Monday, April 13, 2009

ప్రరాపా మానిఫెస్టో లో నాకు నచ్చిన అంశం

"గత పదిహేనేళ్లు గా రాష్ట్రం లో జరిగిన అవినీతి పై హై కోర్ట్ జడ్జ్ తో విచారణ". రాష్ట్రం లో గత ఐదు సంవత్సరాలలో విపరీత మైన అవినీతి జరిగింది అని అందరికి తెలుసు. ఇక మన గౌరవమైన ప్రతిపక్ష నాయకుడు చంద్ర బాబు గారు దీని మీద రాష్ట్ర పతి కి కూడా వినతి పత్రం సమర్పించారు. కాని ఆయన పొరపాటున అధికారం లోకి వస్తే మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు కూర్చుంటారు. ఎందుకంటే ఆయనదీ అదే జాతి కదా. ఆయన హయాం లో కూడా ఆయన మీద చాలా ఆరోపణలు వచ్చాయి. అఫ్కోర్స్, అప్పుడు ఆరోపణలు చేసిన రెడ్డి గారు కూడా అధికారం లోకి వచ్చాక వాటి మీద చర్య తీసుకోలేదు. ఒకప్పటి మిత్రులు కాబట్టి వాళ్లిద్దరి మధ్య అండర్ స్టాండింగ్ మొదటి నుంచి ఉంది అనుకుంటా. 


పిఎస్: బ్లాగు చదివిన వారి కోరిక మేరకు మానిఫెస్టో లింక్ ఇస్తున్నాను.  http://prajarajyam.org/2009/04/09/prajarajyam-manifesto/ 

12 comments:

చావాకిరణ్ said...

మీరు ఆ తానులోని ముక్కగురించేనా మాట్లాడేది ?

ఉట్టికెగరలేనమ్మ ఆకాశానికెగురుతానందంట.

గురివిందంతా ఎరుపనుకుందంట.

ఎట్ సెట్రా
ఎట్ సెట్రా

Anonymous said...

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం క్లిక్ చేయండి
http://24gantalu.blogspot.com/
- సతీష్ దేవళ్ళ

పుల్లాయన said...

chaava gaaru, meeru annadi okka mukka artham kaledu

ఏకాంతపు దిలీప్ said...

మొన్నటి వరకూ చిరంజీవి, చంద్రబాబూ ఫ్రెండ్సే కదండి... వాళ్ళిద్దరూ ఒకళ్ళింటికి ఒకళ్ళు వచ్చిపోయేవాళ్ళే కదా... చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబుని పొగిడి ప్రధానమంత్రి అవ్వాలి అన్న నోటితోనే ఈరోజు అవినీతి డబ్బు కక్కిస్తా అంటే ఎవడు నమ్ముతాడు?

పుల్లాయన said...

దిలీప్ గారు,

ఒక అభిప్రాయం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు కదండీ. ఇప్పుడు మీరు ఒకళ్లకి వోట్ వేస్తే జీవితాంతం వాళ్లకే వోట్ వేయరు కదా. వాళ్ల పని తీరుని బట్టి అభిప్రాయాలు మారుతుంటాయి. 1999 లో రెండో సారి బాబు ని గెలిపించిన ప్రజలు 2004 లో ఘోరంగా ఊడించారు కదా. ఒకప్పుడు సమైక్యాంధ్ర అన్న బాబు ఇప్పుడు తెలంగాణా అంటున్నాడు. కాలానుగుణంగా అన్ని మారుతుంటాయి.

ఏకాంతపు దిలీప్ said...

ఎలెక్షన్లు జరగకముందే చాలా మాటల మారిపోయినవి చిరు వి... ఆఖరికి దొంగ లెక్కలు కూడా చెప్పేసారు 104 బిసి లు అని... ఇప్పుడు 90 అంటున్నారు... చిరు మారరని ఇంక నమ్మకమెక్కడది?

పుల్లాయన said...

10 సేట్లే ఇచ్చాడు అనే వార్త గిట్టని వాళ్లు పుట్టించిన పుకారు అనుకుంటున్నాను నేను. అలా చేస్తే ఎవరినా దొరికిపోతారు ఎప్పటికైనా. చిరు అంత తిక్కలోడు అనుకోను నేను.

ఏకాంతపు దిలీప్ said...

నిజాలు వేరు, నమ్మకాలు వేరు... నమ్మకం గుడ్డిది... ఈ హిందూ లో వార్త చూడండి... రాంచరణ్ తేజ్ అన్నదే... తన మాటల్లో...

http://www.hindu.com/2009/04/14/stories/2009041453220400.htm

పుల్లాయన said...

రాం చరణ్ కి ఈ విషయం ఎంత తెలుసో తెలీదు కాని, జనాలను మోసం చేయటానికి అలా దిగజారుతారని నేను అనుకోను. ఎందుకంటే అది చాల తేలికగా బయట పడుతుంది కాబట్టి. ఇక పార్టీ సీటు ఆశించిన వాళ్లే తప్పుడు ఆధారాలతో ఇలా టికెట్ సంపాదిస్తే చేసేదెమి లేదు, వచ్చే ఎన్నికల్లో ఇంకొంచెం జాగ్రత్త పడటం తప్ప.

Anonymous said...

Is there a manisfesto exists for PRP ? could you please provide a link to soft copy or web page? I found PRP manifesto is very much reactive rather than coming from some analysis. They just want to grab something before thinking of anything.

oremuna said...

Yep,

If there is an online link, please give it. Would love to copy on my blog just like other blogs

పుల్లాయన said...

మీరు ప్రరాపా మానిఫెస్టో ఇక్కడ చూడొచ్చు.
http://prajarajyam.org/2009/04/09/prajarajyam-manifesto/
అలాగే మీకు ఓపిక ఉంటే ఈ లింక్ లో ఉన్న ప్రెజెంటేషన్ కూడా చూడండి.
http://www.slideshare.net/PrajaRajyam/anti-corruption