Tuesday, June 8, 2010

కాంగ్రెస్ గడ్డి తింటే మేమూ తింటాం...

తీరు లాగా ఉంది తెలుగు దేశం పార్టీ తీరు.
తెలంగాణ గురించి చంద్రబాబు ని వైఖరి చెప్పమంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు తన వైఖరి చెప్తే చెప్తాడంట...
తెలంగాణ తెదేపా నాయకులని రాజీనామా చేయమని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే చేస్తారంట...
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి మేమూ పోటీ చేస్తాం అంటున్నారు ఇప్పుడు...
అంటే కాంగ్రెస్ గడ్డి తింటే మీరూ తింటారా? కాంగ్రెస్ తో ఇంత భావ సారూప్యం పెట్టుకున్న మీకు ఒక పార్టీ అవసరమా? మీరు కూడా కాంగ్రెస్ లో విలీనం అయిపోయి హాయిగా heritage వ్యాపారం చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇన్ని వెధవ కారణాలు వెతుక్కోనే అవసరం రాదు.
మీకు నిజంగా దమ్ముంటే ఎన్నికలు కాబట్టి పోటీ చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పండి. సంవత్సరం తిరక్కుండానే రాజీనామా ఏంటి అని ఎదిరించండి అంతే కానీ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి దాన్ని అధిష్టానం మీదకు తోసినట్లు మీరు కాంగ్రెస్ మీద తోయటం దేనికి?
ఇక అన్నిటికన్నా హైలైట్ ఇవ్వాళ ఈనాడు లో రాసిన కింద వార్త. covering అంటే ఎలా ఉండాలో ఈ వార్త ను చూసి నేర్చుకోవాలి మిగతా రాజకీయ పార్టీలను సపోర్ట్ చేసే వార్తా పత్రికల వాళ్ళు. ఇది చదివిన వాళ్ళు మాత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో సునీల్ కళ్ళ నీళ్ళు పెట్టుకొని "మీరు కలెక్టర్ అవుతారు బాబు" అన్నట్లు "తెలుగుదేశం పోటీ చేయాల్సిందే బాబు" అనుకోవటం మాత్రం ఖాయం.

హాయిగా బాబు లాగా ఈనాడు లాంటి ఒక paper ని కొనుక్కుంటే ప్రధాన ప్రతిపక్షం గా ఉండి ప్రజలకు పైసా పని చేయకపోయినా రాష్ట్రాన్ని అంతా మనమే ఉద్ధరిస్తున్నట్లు ఫోసు కొడుతూ happy గా టైమ్ పాస్ చేయొచ్చు.

4 comments:

Ravi said...

మన రాజకీయ పార్టీల రంగును, రంకును, రొచ్చును ప్రపంచానికి చాటుతున్నాయి తెలంగాణా ఎన్నికలు.
తెలంగాణా లో తెలనగానాను ఇచ్చేది తెచ్చేది మేమే అంటూ ప్రచారం చేస్తుందట 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన జాతీయ కాంగ్రెస్.
ఆంద్ర ప్రాతంలో అదే పార్టీ ఇంకో మొఖం సమైక్య రాగం ఆలపిస్తూ అక్కడి ఇక్కడి ప్రజల్ని మోసగిస్తుంది. వంచిస్తుంది.
ఏ ప్రాంత మనో భావాలకు అనుగుణంగా ఆ ప్రాతంలోని నాయకులు నాటకాలు ఆడతారట.
టీడీపీ చంద్ర బాబు కు రెండు ప్రాంతాలు రెండు కల్లట.
ప్రాంతానికో ప్రత్యెక సిద్దాంత మట , ప్రత్యెక పోరాటం, ప్రత్యెక నాటకం.
పార్లమెంటులో బాహాటంగా తెలంగాణాను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ ఆంద్ర ప్రాంత ఎంపీలు వీరంగం వేస్తారు.
కాంగ్రెస్ వాళ్ళు రాజీనామా చేస్తే వీళ్ళు రాజీనామా చేస్తారట, వాళ్ళు పోటి చేస్తే వీళ్ళు పోటి చేస్తారట మీరన్నట్టు వాళ్ళు గడ్డి తింటే వీళ్ళు గడ్డి తింటారు.
ఇంత చండాలంగా వున్నాయి మన లత్తకోరు రాజకీయాలు.
ఒక సిధాంతం, ఒక కమిట్మెంట్ లేని ఈ వెధవలా మన దేశాన్ని నడిపేది అనిపిస్తోంది.
దేవుడా రక్షించు నా దేశాన్ని.

రాజు said...

బాగా ఉతికారు సర్ .ఎవరూ ఉతక్క గబ్బు పట్టిపోయారు. ప్రజల్ని మాయ చేయవచ్చని ఈ గోబెల్స్ మీడియా/పచ్చ చొక్కాలు అనుకుంటారు కాని ప్రజలు అన్నీ గమనిస్తూంటారు. కేవలం 24 శాతం ఓట్లు తెచ్చుకుని ఒక్క శాతం తేడాతో ఓడినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నారు.పొత్తులతో తప్ప స్వంతంగా పోటీచేసిన చరిత్ర లేదు వీరికి. కమ్యూనిస్ట్స్ కూడా కాంగీతో జతకడతారంట. అప్పుడు చూడాలి ఇతని ప్రతిభ.

Prakash said...

TDP & Congress both betrayed Telangana. The people will teach them a great lesson in the coming elections.

Chintu said...

ఆ సీమ సిన్నోడు వ్రాశిన దాన్లో నాకేం నిజాల లింక్ లు కనిపించలేదు ... తన స్వంత భాష్యం వ్రాశాడు ... మీరు అతన్ని అభినందించటం.. తెలంగాణా వారిపై ద్వేష భావన చూపిస్తుంది..