ఈ సినిమా ఇంకా చూడలేదు కానీ ఈ సినిమా విడుదలకు ముందు OU జేఏసి అని చెప్పుకొనే కొంత మంది వ్యాఖ్యల గురించి ఈ టపా.
విడుదలకు రెండు నెలల ముందు నుంచి వీరి ఆరోపణలకు నవ్వాలో ఏడవాలో అర్థం అయ్యేది కాదు. అప్పుడు తెలుగు సినిమా వాళ్ళు ఏదో strike అని షూటింగ్లు ఆపేస్తే అది ఈ సినిమా ని అడ్డుకోవటానికి నిర్మాతల మండలి లో ఉన్న సీమంధ్రులు ప్రయత్నిస్తున్నారు అని ఒక అర్థం లేని ఆరోపణ. ఈ సినిమా కు permission ఇవ్వకపోతే సీమంధ్ర సినిమాలను ఆడనివ్వరట. సరే వీళ్లతో మనకెందుకు అనుకోని ఆ సినిమా కి షూటింగ్ చేసుకోమని permission ఇచ్చారు.
తర్వాత సెన్సార్ కి వెళ్లాక వాళ్ళు కొన్ని సన్నివేశాలు తొలగించాల్సిందిగా సూచించారట. మళ్ళీ లొల్లి మొదలు. "సెన్సార్ బోర్డ్ లో ఉన్న సీమంధ్ర వారు సినిమాను అడ్డుకుంటున్నారు..మేము సీమంధ్ర సినిమాలను అడ్డుకుంటాం" అని మళ్లీ ఇంకో ప్రకటన. సెన్సార్ బోర్డ్ లో ఉన్న సీమంధ్రులకు, నిర్మాతల మండలి లో ఉన్న సీమంధ్రులకు ఈ సినిమా ను ఆపటం తప్ప ఇంకేం పని పాట లేదు అని వీళ్ళ ఉద్దేశం కాబోలు. సరే సెన్సార్ బోర్డ్ వాళ్ళు కూడా ఈ ప్రాంతీయ గొడవలు మనకెందుకు అంటూ కేంద్ర సెన్సార్ బోర్డ్ వారికి ఈ సినిమా లోని కొన్ని అభ్యంతర కర సన్నివేశాలను చూపించి ఎలా ముందుకు వెళ్లలో మీరే సూచించండి అని అక్కడికి పంపించారు. వారు ఏవో సూచనలు ఇస్తే దాన్ని బట్టి సినిమా లో కొన్ని సన్నివేశాలు తొలగించారంట.
తెలంగాణ ఉద్యమం లో భాగంగా తెలంగాణ గురించి సినిమా తీసుకోవటం, ప్రత్యేక తెలంగాణ కావాలని కోరుకొనే హక్కు తెలంగాణ ప్రజలకు ఉంది కానీ ప్రతి దానికి సీమంధ్రుల మీద ఏడుపేంటో అర్థం కాదు. తుమ్మినా, దగ్గినా సీమంధ్రుల సినిమాలు అడ్డుకుంటారంట.
ఇక ఈ సినిమా విషయానికి వస్తే, టైమ్స్ ఆఫ్ ఇండియా లో ఈ సినిమా గురించి రాసిన ఈ వ్యాసం చూడండి.
ఈ సినిమాని అడ్డుకుంటే అది చేస్తాం ఇది చేస్తాం అని ప్రగల్భాలు పలికారే కానీ, ఈ సినిమా ని ప్రొడ్యూస్ చేయటానికి తెలంగాణ నుంచి ఒక్కరూ ముందుకు రాలేదు. దాంతో ఈ సినిమా దర్శకుడే ఈ సినిమా ప్రొడ్యూస్ చేయల్సోచింది. సినిమా హాళ్లలో పోస్టర్స్ లో చాలా చోట్ల kCR cutout లు పెట్టారు తెరాస వారు. సినిమా ని నిర్మించటానికి ఈ మహానుభావుడు ముందుకు రాడు కానీ అతను, వాళ్ళ పార్టీ ప్రచారం మాత్రం బాగా జరగాలి ఈ సినిమా ద్వారా. ఇక తెలంగాణ నుంచి కూడా ఈ సినిమా కి distributers కూడా అంతగా ఇంటరెస్ట్ చూపించట్లేదు అని రాశారు.
కాబట్టి OU JAC/TRS నాయకుల్లారా: తెలంగాణ లోనే ఇటువంటి మిశ్రమ స్పందన ఉంటే సీమాంధ్ర వాళ్ళు అడ్డుకుంటున్నారు, కుట్ర అంటూ సీమాంధ్ర వారి మీద నిందలు వేయటం ఎంత వరకు కరెక్ట్? తెలంగాణ కావాలంటే ఏ ప్రాతిపదికన కావాలో స్పష్టంగా చెప్పండి. అంతే కానీ లేని పోనీ ఆరోపణలలతో తెలుగు వారి మధ్య వైరుధ్యం పెంచకండి.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
3 comments:
మీరీ టైములో చిరంజీవి గురించి రాస్తే బాగుంటుంది.
అవును చిరంజీవి గురించి మాట్లాడకుండా టాపిక్ డైవర్ట్ చేస్తున్నావేమిటి :).
-రమణ
:)
Post a Comment