Friday, December 31, 2010

రాజకీయ బలప్రయోగాలు vs రాజకీయ చేయూత

ప్రార్ధించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు మరణించారు, ఇంకా మారనిస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయం పక్కన పెడితే ప్రతిపశాలు మాత్రం దీక్ష లు, గర్జనలు అంటూ తెగ గోల చేస్తున్నాయి.

జగన్ లక్ష దీక్ష అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది ఒక నిరాహార దీక్ష లా కాకుండా ఒక బల పరీక్ష లాగా, ఒక పార్టీ announcement సభ లాగా జరిగింది. కొత్తగా రిలీస్ అయ్యే సినిమా కి పబ్లిసిటీ కి ఎంత ఖర్చు పెడతారో అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టారు ప్రచారం కోసం ఒక్క కృష్ణా జిల్లాలోనే. ప్రతి ఊళ్లో వందల పోస్టర్లు బానర్లు కట్టారు. ఒక మనిషి దగ్గర లక్ష కోట్లు ఉంటే మీడియా మొత్తాన్ని కొని, ఇంకా డబ్బులతో ఏమేమి చేయవచ్చో దానికి ఈ దీక్ష, జగన్ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దీక్ష కు పెట్టిన ఖర్చు తో రైతులను ఆడుకోవచ్చు కదా అంటే ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే ఇతనికి కావాల్సింది బలపరీక్ష కానీ రైతు సంక్షేమం కాదు. ఈ దీక్ష వల్ల రైతులకు ఒరిగింది పేద్ద గుండు సున్నా.


ఇక చంద్ర బాబు దీక్షలో పెద్దగా హంగు ఆర్భాటాలు లేవు. కాకపోతే తెలివిగా ప్రచారం కోసం డబ్బులు ఖర్చుపెట్టకుండా, తెలివిగా (ఊరు, పేరు లేని) జాతీయ నేతలతో హంగామా చేసి వాళ్ల కోసం ప్రత్యేక విమానాలు ఈర్పాటు చేసి చివరికి ప్రభుత్వం కొద్దిగా కూడా స్పందించకపోవటంతో సమ్మగా చిన్న డ్రామా ఆది సర్దుకున్నాడు. ఇక ఇప్పుడు బలపరీక్ష మొదలు పెట్టింది తెలుగు దేశం కూడా. రైతుకోసం అని పేరు పెట్టి ఈ సభ కోసం మరి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. ఇక వీళ్ళ సొంత మీడియా దీనికి ఇస్తున్న coverage అంతా ఇంతా కాదు. ఇక్కడ కూడా రైతులకు ఒరిగేది ఏమీ లేదు. బండి సున్నా.


ఇక మన అభిమాన నేత kcr తెలంగాణ లో ఇంత మంది రైతులు చనిపోయిన అసలు చీమా కూడా కుట్టినట్లు లేదు ఇతనికి. కనీసం తెలంగాణ రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాకముందే ఇతను ఇలా ఉంటే ఇక తెలంగాణ వచ్చాక ఏంచేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ సున్నా కూడా అనవసరం. నో సున్నా


వీళ్లందరితో పోల్చుకుంటే అంత వనరులు లేకపోయినా, హంగు ఆర్భాటం లేకుండా చిరు అందిస్తున్న సహకారం అభినందనీయం. పై రెండు దీక్షలపై వచ్చిన కధానాలలో కనీసం వందో వంతు కధానాలు కూడా 'చిరు' సహాయం గురించి కనిపించదు మన మీడియా లో. వీరు అందించే 25 వేలు చాలా తక్కువ మొత్తం అయ్యుండొచ్చు. కానీ చనిపోయిన రైతు కుటుంబాలలో ఇదే కొంచెం ధైర్యాన్ని నింపుతుంది.














Friday, December 10, 2010

తెలంగాణ పై వివక్ష

తెలంగాణ పై పాలకులే కాకుండా ప్రకృతి కూడా వివక్ష చూపుతుంది. గత సంవత్సర కాలంగా వచ్చిన తుపానులే ఇందుకు నిదర్శనం. లైలా, జల్ తుఫానులు కోస్తా జిల్లాలో భారీ పంట నష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. జల్ తుఫాను అయిన 10 రోజుల తర్వాత కూడా విజయవాడ నుంచి నేను తిరుపతి వెళ్తుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో నీటిలో మునగకుండా ఒక్క పంట పొలం కూడా కనిపించలేదు. అంతలా దెబ్బ కొట్టింది ఆ తుఫాను. ఈ సంవత్సరం మొదట్లో బాగా వర్షాలు పడటం తో పంట కూడా కొద్దిగా త్వరగా కోతకొచ్చే సమయం లో జల్ తుఫాను కోస్తా జిల్లాలలో రైతులకు గుండె కోత ను మాత్రమే మిగిల్చింది. జల్ తుఫానులో అంతగా నష్టం జరగని జిల్లాలలో ఈ వారం వచ్చిన తుఫాను వల్ల ఎక్కువ అప్పుడు బయటపడి బట్టగట్టిన పంటలు కూడా నాశనం అయిపోయాయి.

ఈ లింక్ http://disastermanagement.ap.gov.in/website/cyclone.htm చూస్తే కనక గత వంద సంవత్సరాలలో వందకు పైగా తుఫానులు కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసినట్లు తెలుస్తుంది. ఇంకొంచెం గమనిస్తే నీళ్ళు బాగా ఉండి పంటలు బాగా పండుతాయి ఆనుకొనే గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తుఫానుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

యేతా వాతా నేను చెప్పొచ్చేదేంటంటే తుఫానులు కూడా తెలంగాణ పై వివక్ష చూపుతున్నాయి. ఈ తుఫానులు కొద్దో గోప్పో తెలంగాణ లోనూ ప్రతాపం చూపుతున్నా, కోస్తా తో పోలిస్తే తెలంగాణ జిల్లాలలో జరిగే నష్టం కొంచెమే. మా నీళ్ళు దోచుకుంటున్నారు అని తెగ బాధ పడే తెలంగాణా వాదులు (అందరు తెలంగాణ వాదులు కాదు...కొంత మంది మాత్రమే) తుఫానులలో కూడా తెలంగాణ కు వాటా కావాలని కోరుకోరెoదుకు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తుఫానులు చూపుతున్న వివక్ష ను ఖండిస్తూ తుఫాను దిష్టి బొమ్మ దగ్ధం చేసి తెలంగాణ వ్యాప్త బంద్ కు OU JAC పిలుపు ఇవ్వాలని ఆశిస్తున్నాను.

Friday, December 3, 2010

"ఆరెంజ్" సినిమా "బానే ఉంది"

PS: అదిరింది > బాగుంది > బానే ఉంది > average > చెత్త

సినిమా ని variety గా cut చేసి చూస్తే ఇలా ఉంది

ఫస్ట్ హాఫ్:
మొదటి 20 నిముషాలు = average
తర్వాత గంట = బాగుంది
సెకండ్ హాఫ్:
ఫ్లాష్ బ్యాక్ ముందు= బానే ఉంది
ఫ్లాష్ బాక్, ముగింపు = average

Overall: సినిమా "బానే ఉంది"
చివరి 40 నిముషాలు భాస్కర్ అంత convincing గా తీయలేక పోయాడు. But oveall pretty descent effort by Bhaskar and the movie is any day much better than regular telugu commercial flicks.

సినిమా లో నాకు నచ్చిన విషయాలు:

* first half బాగుంది
* రూబా రూబా పాట theatre లో అదిరిపోయింది. theatre sound system కి ఆ బీట్స్ సూపర్ గా వచ్చాయి. ఆ పాటలో ఒక step నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.
* చరణ్ చివర్లో జెనీలియా ని అనుకరించే సీన్ బాగుంది. జెనీలియా 'యో'..'యో' episode నచ్చింది నాకు.

ఎవరు ఈ సినిమా చూడొచ్చు:

* youth కు ఎక్కువ శాతం నచ్చే అవకాశం ఉంది ఈ సినిమా
* మీకు ఆర్య-2, డార్లింగ్ సినిమాలు నచ్చితే మీరు ఈ సినిమా కూడా ఒక సారి try చేయొచ్చు.

ఎవరికి నచ్చదు ఈ సినిమా:
పొరపాటున మీకు బృందావనం, సింహా, కొమరం పులి లేకపోతే రవితేజ సినిమాలు నచ్చాయనుకోండి మీరు ఈ సినిమా కి వెళ్లకపోవటం బెటర్. ఎందుకంటే ఈ సినిమా లో బృందావనం లో లాంటి అద్భుతమైన bus ఫైట్ లాంటి ఫైట్ గానీ లేకపోతే JNTR sound రాకుండా బృందావనం లో చేసిన ఫైట్ ఇలాంటివి ఈ సినిమాలో ఉండవు. కాబట్టి మీరు సాధ్యమైనంత దూరంగా ఉంటే better.