అందరిలాగానే నేను కూడా జెపి గారి ఇంటర్వ్యూ లు, ప్రసంగాలు చూసి ఆయన అభిమానిని అయ్యాను. ప్రజారాజ్యం ఆవిర్భవించినప్పుడు చిరంజీవి లోక్సత్తా తో పొట్టు పెట్టుకుంటే బాగుండు అని అనుకున్న వాళ్ళలో నేను ఒకడిని. ఇక కొన్ని కారణాల వల్ల ఆ పొత్తు జరగలేదు.
అయితే ఈమధ్య ఆయన మీద కొద్దిగా అభిమానానం తగ్గటానికి కారణం పార్టీలకు కర పత్రాలు గా మారిన వార్తా పత్రికల్లో వచ్చిన నిరాధారమైన వార్తలను పట్టుకొని చిరంజీవి ని విమర్శించటం. సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలు ఆయన గురించి ఆలోచింప జేసేలా చేసాయి.
ఒకటి: ఆయన ఎన్నికల సంఘానికి చెప్పిన ఆస్తుల రిజిస్ట్రేషన్ విలువ సుమారు ఆరు కోట్లు. ఆ ఆస్తుల మార్కెట్ విలువ ఇంకో రెండు మూడు రెట్లు ఉండొచ్చేమో . మరి ఒక ఐఎఎస్ ఆఫీసర్ తన పదవికాలంలో అంత సంపాదించగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయం. అఫ్కోర్స్, ఆయనకు అది సంక్రమించిన ఆస్తి కూడా అయ్యుండొచ్చు. కాకపోతే దాని గురించి పూర్తీ వివరాలు నాకు తెలీవు కాబట్టి ఈ విషయం నన్ను ఆలోచింప జేసింది.
రెండోది: మూడు కుటుంబాలకు వోట్ వేస్తారో లేక మాకు వోట్ వేస్తారో అని పదే పదే చెప్పే ఆయన, ఆయన భార్య తో కుకట్ పల్లి లో ప్రచారం చేయించు కోవటం.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
7 comments:
>> ఇక కొన్ని కారణాల వల్ల ఆ పొత్తు జరగలేదు.
ఏమిటో ఆ కొన్ని కారణాలు. చెపితే తెలుసుకుంటాము.
ఆస్థి విషయాల గురించే మేము చేసిన ఉత్తరానికి ఆయన సమాధానం ఇచ్చారు... మీరు కూడా మైల్ చేసి కనుక్కోవచ్చు. ఆ ఆస్థి మొత్తం భార్యతో కలిపి. తనకి ఇప్పుడు ఆదాయ మార్గాలు కూడా చెప్పారు.
ఇంక కుటుంబ సభ్యులు ప్రచారం చెయ్యడం కుటుంబ రాజకీయం ఎలా అవుతుంది? ఆయనేమీ పార్టీలోనూ, పోటీలోనూ కుటుంబ సభ్యులని అందలం ఎక్కించలేదే?
అదే పి ఆర్ పి అయితే
అధ్యక్షుడు - చిరంజీవి
ప్రధాన కార్యదర్శి - అల్లు అరవింద్
కోశాధికారి - అల్లు అరవింద్
యువరాజ్యం - పవన్ కళ్యాణ్
నాగ బాబుకి కూడా ఏదో శాఖ ఇచ్చారు...
చిరు, అల్లు పోటీ చేస్తున్నారు... ఎన్నికల తరవాత పాలకొల్లు వదిలేసి, అల్లు దగ్గర చుట్టం ఒకావిడ పోటీ చేస్తుందని అప్పుడే వినికిడి... వీళ్ళు చెప్పేది కుటుంబంలోనే అందరూ ఎందుకు అంటే, వాళ్ళు సమర్ధులు అంట! సమర్ధులు అయితే, ఇంకెవరూ సమర్ధులు లేరా పార్టీలో? ఎవరైనా ఒకే కుటుంబంలో అన్ని ముఖ్యమైన పార్టీ పదవులు ఇచ్చేస్తారా?
ఇప్పటివరకూ కాంగ్రెసే ఇలా బరితెగించగలదని తెలుసు... అది కూడా జిల్లాల వరకే... తెలుగు దేశం కూడా ఇంతకుముందు కొన్ని పదవులు కొన్ని కుటుంబాలకి కట్టబెట్టింది... కానీ కాంగ్రెస్ అంత కాదు... ఈరకంగా పి ఆర్ పి ఎవరూ చేయలేని మార్పు తీసుకొచ్చింది...
prp is a new party. its depends on only cine gramour. so they using thats way they given yuva rajyam to pawan, and allu is every thing to chiru he deals all chiru financina matters and closed to him. importantly viswasapatrudu. hence he depends on them for while. wats wrong we are watching leaving with blaming chiru and PRP how can we belive them with out know ing every one. its not wrong. i support it.
నాకు అయితే తెదేపా రాష్ట్రం లో అతి పెద్ద కుటుంబ రాజ్యం లా కనిపిస్తుంది. బాలక్రిష్ణ, జూ.ఎన్ టీఅర్, హరి క్రిష్ణ ఇలా ఎంతో మంది. వాళ్లకి పార్టీ లో పదవులు లేక పోవచ్చు. కాని పట్టు ఉంది కదా. వాళ్లకి నచ్చిన వాళ్లని రికమండ్ చేస్తుంటారు కదా. పవన్ కి పేరు కి ఒక పదవి ఉంది, వీళ్లకి లేదు అంతకు మించి తేడా ఎమీ లేదు. ఇంకోటేంటంటే చిరు వాళ్లని పెట్టుకోవటానికి కారణం వళ్ల మీద ఉన్న నమ్మకం. ముక్కు మొహం తెలియని పరకాలకి పార్టీ పోస్ట్ ఇస్తే ఎం చేసాడో చూసారు కదా. ముఫ్ఫై ఏళ్లుగా ఉన్న ఈనాడు పేపర్ నే నమ్మలేనప్పుడు మామూలు కొత్త వ్యక్తుల్ని ఎలా అండీ నమ్మేది?
ఈ బ్లాగు ఓనర్ గారిది పార్టీ అనుకుంటా! అయ్యా మిగిలిన పార్టీలు అధికారంలోకి వచ్చాక చెడిపోతే అడ్డగాడిదల్లాంటి "జంప్" రాచకీయవేత్తల్ని జాయిన్ చేసుకొని ఇప్పుడే కుళ్ళిపోఇంది.
తస్మాత్ జాగర్త!
ఈ బ్లాగు ఓనర్ గారిది PRP పార్టీ అనుకుంటా! అయ్యా మిగిలిన పార్టీలు అధికారంలోకి వచ్చాక చెడిపోతే PRP అడ్డగాడిదల్లాంటి "జంప్" రాచకీయవేత్తల్ని జాయిన్ చేసుకొని ఇప్పుడే కుళ్ళిపోఇంది.
తస్మాత్ జాగర్త!
రాజకీయాల్లో ఎవరినీ నమ్మలేం. అది ఎ పర్టీకైనా సహజం. PRP కి కె కొత్త సమస్యేం కాదు. అసమ్మతులు, పార్టీ నించి వెల్లేవాళ్ళు, వచెవల్లు, విమర్శలు ఇవన్ని నెగ్గ్గుకు రావడమే నయకత్వం. చిరు పార్టీ గనక మీరంత విచారించి, అలోచించి అదొక సాకుగా చెప్తున్నరు కాని. రేపో మాపో ఆల్లు అర్జున్ కి, రాం చరన్ కి కూడా ఎవొకటి అప్పచెప్పినా, అప్పుడు కూడా చిరు అభిమానులు ఎదో విధంగా సమర్థించుకువస్తారు.
Post a Comment