Monday, February 22, 2010

రైల్వే బడ్జెట్ గురించి ముందు చూపేది?




రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరగగానే అందరూ విమర్శించటం, కేంద్ర మంత్రులు కొద్దిగా అసంతృప్తి నటించి తర్వాత చిన్నగా ఒక వినతి పత్రం సమర్పించటం, దాన్ని రైల్వే వాళ్ళు ఒక చెత్త బుట్ట లో పడేయటం, ఒక వారం రోజులు కాగానే మీడియా ఇంకో కొత్త సంచలనాత్మక వార్తను ఎంచుకొని ఈ సమస్యను గాలికి వదిలేయటం, చిన్నగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోవటం. ఇది ప్రతి సంవత్సరం మార్చి లో మన రాష్ట్రం లో జరిగే తంతే. ఈ మాత్రం దానికి మనకు కేంద్రం లో మంత్రులు, MPs అవసరమా, రాష్ట్రంమ్ లో ప్రభుత్వం, ప్రతిపక్షం అవసరమా? ఇక 30 యేళ్లుగా రాజకీయాల్లో ఉండి, 9 యేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న పెద్దాయన, ఒక రోజు అకస్మాత్తుగా నిద్ర లేచి "అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా" అని ఒక statement మీడియా కి పడేసి మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వస్తుందా అని చూస్తుంటాడు తప్పితే ప్రభుత్వానికి constructive గా ఒక్క సలహా కూడా ఇవ్వడు, ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి చేయడు. అంతా అయ్యాక విమర్శించటానికి మాత్రం రెడీ.

anyways, I really appreciate chiru for doing this


2 comments:

రవిచంద్ర said...

అవునండీ ఇది చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. అలాగే బడ్జెట్ ప్రవేశ పెట్టాక మన రాష్ట్రానికి అన్యాయం జరిగితే కేంద్రంతో రాజీలేని పోరాటం సలిపే నాయకుడు కావాలి.

Anonymous said...

sir, you are right.చిరు ఇప్పుడిప్పుడే సరియైన రీతిలో సాగుతున్నాడు. బాబుకు ఎప్పుడూ ఏడవటమే పని. మంచిని మనస్ఫూర్తిగా మెచ్చుకునే గుణంకానీ మనసారా నవ్వటంకానీ చంద్రబాబుకు చేతకావు. అతను, గాలి ముద్దుకృష్ణమ ఎందుకో ఎప్పుడూ మొరిచి మొరిచి చూస్తు మటమటలాడుతుంటారు.