మొన్న అక్బరుద్దీన్ మీద దాడి జరిగితే మన హరీష్ రావు statement అది సీమంధ్రుల కుట్ర అంట. ఇంకా నయం నిన్న లాడెన్ మీద అమెరికా దాడి కూడా సీమంధ్రుల కుట్ర అని, జూపల్లి మీద సీమంధ్రుల కుట్ర అని అనలేదు. లేకపోతే ఇంకో అడుగు ముందుకు వేసి ఇది సీమంధ్ర తేనెటీగల కుట్ర, సీమాంధ్ర తేనెటీగల దురహంకారానికి ప్రతీక అంటారేమో.
7 comments:
బాగా చెప్పారు. జలుబు చేసినా సీమాంధ్ర కుట్రే. అంత మూర్ఖంగా మాట్లాడుతున్నారు. ఇటువంటి పిచ్చిమాటలు పిచ్చి ఆలోచనలు తెలబాన్లకు పేటెంటు ఇవ్వవచ్చు.
తెలుగు అభిమాని గారితొ ఏకీభవిస్తున్నాను.
చిరంజీవికి తొడలు కొట్టీ కొట్టీ తొడలు వాచిపొయినాయట, ఇదెవరి కుట్రంటారు? జగన్ వర్గం కుట్రేమో.
@ "చిరంజీవికి తొడలు కొట్టీ కొట్తీ తొడలు వాచిపొయినాయట"
ఈ టపా సబ్జెక్టుకూ, మీ కామెంటుకూ ఏమయినా సంబంధముందా? పిచ్చిపువ్వులాగా కామెంటారు. రాజశేఖర్ దంపతులలాగా మీకూ ఏమయినా చిరంజీవి ఫోబియానా ఉందా
What happened to your prediction that Jai bolo Telangana will flop?
చివరి anonymous గారు,
జై బోలో తెలంగాణ flop అవుతుందని నేను ఎప్పుడూ చెప్పానండి?? మీకు తెలుగు వస్తే ఒక సారి నేను దాని మీద రాసిన టపా చూసి మళ్లీ ఇంకో anonymous comment పెట్టగలరు.
ఆంధ్ర తేనెటీగలు అన్న title చదివితే ప్రముఖ రచయిత అడవి బాపిరాజుగారి నవల "గోన గన్నారెడ్డి" లోని కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి.
"ఆంధ్రులు కందిరీగలవంటి వారు. కుట్టి-కుట్టి చంపగలరు"
పైగా - ఈ నవల 1950 లకు పూర్వమే రాయబడినదిగా గుర్తుంచుకోవాలి. అప్పటికింకా "సీమాంధ్రులు" అన్న పదమే పుట్టలేదు.
Post a Comment