Monday, February 7, 2011

prp మూసేశారు...అందరూ పండగ చేసుకోండి.

TDP అభిమానులు: మీరు పండగ చేసుకోండి. prp వోట్లు చీల్చటం వల్లే ఓడిపోయాం అన్నది మీ వాదన కాబట్టి మీకు ఇది పెద్ద పండగే. ఇక మీ ఛానెల్స్ లో మీరు ఒక పార్టీ గురించి దుమ్మెత్తి పోయాల్సిన అవసరం లేదు. మీ పార్టీ గురించి గొప్పలు చెప్పుకుంటే సరిపోతుంది.

కాంగ్రెస్ అభిమానులు: మీరు కూడా పండగ చేసుకోండి. ప్రజారాజ్యం తెలుగు దేశం వొట్ల కన్నా మీ వోట్లే ఎక్కువ చీల్చింది అన్నది మీ భావన కాబట్టి మీకు కూడా మంచిదే. మీ పార్టీ కి free గా ఒక ప్రచార కర్త దొరికాడు కూడా.

prp అభిమానులు: హమ్మయ్య ప్రజా రాజ్యం పార్టీ ఇంక మూసేశారు. ఇంక ఎంత అడ్డమైన వెధవ చిరు ని కామెంట్ చేసీనా బాధ పాడాల్సిన అవసరం లేదు. పార్టీ గురించి ఎప్పుడు ఏ ఛానెల్ వాడు దుష్ప్రచారం చేస్తారో అన్న బెంగ లేదు. పార్టీ నుంచి ఎవరు బైటికి వెళ్లిపోతారో అన్న సందేహం లేదు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు గెలుస్తారో అన్న ఆలోచన అంతకన్నా లేదు.

చిరు అభిమానులు: మీకు పండగే పండగ. ఈ పాడు రాజకీయాలు మనకు వద్దు. మన 150 వ సినిమా కి లైన్ క్లియర్ అయిపోయింది. ఇంక దర్శకుడు ఎవరు? పాటలు ఎప్పుడు release అవుతాయి. సినిమా ఎలా ఉంటుంది అన్న ఆలోచనలతో మనం time pass చేసుకుందాం. :)

4 comments:

Anonymous said...

@వెన్నెలరాజ్యం,
:)

Unknown said...

You are right. This is good for our Chiru.

సుమలత said...

లైన్ క్లియర్ అయ్యింది ఇపట్టి దాక కాంగ్రేస్ పార్టి గొడవ లు వస్తే సియం ఎవరని చెయ్యాల అని

GKK said...

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపి మంచిపనే చేశాడు. ఎన్ని రకాలుగా అందరూ కలిసి పీక్కుతిన్నారో పాపం చిరుని. తనకేమో పార్టీ స్వంతంగా నడిపే సామర్థ్యం లేదు. this is the best option for him