ఇవ్వాళ ఏదో ఇంగ్లీష్ పేపర్ తిరగేస్తుంటే ఇవ్వాళ
దుర్గాబాయి దేశ్ ముఖ్ పుట్టిన రోజు అని ఆమె మీద మంచి వ్యాసం రాసి ఉంది. చిన్నప్పుడు ఆమె పేరు మీద ఉపవాచకం చదివినట్లు గుర్తు ఉంది కాని, అంతకు మించి పెద్దగా గుర్తు లేదు. మన రాష్ట్రానికి చెందిన అందులోను ఒక మహిళ జాతీయ స్థాయిలో అన్ని విజయాలు సాధించి అంతటి పేరు ప్రతిష్టలు పొందటం నిజంగానే అరుదు. ఇక మన ఘనత వహించిన ముఖ్యమంత్రి గారికి ఏ పధకం పెట్టినా ఇందిర, రాజీవ్ ల పేర్లు తప్ప ఇలాంటి గొప్ప వాళ్ల అందులో మన తెలుగు వాళ్ల పేర్లు అసలే గుర్తు రావు. సరే ఆయన సంగతి వదిలేస్తే తెలుగు మహిళ అని, మహిళా రాజ్యం అని, పేర్లు పెట్టుకొని బూతులు తిట్టుకోవటం తప్పితే ప్రతిపక్షాల మహిళా విభాగాలు ఎందుకు పనికి రావు. ఇక మన పత్రికలైన ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి లలో కనిసం ఆవిడ పుట్టిన రోజు అని ఒక మూల కూడా రాసినట్లు లేవు. ఒక్క
అంధ్రప్రభ లో మాత్రం చక్కగా దీని మీద ఒక చిన్న వ్యాసం ప్రచురించారు.
2 comments:
http://www.eenadu.net/sahithyam/display.asp?url=maha50.htm
అవునండి. మీరు చెప్పినది నిజం.
Post a Comment