చిన్నప్పుడు ఎప్పుడో ఎన్నికలు జరిగేటప్పుడు మా అమ్మ తో పోలింగ్ బూత్ లోకి వెళ్లి నేను కూడా చుక్క పెట్టించుకొని బడి లో అందరి దగ్గర ఫోస్ కొట్టేవాడిని వోట్ వేశానని చెప్పి. కొంచెం పెద్ద అయినప్పటినుంచి ఎప్పుడూ ఇంకా ఆ జోలికి పోలేదు. ఇంక చదువు అయ్యాక డిల్లీ లో ఒక ఆరేళ్లు ఉన్నా ఎప్పుడూ వోట్ కి దరఖాస్తు చేయలేదు. ఇక ఈ సారి ఎన్నికలు ఈ మధ్య వచ్చిన కొత్త పార్టీ ల వల్ల చాలా రంజు గా మారాయి. ఎందుకంటే ప్రధాన పార్టీల రేఖలు వాళ్ల బలం మీదే కాకుందా వాళ్ల నుంచి కొత్త పార్టీలకు చీలే వోట్ల మీద కూడా ఆధారపడి ఉన్నాయి. సరే ఏది ఏమైనా ఈమధ్యే నేను హైదరాబాదు రావటం, రాగానే వోట్ కి అప్లయి చేయటం, చేసిన ఇరవై రోజుల్లోనే అది రావటం అన్ని చక చకా జరిగిపోయాయి. మొత్తానికి మొదటి సారి వోట్ వేయబోతున్నాను కాబట్టి చాలా అనందం గా ఉంది.
నాలాగే మొదటి సారి వొటు హక్కు ఉపయోగించుకుంటున్న అందరికి శుభాకాంక్షలు, అభినందనలు, విజయం ప్రాప్తిరస్థు.