Wednesday, September 15, 2010

చంద్ర బాబు కి అభినందనలు

తెలంగాణ రైతులు రోడ్లెక్కి ఎరువుల కోసం రాస్తా రోకోలు చేస్తుంటే so called తెలంగాణ నాయకులం అని చెప్పుకొనే ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్రిక్త పరిస్తుతులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ సమస్య రాష్ట్రం మొత్తం వినపడేలా చేసినందుకు బాబు కు అభినందనలు.
చిన్నప్పుడు క్లాస్ లో చివరి బెంచి లో కూర్చొని గొడవ చేస్తున్న కొంత మందిని మా టీచర్ ఇలా తిట్టే వాళ్ళు "ఒరేయ్ నువ్వు ఎలాగూ చదివి చచ్చేది లేదు ఎందుకురా పక్కన వాళ్ళని కూడా చెడగొడతావ్" అని. సరిగ్గా ఇది kcr కి వర్తిస్తుంది. తెలంగాణ వారి ప్రయోజనాల కోసం ఈ మహానుభావుడు చేసిన ఒక్క మంచి పని లేదు, అది సరి కదా, కనీసం ప్రజల సమస్యల మీద వేరే పార్టీ వారు ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళను కూడా చేయనీయడు. వీడి ఉద్దేశం ఎంతో అర్థం కాదు. ఆ రైతులు ఎరువులు దొరక్క వాళ్ళ శ్రమ అంతా వృధా కావాలని వీడి కొరికేమో మరి. బాబ్లీ మీద ఉద్యమం చేస్తుంటే ఎన్నికలున్నాయని చేస్తున్నారు అంటాడు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, మరి ఇప్పుడు ఈ ఏడుపు ఏంటో అర్థం కాదు. పక్క రాష్ట్రం వాడు మన నీళ్ళు దోచుకుంటే మనకు నష్టం లేదు, అదే గోదావరి చివరలో ఒక ప్రాజెక్ట్ కడుతుంటే దాని మీద పది ఏడుస్తాడు. ఒక వేరే దేశపు యువతి ఒక పార్టీ కి అధ్యక్షురాలుగా ఉంటే మనకు నష్టం లేదు, సాటి తెలుగు వాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగు దేశం ఆంధ్ర పార్టీ అని చెత్త ప్రచారాలు మొదలు పెడతాడు. నిజం చెప్పాలంటే తెలంగాణ మీద నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళని నిలదీయకుండా ఎంత సేపు తెలుగుదేశాన్ని target చేసి kcr చేసే విష ప్రచారాలు వీడు కాంగ్రెస్ తో కుమ్మక్కయిన విషయాన్ని చెప్పకనే చెపుతున్నాయి.
కాకపోతే ఇక్కడ తెలుగు దేశం కూడా కొన్ని సందర్భాలలో నిందించాలి. జగన్ తెలంగాణ వస్తుంటే మొట్ట మొదట జగన్ ను ఇక్కడ తిరగనివ్వం అని ఎర్రబల్లి చేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఇలా వాళ్ళ రాజకీయ ప్రత్యర్ధులను అడ్డుకోవటానికి మొదట తెలంగాణ వాదాన్ని వాడుకోవటానికి ప్రయత్నించింది తెలుగు దేశం వాళ్ళే. ఇప్పుడు అదే వాళ్ళకి ఎసరు పెట్టింది.
ఇక పోతే బాబు కాన్వాయ్ మీద దాడి అందరూ ముక్త కంఠం తో ఖండించాల్సిన విషయం. దేశం లో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేని kcr అండ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు బుద్ధి ఎప్పుడూ వస్తుందో అర్థం కావటం లేదు. చివరికి బాబు పై ఈ దాడిని కూడా రాజకీయ పార్టీల నాయకులు ('చిరు' మినహా)ఖండించలేక పోగా, ఇందులో తప్పేమీ లేదు అన్నట్లు మాట్లాడిన kcr, vh లు నేటి రాజకీయాల దిగజారుడు తనానికి నిదర్శనం. ఏది ఏమైనా బాబు కి హృదయ పూర్వక అభినందనలు.

5 comments:

Anonymous said...

ఒక వేరే దేశపు యువతి ఒక పార్టీ కి అధ్యక్షురాలుగా ఉంటే మనకు నష్టం లేదు, సాటి తెలుగు వాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగు దేశం ఆంధ్ర పార్టీ అని చెత్త ప్రచారాలు మొదలు పెడతాడు.

its too good...........

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

This man KCR is a lunatic.

kiran said...

you made sensible points. అయినా ఎంత ధైర్నం అండి మీకు మా ముక్కు మా రాజునే విమర్శిస్తారా, ఎంత కరెక్టు అయినా సరే మీరు అలా అడగొద్దంతే

Ravi said...

"వాడు... వీడు..." అని అసభ్యంగా రాయడం దేనికి పుల్లయ్యా ?
కొంచం సభ్యత, సంయమనం పాటించు. !

ప్రత్యేక తెలంగాణా కు అనుకూలంగా పార్టీ పరంగా తీర్మానం చేసి ,
ప్రణబ్ కమిటీకి తెలంగాణాకు అనుకూలంగా లేఖ కూడా ఇచ్చి,
టీ ఆర్ ఎస్ పార్టీ తో పొత్తు కూడా పెట్టుకుని,
మీరు బిల్లు పెట్టండి మేం మద్దతిస్తాం అని దొంగ మాటలు చెప్పి
తీరా తెలంగాణాకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వ ప్రకటన వెలువడగానే
ప్లేటు ఫిరాయించడం,
రెండు కళ్ళ డ్రామా లాడటం,
తెలంగాణా లో 400 మంది యువకులు ఆత్మ హత్యలు చేసుకున్నా స్పందించకపోవడం లో
మీకు ఎలాంటి రాజకీయ దిగజారుడు తనం కనిపించడం లేదా,?

sudhi said...

@Ravi: కేక question అన్న ! aripinchinav..

@పుల్లయ్య.. బ్లాగ్ నడుపుతున్నందుకు కొంచెం నిజాలు రాయండి మీకు కోటి దండాలు !