అందరూ indian idol లో తెలుగు తేజం అంటూంటే నేను కూడా ఉత్సాహంగా ఒకట్రెండు తెలుగు ఛానళ్ల వాళ్ళు ఈ పోటీ గురించి, ఈ పోటీలో అతను పాడిన పాటలను చూపిస్తూ వేసిన కార్యక్రమాలు చూసాను. ఇక పోతే ఇక్కడ నేను మాట్లాడేది అతను బాగా పాడాడా లేదా అన్న విషయం కాదు, అతను అందరికన్నా బాగా పాడాడు. అయితే నాకేంటి? ఆ కార్యక్రమం నేను చూడటానికి ఏకైక కారణం అతను తెలుగు వాడు కాబట్టి. ఇక ఆ కార్యక్రమం లో హేమమాలిని అతన్ని రెండు మూడు ప్రశ్నలు తెలుగు లో అడిగింది. అతను ఒకట్రెండు ప్రశ్నలకు తెలుగు లో జవాబు చెప్పి ఆమె తెలుగు లో మాట్లాడుతున్నా ఇతడు హిందీ అందుకున్నాడు. సరే కదా అని ఆ కార్యక్రమం చూస్తుంటే ఒకళ్లెవరో మీ south కి సంబంధించిన ఒక dialog చెప్పండి అని ఎవరో అడిగారు అతన్ని. వెంటనే అతను రజనీకాంత్ ఏదో ఒక సినిమాలోని ఒక తమిళ డైలాగ్ చెప్పాడు. కనీసం రజనీకాంత్ నటించిన తెలుగు డైలాగ్ ఏమన్నా చెప్పినా నాకు ok అనిపించేదేమో.
మరి అతను ఎన్ని పాటలు పాడాడో అందులో తెలుగు పాటలు ఎన్ని ఉన్నాయో నాకు అసలు తెలియదు. జాతీయ స్థాయి లో వచ్చే కార్యక్రమం లో అతను కల్పించుకు మరీ తెలుగు పాట పాడాల్సిన అవసరం లేదు, తెలుగు మాటలు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఒకళ్లు request చేసిన తర్వాత కూడా అతను తెలుగు కి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం నాకు నచ్చలేదు. కాబట్టి నేను vote వెయ్యలేదు.