చిన్నప్పుడు కధల్లో చదువుకున్న ఈ సన్నివేశం ఇప్పుడు ఈ రెండు సాఫ్ట్వేర్ వీరుల మధ్య జరుగుతున్నట్లుంది. ఎవరైనా నెట్ లో ఏదన్నావెతకాలంటే చటుక్కున గుర్తొచ్చేది గూగుల్. సెర్చ్ కి అంత మార్కెట్ ఉంటుంది అని కనిపెట్టి దానికి కావాల్సిన అల్గారిథంస్ రాసి ఎంతో మంది కి డ్రీం కంపనీ అయింది గూగుల్. ఇక పోతే మెయిన్ ఫ్రేం కంప్యుటర్ లు రాజ్యమేలుతున్న రోజుల్లో వ్యక్తి గత పిసి లకు భవిష్యత్తు లో ఉండబోయే మార్కెట్ ను అంచనా వేసి దానికి తగ్గ ఆపరేటింగ్ సిస్టం తయారు చేసి ప్రపంచం లోనే అతి పెద్ద సాఫ్ట్వేర్ కంపనీ గా తయారయ్యింది మైక్రోసాఫ్ట్.
ఇక పొతే నిన్న గాక మొన్న వచ్చిన గూగుల్ ఒక్క సెర్చ్ అనే ఫీచర్ తోనే ఆన్ లైన్ ప్రకటనల తో కోట్లు గడిస్తుండటం తో ఎక్కడో మైక్రోసాఫ్ట్ కి కన్ను కుట్టింది. దానికి తోడు గూగుల్ సెర్చ్ నుంచి తన పరిధిని విస్తరించుకుంటూ చిన్నగా మైక్రోసాఫ్ట్ కి బాగా బలమున్న డెస్క్ టాప్ ఏరియా లో అదుగు పెట్టి దానికి బ్రెడ్ అండ్ బటర్ అయిన ఆఫీస్ లాంటి మీదే గురి పెట్టి చిన్నగా అప్పటిదాకా ఎదురే లేదనుకున్న మైక్రోసాఫ్ట్ కే పోటీదారు గా మారింది. దీంతో మైక్రోసాఫ్ట్ కు పుండు మీద కారం చల్లినట్లు అయింది. "మన పరిధిని మనము పెంచుకొంటూ పోకపోతే అందరూ పోటిదార్లు కలిసి తలా ఒక పక్కనుంచి వచ్చి మనల్ని ప్రెస్ చేసి మనకు ఒక పరిధి అంటూ లేకుండా చేస్తారు" అన్న సిద్ధాంతాన్ని చరిత్రను చూసి అవగతం చేసుకున్న మైక్రోసాఫ్ట్, గూగుల్ కుంభ స్థలాన్నే కొట్టడానికి నిర్ణయించుకుంది. నా బంగారు పుట్టలో ఏలు పెడితే నేను కుట్టనా అంటూ గూగుల్ కి పోటీ గా జూన్ నెలలో "బింగ్" అనే కొత్తసాఫ్ట్ వేర్ ని విడుదల చేసింది. సెర్చ్ తో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి "డెసిషన్ ఇంజన్" అనే కొత్త మార్కెటింగ్ అంశం తో ముందుకొచ్చింది. దాని పనితనం కూడా మైక్రోసాఫ్ట్ నుంచి ఆశించిన దాని కన్నా మిన్నగా ఉండటంతో నిపుణులు కూడా ఇప్పటికిప్పుడు గూగుల్ స్థానానికి వచ్చ్హే నష్టం ఎమీ లేకపోయినా ఇక మీద గూగుల్ పని నల్లేరు మీద నడక కాదు అని భావిస్తున్నారు. గూగుల్ కూడా ఈ హఠాత్పరిణామాన్ని ఎదుర్కోవటానికి దాని స్థాపించిన వారిలో ఒకరైన సర్గీ బ్రిన్ ఆధ్వర్యంలో ఒక టీం ని ఏర్పాటు చేసింది అని వినికిడి. అయితే మిగతా వీక్షకులు మాత్రం ముందు ముందు ఈ కొత్త పరిణామం ఈ రెండు యోధుల మధ్య పోటీని భవిష్యత్తు లో ఇంకా తీవ్రంగా, ఆసక్తికరంగా మారుస్తుంది అంటున్నారు.
చూద్దాం ఈ పోటీలో ఎవరు గెలుస్తారో.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
3 comments:
ఎక్కువగా బింగ్ మీద పనిచేయలేదు కానీ నాకు నచ్చింది. ముఖ్యంగా రోజూ మారే పిక్. ఆకర్షణీయంగా వుంది బింగ్.
గూగుల్, బింగ్ ఎంత ఎక్కువ పోటీ పడితే end user కు అంత మంచిది! :)
ఆ మధ్య విపరీతమైన మార్కెటింగ్ అంచనాలతో వచ్చిన cuil.com కూడా ఇలాగే గూగుల్ కి ప్రధానపోటీదారుగా అవతరించాలని వచ్చింది, అంతే వేగంగా పోయింది కూడాను! ప్రధాన కంపెనీల నుంచి మార్కెట్లో కి వచ్చిన కొత్త ప్రాడక్ట్స్ అన్ని మొదట్లో ఇలాగే సంచనాత్మకం గా ఉంటాయి. గూగుల్ Lively నగుర్తు తెచ్చుకోండోసారి. సెకండ్ లైఫ్ ప అయిపోయిందనుకున్నారంతా..
మైక్రోసాఫ్ట్ లాగా మోనోపలీ తలకెక్కితే తప్ప గూగుల్ సెర్చ్ కి ఇప్పట్లో ఢోకా లేదు. Its the marlyn monroe of search. Modonnas come and go, Marlene remains :)
వెబ్ 2.0 ప్రపంచంలో తర్వాతి విప్లవం తేగల ప్రాడక్ట్ Google Wave. The concept has the potential revolutionize the way people communicate and change ot forever! But then, lets see how it comes out in execution :)
One think I liked about Bing is add free page. Looks so neat and clean :-)
~sUryuDu :-)
Post a Comment