Friday, December 31, 2010

రాజకీయ బలప్రయోగాలు vs రాజకీయ చేయూత

ప్రార్ధించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు మరణించారు, ఇంకా మారనిస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయం పక్కన పెడితే ప్రతిపశాలు మాత్రం దీక్ష లు, గర్జనలు అంటూ తెగ గోల చేస్తున్నాయి.

జగన్ లక్ష దీక్ష అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది ఒక నిరాహార దీక్ష లా కాకుండా ఒక బల పరీక్ష లాగా, ఒక పార్టీ announcement సభ లాగా జరిగింది. కొత్తగా రిలీస్ అయ్యే సినిమా కి పబ్లిసిటీ కి ఎంత ఖర్చు పెడతారో అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టారు ప్రచారం కోసం ఒక్క కృష్ణా జిల్లాలోనే. ప్రతి ఊళ్లో వందల పోస్టర్లు బానర్లు కట్టారు. ఒక మనిషి దగ్గర లక్ష కోట్లు ఉంటే మీడియా మొత్తాన్ని కొని, ఇంకా డబ్బులతో ఏమేమి చేయవచ్చో దానికి ఈ దీక్ష, జగన్ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దీక్ష కు పెట్టిన ఖర్చు తో రైతులను ఆడుకోవచ్చు కదా అంటే ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే ఇతనికి కావాల్సింది బలపరీక్ష కానీ రైతు సంక్షేమం కాదు. ఈ దీక్ష వల్ల రైతులకు ఒరిగింది పేద్ద గుండు సున్నా.


ఇక చంద్ర బాబు దీక్షలో పెద్దగా హంగు ఆర్భాటాలు లేవు. కాకపోతే తెలివిగా ప్రచారం కోసం డబ్బులు ఖర్చుపెట్టకుండా, తెలివిగా (ఊరు, పేరు లేని) జాతీయ నేతలతో హంగామా చేసి వాళ్ల కోసం ప్రత్యేక విమానాలు ఈర్పాటు చేసి చివరికి ప్రభుత్వం కొద్దిగా కూడా స్పందించకపోవటంతో సమ్మగా చిన్న డ్రామా ఆది సర్దుకున్నాడు. ఇక ఇప్పుడు బలపరీక్ష మొదలు పెట్టింది తెలుగు దేశం కూడా. రైతుకోసం అని పేరు పెట్టి ఈ సభ కోసం మరి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. ఇక వీళ్ళ సొంత మీడియా దీనికి ఇస్తున్న coverage అంతా ఇంతా కాదు. ఇక్కడ కూడా రైతులకు ఒరిగేది ఏమీ లేదు. బండి సున్నా.


ఇక మన అభిమాన నేత kcr తెలంగాణ లో ఇంత మంది రైతులు చనిపోయిన అసలు చీమా కూడా కుట్టినట్లు లేదు ఇతనికి. కనీసం తెలంగాణ రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాకముందే ఇతను ఇలా ఉంటే ఇక తెలంగాణ వచ్చాక ఏంచేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ సున్నా కూడా అనవసరం. నో సున్నా


వీళ్లందరితో పోల్చుకుంటే అంత వనరులు లేకపోయినా, హంగు ఆర్భాటం లేకుండా చిరు అందిస్తున్న సహకారం అభినందనీయం. పై రెండు దీక్షలపై వచ్చిన కధానాలలో కనీసం వందో వంతు కధానాలు కూడా 'చిరు' సహాయం గురించి కనిపించదు మన మీడియా లో. వీరు అందించే 25 వేలు చాలా తక్కువ మొత్తం అయ్యుండొచ్చు. కానీ చనిపోయిన రైతు కుటుంబాలలో ఇదే కొంచెం ధైర్యాన్ని నింపుతుంది.














3 comments:

Anonymous said...

మీరు చెప్పింది నిజం. బాబు జగన్ కంటే చిరు స్పందన హుందాగా ఉంది. బాబు ఉపవాసంతో జగన్ పలహారంతో సాధించినది బూడిద.

Anonymous said...

ఇప్పుడున్న మీడియా ఏదో ఒక రాజకీయపార్టీ కాల్లు నాకుతున్నాయి కాబట్టి చిరుకి స్వంత మీడియా అవసరం ఉంది.

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

గంగి గోవు పాలు గరిటెడైన చాలు అన్నట్టు చిరంజీవి చేసిన చిన్న సాయం జగన్ చేసిన లిమిటెడ్ మెగా దీక్ష కన్నా ఎన్నో రెట్లు బెటర్.