసిన నష్టం అంచనాలకందనిది. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక గ్రామీణ వ్యవసాయ/వృత్తి దారుని(మొదటి జనరేషన్) బిడ్డను వారి పూర్వికుల వృత్తి నుండి బయటకు పంపె ఒక బ్రిడ్జ్ వంటిది.. తెలంగాణలో పట్టణానికి వచ్చి వ్యాపారం చేయడం, ఇండస్ట్రి పెట్టడం రెండవ జనరేషన్ కు వీలు కాదు. ఈ రెండవ జనరేషన్ కు ప్రభుత్వ ఉద్యోగం అవసరం. దాన్ని వారికి దక్కనివ్వలేదు. ఉద్యోగాలు దక్కి ఉంటె, ఇప్పటి మూడవ జనరేషన్ పెట్టుబడులు పెట్టి, వ్యాపారం, ఇండస్ట్రి పెట్టుకొని ఆంధ్రా వారితో సరితూగేవారు.
ఉద్యోగాలు వదిలెయ్యండి.
ఇతర రంగాలకు నిధులు ఆంధ్రాకు అధికంగా పోతున్నాయి వాటికి ప్రభుత్వ లెక్కలే ఉన్నాయి. నేను గత 16 ఏండ్లనుండి ప్రభుత్వం లో ఉన్నాను. నిధులు కెటాయింపులు ఎలాంటి పద్ధతి, విధి విధానాలు లేకుండా ఏ విధంగా చేస్తారో నాకు తెలుసు.
ఎన్ని చెప్పిన కడుపు నిండిన వాళ్లకు అర్ధమవుతుందా?
ఎలాంటి పరిశీలనలేకుండా, తెలంగాణ గురించి తెలుసుకోకుంట, హైద్రాబాద్ ను చూసి రాసెవాళ్ల కు చప్పట్లు కొట్టితే అంతకంటె ఘోరం లేదు.
ఒకే స్థాయి వాళ్లు కానప్పుడు సహజంగాజరిగేదే జరిగిందేమో, విడిపోయి, స్నేహపూర్వకంగా ఉంటె మేలు.
తెలంగాణ నుంచి కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రులు, దేశానికి ప్రధాన మంత్రులు అయ్యారు కదా. మరి ఆప్పుడు మిగతా ప్రాంతాల వాళ్ళు అలానే అనుకున్నారా? వాళ్ళకి అది ఆత్మ గౌరవ సమస్య అయిందా? తెలంగాణా లో నీటి ప్రాజెక్టులు లేవు అంటే తెలంగాణా వాళ్ళు ముఖ్యమంత్రులు అయినా కూడా కట్టలేదు కదా...మరి ఇది తెలంగాణా వాళ్ళ తప్పా లేక ఆంధ్రా వాళ్ళ తప్పా?
=========
తెలంగాణా నుంచి ముఖ్యమంత్రులైన వాళ్ళందరి పరిపాలనా కాలం చూసినా, మొత్తంగా పట్టుమని పది సంవత్సరాలు ఉండదండి.
=========
చక్కగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతు, లక్ష కోట్ల బడ్జెట్ తో దేశం లోనే అతి పెద్ద రాష్ట్రం గా ముందుకు వెళ్తున్న రాష్ట్రంలో తన సొంత రాజకీయ భవిష్యత్తు కోసం రాష్ట్రాన్నే అగ్నిగుండం గా మార్చేశాడు కెసిఆర్.
==========
ఇప్పుడు లగడపాటి చేస్తున్నది కూడా అదే.
==========
ప్రాంతాలతో సంబంధం లేకుండా తెలుగు మాట్లాడే వాళ్లందరి ప్రతీకగా తెలుగు తల్లి విగ్రహాన్ని తయారు చేసుకుంటే దానికి తెలంగాణా ఉద్యమానికి సంబంధం ఏంటి? బుద్ధున్న వాడు ఎవడైనా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తాడా? పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ధ్వంసం చేయటం ఎంత వరకు సబబు?
===========
చాలా తప్పు. ఘోరం కూడాను. కానీ, మోకాలికి బట్టతలకు ముడేసి తెలంగాణావాదులు మూర్ఖంగా ప్రవర్తించారనుకోవచ్చు. కానీ, బి.ఎస్.ఎన్.ఎల్. కు ఈ వివాదంతో ఏం సంబంధం ఉన్నదని కోట్ల విలువైన కేబుల్సు సమైక్యవాదులు తగులబెట్టారు?
===========
యూనివర్సిటీలకు వెళ్ళి మీకు ప్రభుత్వోద్యోగాలు రాక పోవటానికి కారణం ఆంధ్రా వాళ్ళు అని రెచ్చగొట్టాడు. అసలు ఒక రాజకీయ నాయకుడికి పాపం పుణ్యం లేకుండా విద్యార్ధులు చదువుకొనే యూనివర్సిటీలల్లో రాజకీయ మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అయినా ఈ రోజుల్లో ప్రభుత్వోద్యోగాలు ఎన్నున్నాయి? ఎంత మందికి వస్తున్నాయి అని ఆలోచించే విచక్షణ కూడా లేదా యూనివర్సిటీ విద్యార్ధులకు?
=========
యూనివర్సిటీ విద్యార్ధులు కాబట్టే వారివారి విచక్షణా జ్ణానంతో ప్రత్యేక తెలంగాణానో, లేదంటే సమైక్య ఆంధ్రకో మద్దతు ఇస్తున్నారు. వాళ్ళు ఎలిమెంటరీ విద్యార్ధులు కాదు. తెలంగాణా యూనివర్సిటీలలోని విద్యార్ధులకు విచక్షణ లేదనుకుంటే, ఇటు ఆంధ్ర రాయలసీమ యూనివర్సిటీ విద్యార్ధులకు విచక్షణ లేదని చెబుతున్నట్లే.
Nice work Mr.
Wake up every Telugu
write/talk as much as you can on United AP.
This is not time to sleep.
baga chepparu sir na abhiprayalu kuda ive
Post a Comment