పరకాల ప్రభాకర్ ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఎన్ని పేపర్లలో హెడ్ లైన్స్ లో రాశాయో తెలీదు కాని ఆయన రాజినామా మాత్రం ప్రజ స్వామ్యం లో అప్రజాస్వామ్యక శక్తులైన ఈనాడు, సాక్షిలు బాగా ఉపయోగించుకున్నాయి. వాళ్ల వాళ్ల పార్టీ లను గద్దె ఎక్కించటానికి ఎంతకైనా తెగిస్తాయి ఈ పత్రికలు.
ఇక అసలు విషయానికి వస్తే, పది నెలల క్రితం అంధ్రా లో ఎవరికి ఈయన పేరు పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. పరకాల ప్రభాకర్ మొదట ప్రజా రాజ్యం లో చేరినప్పుడు ఆయన ఎవరా అని అడిగితే కొంత మందేమో ఆయన ఈ టివి వ్యాఖ్యాత అని కొంత మంది, మేధావి అని కొంత మంది, ప్రజా రాజ్యం లో రామోజీ రావు మనిషి అని ఇలా రక రకాలుగా వినిపించాయి నాకు. ఇక కొన్ని రోజులకు ఎదో లోక్ సభ స్థానాని కి ఆయన పేరు ప్రజా రాజ్యం పరిశీలుస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఈయన పని బాగుందే ఏకంగా లోక్ సభ సీటు నే కొట్టేస్తున్నాడు అనుకున్నాను. తీరా మరి చూస్తే ఆయనకు సీటు రాలేదు. ఇంకేముంది ఏకంగా పార్టీ ని పార్టీ కార్యాలయం లోనే "విషవృక్షం" అనేసాడు. అదే ఆయనకు సీటు వస్తే ఈ "కల్పవృక్షం" అనో లేక "బోధివృక్షం" అనో అనేవాడెమో. విషవృక్షం అని తెలిసిన వాడు వెంటనే రాజీనామా చేయాలి గాని తనకు టికెట్ రానంత వరకు ఎందుకు ఆగాడో ఆయనకే తెలియాలి? మరి ప్రజా విజయభేరి లో చిరు ని పొగిడిన ఆయన ఈ పది రోజుల్లోనే అంత జ్ఞానోదయం ఎలా అయ్యిందో. ఇవన్నీ చుస్తుంటే ఆయన్ను వెరే పార్టీ ల వాళ్లు కావాలనే ప్రజారాజ్యం లోకి పంపించినట్లు అనుమానం కలుగుతుంది. మొత్తానికి ఎవరో అన్నట్లు ఆయన్ను పార్టీ లోకి పంపిన వారి కార్యం ఆయన బాగానే నెరవేర్చినట్లు కనబడుతుంది.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
2 comments:
ప్రజ స్వామ్యం లో అప్రజాస్వామ్యక శక్తులైన ఈనాడు, సాక్షిలు బాగా ఉపయోగించుకున్నాయి
బాగా చెప్పారు.
వర్డ్ వెరిఫికేషన్ తీసేయ్యండి.
పుల్లాయన గారు మీకు పరకాల ప్రభాకర్ గురించి పెద్దగ తేలిక అపోహలతో రాసారని అర్ధం అవుతోంది . వాళ్ళది రాజకీయ కుటుంబమే . mp సీట్ కే దేభరించవలసిన పని లేదు . వాళ్ళ నాన్నగారు కాంగ్రస్ మంత్రి గా చాలాకాలం చేసారు . వాళ్ళ అమ్మగారు mla గా చేసారు . ఆయనకూడా బీజేపీ తరఫున mla గా పోటి చేసిన వారె . ఈనాడు లో ప్రతి ధ్వని ఒక్క చిన్న వ్యాపకం . ఆఖరి నిమిషం దాక ఇస్తారన్న భ్రమ కలగ చేసి రెండు రోజుల ముందు tdp నుంచి వచ్చి జాయిన్ అయిన కొత్త పల్లి సుబ్బారాయుడు కి టికెట్ కేటాయించడం ఎంతవరకు సబబు?అలాగే ఇతను , పవన్ కళ్యాణ్ కొంతమంది మంచివారని ఎమ్పిక చేసి వెల్ల కి ఇద్దాం అంటే కూడా అరవిందు అదేం కుదరదు నాకేంటి అంటే అవాక్కవడం వాళ్ళ వంతూ . పవన్ అన్న కాబట్టి , తప్పదు కాబట్టి అయిష్టం గానే కోన సాగుతున్నాడు . చివరికి భోగిలన్ని వుడిపోయి చిరంజీవి , అరవిందు రైల్ ఇంజన్ లో బొగ్గు వేసుకుంటూ , వర్షానికి steam generate కాకపోతే తోసుకుని కష్టపడి పక్క స్టేషన్ దాక తిసుకేల్లగలరో లేదో?
Post a Comment