ఈ పోస్ట్ లో ఎ2జెడ్ అన్నట్లు తొమ్మిది సంవత్సరాలు అధికారం లో ఉండి ఈ పనులు మేము చేశాం కాబాట్టి మమ్మల్ని గెలిపించండి అని అనాల్సింది పోయి పూర్తిగా కాంగ్రెస్ వ్యతిరేక వోటు మీద ఆధారపడి చిన్న పార్టీలకు వోటు వేయటం వృధా అంటూ చివరికి ఒక సీటు మాత్రమే గెలుచుకున్న లోక్సత్తా మీద కూడా ఏడవటం చాలా ఛండాలంగా ఉంది.
ఒక పక్క ప్రభుత్వం ఆపరేషన్ "ఆకర్ష్" ప్రవేశ పెట్టింది అంటూ తన రెండు పత్రికలలో గగ్గోలు పెట్టిస్తూ ఇటు పక్క "ప్రజారాజ్యం" లో ఉన్న పాత తెదేపా నేతలందరితోటి ఫోన్ లలో సంప్రదించి పార్టీలోకి రావాలని ఆహ్వానించటం, నేతలు ఎవరు తిరిగి వచ్చినా పూర్వ గౌరవం ఇస్తాం అని పబ్లిక్ గా ప్రకటనలు ఇవ్వటం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
అసెంబ్లీ లో ఎప్పుడు చూసినా నువ్వంత తిన్నావు, నువ్వు ఇంత తిన్నావు, నువ్వో పెద్ద ఫాక్షనిస్ట్ వి అంటూ వ్యక్తిగత విమర్శలే కాని, సరిగ్గా సమస్యల గురించి గత ఇదేళ్లలో చేసింది చాలా తక్కువ. కొత్తగా అసెంబ్లీ లో అడుగు పెట్టిన చిరంజీవి, జెపి లను చూసి కూడా వీళ్లకు బుద్ధి రావట్లేదు. మాట్లాడితే వాకౌట్ లేక పోతే నిరసనలు తప్పితే సమస్యలు పట్టవు. డే 1 నుంచి కాంగ్రెస్ ఏది చేసినా వీళ్లకు తప్పే. మాట్లాడితే కాంగ్రెస్ ది సాంకేతిక గెలుపు మాత్రమే, మేం ఓడిపోయి గెలిచాం, వాళ్లు గెలిచి ఓడిపోయారు అనటం బాబు మూర్ఖత్వానికి నిదర్శనం. 64 శాతం మంది కాంగ్రెస్ కు వ్యతిరేకంగా వేశారు అంటాడే కాని 70 శాతం మంది తెలుగు దేశానికి వ్యతిరేకంగా ఉన్న సంగతి మాత్రం ఆయనకు అనవసరం.
ఇక వీళ్లేం చేసినా వంత పాడటానికి ఒక రెండు వెధవ పత్రికలున్నాయి. నేను అనుకోవటం రామోజీ రావు, బాబు, రాధా కృష్ణ ల మధ్య రోజు కాంఫరెన్స్ జరుగుతుందేమో. ముగ్గురు కలిసి ఒక సమయం లో ఒకే ఒక వార్త ని బలంగా ప్రజల మీద రుద్దతానికి ప్రయత్నిస్తారు. నెల రోజుల క్రితం ఆపరేషన్ "ఆకర్ష్" అని ప్రభుత్వం మీద పడ్డాయి. కొన్ని రోజుల తర్వాత లోక్సత్తా పార్టీ మీద ఏడ్చాయి. ఇప్పుడు తాజాగా ప్రజా రాజ్యం మీద పడ్డాయి. ప్రజా రాజ్యం లో నాయకులు ఆనందంగానే ఉన్నా వాళ్లు పార్టీ మారాలనుకుంటున్నారు, వీళ్లు మారాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాసి వాళ్లు నిజం గా తెదేపా లో చేరేటట్లు చేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం. వాస్తవానికి ప్రజా రాజ్యం వల్ల తెలుగు దేశం కు ఎంత నష్టం జరిగిందో కాంగ్రెస్ కూడా అంతే నష్టం జరిగింది. కాని ఈ ముగ్గురు పని గట్టుకొని కాంగ్రెస్ కి ప్రజా రాజ్యం వల్ల లాభం అంటూ ఒకే సారి ఊదరగొడుతూ ప్రభుత్వ వ్యతిరేక వోటు పొందాలని చూస్తున్నారు. చిరంజీవి ని కాంగ్రెస్ కు ఎంత దగ్గరగా చూపిస్తే వీళ్లకు అంత లాభం అని వీళ్ల ఉద్దేశం. ఇవ్వాళ ఈనాడు లో వచ్చిన వార్తే దీనికి నిదర్శనం.
ఒక ప్రధాన ప్రతిపక్షం హోదాలో ఉండి కరువు, ధరల పెరుగుదల, కేంద్రం లో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం, బెల్ట్ షాపులు, విపరీతంగా ఫీజుల పెంపకం, అధ్వాన్నమైన రోడ్లు, మంచి నీటి సమస్య, ప్రభుత్వ స్థలాల అమ్మకం ఇలాంటి సమస్యల పై అసెంబ్లీ లో పోరాడకుండా అసెంబ్లీ బయట ఇలా మీడియా తో కుమ్మక్కై దొంగ రాజకీయాలు చేయటం దారుణ మైన విషయం.
రెండు ప్రముఖ దినపత్రికలు అయ్యుండి ప్రజలకు నిజా నిజాలు అందించాల్సింది పోయి ఒక రాజకీయ పార్టీ కి అండగా చేరి ప్రజలను మభ్య పెట్టడం దారుణాతి దారుణం.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
19 comments:
ఆడలేక మద్దెల ఓడు.
ఒరెమునా,
బాగా చెప్పారు బాబు గురించి. :) ఇంకా ఇవిఎం ల వల్ల ఓడిపోయాము అన్నాడు మొన్నటిదాకా.
TDP lost its focus.
During the present recession in the US, an interesting observation was made - 90% CEOs of major companies advanced their careers in booming economy and expansion and growth. So, they have no idea of how to run a company in a downturn.
Similarly, Babu and his TDP (this is not the same TDP that was in opposition under NTR's leadership) were only used to being in power - they have no clue abt being in opposition. Now, being forced for a 2nd term in that role, they became even more clueless.
గుడ్డి అభి మానం.
చాలా చక్కగా వివరించారు. ఏదేమైనా, చిరు కాంగ్రెస్‌లో చేరకూడదని ఆశిస్తున్నాను. ఎవరున్నా లేకపోయినా ప్రజారాజ్యం అనే పార్టీ ఉంటే మంచిదే. జాతీయ పార్టీలకన్నా ప్రాంతీయ పార్టీలే రాష్ట్రాల అభివృద్ధికి మంచివి.
చిరుకు గత ఎన్నికల్లో తక్కువ సీట్లు రావడానికి కారణం, చాలామంది ఇంటికి దూరంగా ఉండి చదువుకునే యువత ఓటు వేయలేకపోవడమే. గత ఎన్నికలప్పుడు నేను మాకాలేజీలో చాలా మంది స్టూడెంట్స్‌ను (దాదాపు 30 మందిని) అడిగాను "ఎవరికి ఓటేస్తారు" అని. వాళ్ళలో ఒకరిద్దరు తప్ప, మిగతావాళ్ళందరూ చిరుకే ఓటేస్తామని చెప్పారు. ఆ మిగిలిన ఒకరిద్దరు లోక్‌సత్తాకు ఓటేస్తామని చెప్పారు. కాకపోతే పరీక్షలవల్ల వీళ్ళెవరూ ఓటెయ్యడానికి వెళ్ళలేదు. ఒక్కరోజులో అంతదూరం ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి వచ్చే ఓపిక లేక కొంతమంది, చార్జీలు బొక్క అని మరికొంతమంది ఓటెయ్యడానికి వెళ్ళలేదు. ఇట్టాంటోళ్ళు ఎంతమంది ఉంటారో.
ఏదేమైనా చిరుకు ఇప్పటికీ యూత్‌లో మంచి క్రేజే ఉంది.
కొత్తపాళీ,
మంచి వాలిడ్ పాయింట్ చెప్పారు.
ఒరెమూనా,
గుడ్డి అభిమానం నాకు, మీకు, మన తెలుగు వారు అందరికి ఉన్నదే, ఉండేదే.
నాగ ప్రసాద్,
మీరన్నట్లు ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీల వల్ల లాభమే కాని నష్టం లేదు. ఒక ప్రాంతీయ పార్టీ కి మనం 33 మంది ఏంపీ లను గెలిపిస్తే మనకు చాలా కీలకమైన మంత్రి పదవులు దక్కేవి, చాలా రైళ్లు కూడా వచ్చేవి. కేంద్రం లో మన రాష్ట్ర ప్రయోజనాలకొచ్చేసరికి కుక్కిన పేనుల్లా పడి ఉండే కాంగ్రెస్ మన రాష్ట్రం లో ఉన్నా లేకున్నా ఒకటే.
జస్టిస్ చౌదరి లా తీర్పులిచ్చేస్తున్నావ్ గా :)
తెదేపా ప్రతిపక్ష పార్టీగా విఫలమైన సంగతి నిజమే. 'ఆ రెండు' పత్రికలూ తెదేపా పట్ల పక్షపాతాన్ని ప్రదర్శిస్తాయనేదీ నిజమే! ప్రజారాజ్యం కాంగ్రెసుకు దగ్గరగా ఉన్నట్టు చూపెడితే తెదేపాకు లాభం ఇదీ నిజమే! కానీ..
"ప్రజా రాజ్యం లో నాయకులు ఆనందంగానే ఉన్నా వాళ్లు పార్టీ మారాలనుకుంటున్నారు, వీళ్లు మారాలనుకుంటున్నారు అంటూ వార్తలు రాసి వాళ్లు నిజం గా తెదేపా లో చేరేటట్లు చేయటం ఈ ఆపరేషన్ లక్ష్యం." - ఇది మాత్రం హాస్యాస్పదం. 'ఆ రెండూ' వార్తలు రాసేసినంత మాత్రాన ఉన్న 'ఆ నలుగురూ' పార్టీనొదిలేస్తారా? ఇప్పటిదాకా వదిలేసినవారు అందుకే వదిలేసారా?
మిత్రా కూడా పార్టీనొదిలెయ్యడం ఖాయం, కానీ ఎన్నికల ముందు పోతే పార్టికి దెబ్బ అనే భావంతో ఎన్నికలయ్యాకే వదిలెయ్యనున్నాడనీ నేను 'ఆ రెంటి'లోని ఒకదానిలో చదివాను. ఎన్నికలయ్యాక పోనే పోయాడాయన. దేవేందరు తదితరులు కూడా పోనున్నారని రాసారు, వాళ్ళూ పోయారు. 'ఆ రెండూ' రాసినందునే పోయారా వాళ్ళంతా?
జన్మలో తన జిల్లా దాటి ఏనాడూ బైటికి పోనివాడు హఠాత్తుగా ఓ రోజు తెల్లారి కళ్ళుతెరిచేసరికి ఏ బుర్కినాఫాసోలోనో ఉంటే ఎంత అయోమయంలో పడిపోతాడో చిరంజీవి కూడా అంత అయోమయంలో ఉన్నాడని నా ఉద్దేశం. తనున్న ఆ స్థలమేంటో తెలీదు, అదే ఊరో, వాళ్ళు మాట్టాడే భాషేంటో, అసలు తానక్కడికెందుకొచ్చాడో ఏమీ తెలవక, ఎవర్నడగాలో తెలవక, ఏమని అడగాలో తెలవక, ఏ రోడ్డుమీదో నిలబడి పిచ్చి చూపులు చూస్తూ ఉండేవాడి పరిస్థితి చిరంజీవిది. ఆయనే అలా ఉంటే తననే చూసి పార్టీలో చేరినవాళ్ళ పరిస్థితి ఏంటి? రాజకీయంగా ఇప్పటికే కాస్తో కూస్తో అనుభవమున్న ఆ నాయకులు పెందలాడే బయటపడదామనుకుంటున్నారు. అంతేగానీ 'ఆ రెండు' పత్రికలూ రాసాయని పోతున్నారా?
చిరంజీవి తనలోని అయోమయాన్ని వదిలించుకొని, ప్రజల్లోగల అయోమయాన్ని తొలగించాలి. తన నాయకత్వ ప్రభావాన్ని చూపించాలి. తాను అసమర్ధుణ్ణి కానని నిరూపించుకోవాలి. చిరంజీవి పరిస్థితి ఎంత అన్యాయంగా ఉందంటే.. ప్రరాపా నుండి పోయే నాయకులకు కనీసం చిరంజీవి విధానాలను విమర్శించాల్సిన అవసరం కూడా కనబడ్డం లేదు. 'చిరంజీవి చాలా మంచివాడు, నన్ను బాగా చూసుకున్నారు' అంటూ "పాపం" లాంటి సానుభూతి స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అన్యాపదేశంగా చిరంజీవి అసమర్ధుడని చెబుతున్నట్టుగా ఉంది :)
ఇక చిరంజీవి తన మంచితనం ముసుగు తీసి, బయటికి రావాలి.ప్రజల సమస్యలమీద ఉద్యమించాలి. సభలోనూ బయటాకూడా తన వాణి వినిపించాలి. ముందు తనమీద ఉన్న అసమర్ధ నాయకుడు అనే ముద్రను తొలగించుకోవాలి. లేకపోతే ప్రజారాజ్యం కాంగ్రెసులో కలుస్తుందో లేదోగానీ చరిత్రలో మాత్రం కలిసిపోతుంది.
I 100% agree with చదువరి.
వినయ్,
మీ కామెంట్లకు ధన్యవాదాలు.
చదువరి గారు,
మీ పే....ద్ద కామెంట్ కు ధన్యవాదాలు. :)
మీరు ఒక కంపనీ లో ఉన్నారనుకోండి. ఆ కంపనీ గురించి రోజూ పేపర్లలో వార్తలే వస్తున్నాయి. ఆ కంపనీ కి భవిష్యత్తే లేదు అని, అందరూ ఉద్యోగులు కంపనీ వదిలి వెళ్లిపోదామనుకుంటున్నారని, అసలు ఆ కంపనీ యజమానే జెండా ఎత్తేస్తున్నాడు అని చెడు వార్తలే వస్తున్నాయనుకోండి, మీకు కూడా ఎదో ఒక రోజు కంపనీ ని వదిలి ఇంకో పెద్ద కంపనీ కి వెళ్లాలనిపిస్తుంది మీ సొంత భవిష్యత్తు కోసం. ఒక వేళ మీకు అనిపించకపొయినా ఆ పేపర్లు చదివే మీ ఇంట్లోవాళ్లు, మీ శ్రేయోభిలాషులు మిమ్మల్ని కంపనీ మారమని చెప్తారు. మిత్రా లాంటి వారు మారటానికి ఇది కారణం కాకపోయినా గౌడ్, తమ్మినేని లాంటి వాళ్లు వీడతానికి ఇదే కారణం అని నా అభిప్రాయం.
ఇక మీరంటున్నట్లు వాళ్లు మారతారని రాశారు వాళ్లు కూడా మారారు అంటున్నారు. మరి అలాంటప్పుడు భూమా దంపతుల గురించి కూడా రాశారు, ఎం ఎల్ ఏ లు వెల్లిపోతున్నారని రాశారు, వాళ్లంతా ఖండించారు కదా...ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఈ పత్రికలు తెదేపా చేరటానికి మధ్య వర్తిత్వం చేస్తాయి. ఎలా అంటే ముందు ఒక ఊహా గానాన్ని లేపుతాయి, ఉదాహరణ కు గౌడ్ వెళ్లాలని అలోచిస్తున్నాడు అని, వెంటనే తెదేపా దగ్గరకు వెళ్లి గౌడ్ వస్తే మీరు ఆహ్వానిస్తారా అని అడుగుతాయి, వాళ్లు మేం స్వాగతిస్తాం అంటారు. ఇంక అప్పటిదాకా బాగానే ఉన్న గౌడ్ కూడా కచ్చితంగా ప్రరాపా కన్నా తెదేపా పెద్ద పార్టీ కాబట్టి తన భవిష్యత్తు బాగుంటుంది అని ఒక రోజు వెళ్లిపోతాడు. దీనికంతటికి మూల కారణం ఏంటంటే వీళ్లందరూ సిద్ధాంతాలు నచ్చి ప్రరాపా లో చేరలేదు, ఏదో లక్కీగా చిరంజీవి వేవ్ వస్తే అందులో ఎదో ఒక రకంగా కొట్టుకొచ్చేయొచ్చు అనుకోని చేరిన వాళ్లు.
ఇక మీరు ప్రస్తావించిన కన్ ఫ్యూషన్ విషయానికి వస్తే అంత అయోమయం లో పడాల్సిన విషయాలు ఏమీ లేవు ఇక్కడ. గుడ్డిగా ప్రభుత్వం ఏది చేసినా విమర్శించకూండా నిర్మాణాత్మక పాత్ర హుందాగా పోషిద్దామని చూస్తున్నాడు. అది చేతగాని తనంగా చిత్రీకరిస్తుంది మీడియా.
ఇక సభ విషయం లో ఇప్పటిదాకా జరిగిన సమావేశాల్లో చిరంజీవి మాట్లాడింది, బాబు మాట్లాడింది, రెడ్డి మాట్లాడింది ఒక సారి గమనించండి. ఎవరిలో ప్రజలకు కొద్దిగన్నా సేవ చేద్దామన్న తపన కనపడుతుండో చూడండి. జె పి లాగా క్వాంటిటేటివ్ గా సమస్య మీద మాట్లాడుండడు కాని కచ్చితంగా సభా సమయాన్ని పూర్తిగా వినియోగించుకుంటూ తనకు తెలిసిన సమస్యలు లేవనెత్తుతున్నాడు.
@@గుడ్డి అభిమానం నాకు, మీకు, మన తెలుగు వారు అందరికి ఉన్నదే, ఉండేదే.@@
ఎవరి నలుపు వారికి కనిపించదు, ఎవరి కంపు వారికి వింపు.
నిజమే, వ్యాఖ్య పే..ద్దదైపోయింది. సారీ! :)
పుల్లాయనండీ !
బావుంది, మీ ఆర్టికల్ కంటే మీ కామెంట్స్ అదుర్స్.
మీ ప్రకారమే అన్ని జరుగుతాయి అని అనుకొంటే.
అసలు తెలుగుదేశం ఈసరికి అధికారం లొ వచ్చిఉండాలి కదా.
ప్రసన్న కుమార్ రెడ్డి అసలు చంద్ర బాబు కు లెటర్ వ్రాయకూడదు కదా.
మన రొశయ్య ' నువ్వు మాగాడివా " అనే పరిస్థితి రాదు కదా.
పాల్ గారు చెప్పినట్టు అన్నీ జరిగుండాలి కదా.
ఇంతెందుకు , ప్రజారాజ్యం పురిటినొప్పులు పడుతునప్పుడు 'రాజ్యాదికారం" అనే బిడ్డని కని ఉండాలి కదా
ఇన్ని నిజాలు తెలిసినప్పుడు మీరు , మన Y.యెస్ గారు ఎందుకండీ "ఆ రెండు పత్రికల్ని " గురించి మాట్లడటం
ఒక్కసారి మీరు చెప్పిన ఈనాడు, ఆంధ్రజ్యొతి పాత పేపర్లు దుమ్ము దులపండి.
చంద్ర బాబు రాజ శేఖర్ రెడ్డి ని సమర్థ వంతం గా ఎదుర్కో లేక పోవడానికి కారణాలున్నాయి. ఇతను ఏ విషయం లేవ నెత్తినా చివరకు ఇతని నేట్టికే చుట్టుకుంటుంది. అసైన్డ్ భూముల విషయం వచ్చినప్పుడు హెరిటేజ్ భూముల ప్రస్తావన రాగానే చంద్ర బాబు కుదేలయ్యాడు. సత్యం, మైటాస్ విషయం లో తన కొడుకు ప్రస్తావన రాగానే చంద్ర బాబు మౌనం వహించాడు. ఈ విధంగా తమ తొమ్మిదేళ్ళ పాలన తెలుగు దేశం వారిని ఇంకా వెంటాడుతూనే వుంది.
చిరంజీవికి గత చరిత్ర అవశేషాలేమీ లేకున్నా, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన పనులు ఏమంత ఆశా జనకంగా లేవు. రాముడు మంచి బాలుడు అనుకుందా మంటే టికెట్లు అమ్ముకోవడం, జిల్లా వారిగా రాజకీయ నాయకులను బొట్టు పెట్టి ఆహ్వానిచడం అసహ్యం కలిగించే విషయాలే. అప్పుడు ఫిరాయిమ్పులను ప్రోత్సహించి ఇప్పుడు వెళుతున్నారని బాధ పడితే ఎవరి సానుభూతిగా పొంద గలరు?
వీళ్ళ గందర గోళంలో బాగు పడుతున్నది కాంగ్రెస్ వారే. ఏ విషయం లో చూసినా పది రెట్లు దిగజారుడు తనం కలిగిన కాంగ్రెస్ వారు గడుసు దనంతో నెట్టు కొస్తున్నారు.
అసెంబ్లీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఈ ప్రశ్నకు దాదాపు ఏ ప్రజానాయకుడు సమాధానము చెప్పలేడు. అది వారి నైజం. అసెంబ్లీ పై నా టపాను వీక్షించి మీ అభిప్రాయమును తెలుపగలరు. http://saipraveen.wordpress.com/2009/08/24/tiruguleni-mega-serial-assembly/
నెనర్లు.
Post a Comment