Thursday, April 22, 2010

పదునెక్కుతున్న చిరు మాటలు













రాష్ట్ర కమిటీ సమావేశం లో చిరు ఉద్వేగంతో చేసిన ప్రసంగం బాగుంది. ఎంతో ఆకర్షణ ఉన్న సినిమా రంగంలో 30 యేళ్లుగా character/వ్యక్తిత్వం కాపాడుకున్నాను అంటూ తెలుగు బిడ్డనైన నాకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తెలంగాణా లో పర్యటించే అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పటం బాగుంది. ఇది చాలా correct. సమైక్యంగా ఉండాలని కొంత మంది తెలంగాణా వారు కూడా కోరుకుంటున్నారు. సమైక్యం అన్నంత మాత్రాన వారిని తెలంగాణా దోషులుగా TRS చిత్రించటానికి ప్రయత్నించటం దారుణo.

2 comments:

Goutham Navayan said...

ఇదిగో చిరంజీవి జగిత్యాల లో చేసిన లత్తకోరు ప్రసంగం కోసం ఇక్కడ నొక్కి చూడండి ముందు
VAHVAAchiramjeevi

జగిత్యాల లో చిరంజీవి అన్న ఈ మాటలను మరో సారి విని చదివి అప్పుడు చెప్పండి చిరంజీవి తెలంగాణా ప్రజలకు మిత్రుడో శత్రువో ...
ఇంకా ఎందుకు తెలంగాణా ప్రజల చేతుల్లో పరాభవం కొని తెచ్చుకోవడం? తెలంగాణా ప్రజల అబిష్టానికి అనుగుణంగా ఒక రాష్ట్రం గా ఏర్పడితే చిరంజీవి కొంపలేం మునిగిపోవు కదా. జన బలం లేకపోయినా ఎందుకింత ఆరాటం అతనికి.

జగిత్యాల లో చిరంజీవి:
""కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీమరీ చెప్తున్నాను. ఇంతకంటే ఇంకేమి ''క్లారిటీ'' కావాలి?
నిజంగా మనందరికీ ఆ తెలంగాణా కావాలి అని అందరూ అనుకుంటే గనక కేంద్రం దగ్గర పెద్ద ''సౌండ్‌'' చేద్దాం. పెద్ద ''శబ్ధం'' చేద్దాం.మీ గొంతు అక్కడ వినపడేలాగా చేద్దాం. కేంద్రం నిర్ణయం ... కేంద్రం నిర్ణయించాలి. అది మీ దాకా చెప్పక - ఇక్కడి వాళ్లేదో చేయడం లేదు ... చేయడం లేదు అంటే ...
కేంద్రం నిజంగా - వాళ్లకి చిత్తశుద్ధి వుంటే ... మన అభీష్టానికి అనుకూలంగా వాళ్లు నిర్ణయం తీసుకుని... వాళ్లు ప్రతిపాదిస్తే
గనక మనం సానుకూలంగా స్పందిస్తాం...! మనం అడ్డుగా వుండం!! మనం స్వాగతిస్తాం! ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని! మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!!
ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని! మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!! జగిత్యాల నడిబొడ్డులో వుండి ...జనం మధ్యలో వుండి ... చెప్తున్నాను....చిరంజీవి ... ప్రజారాజ్యం కేంద్రం ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితిలో అడ్డుగా వుండదు! వుండదు!! వుండదు!!!
తుది నిర్ణయం మాత్రం కేంద్రందే! కేంద్రం దానికి సానుకూలంగా స్పందించాలి!! కేంద్రం స్పందించి ప్రతిపాదిస్తే మాత్రం ఈ చిరంజీవి .... మీ చిరంజీవి.... మీ ప్రజారాజ్యం ... దానిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోదు ...! అడ్డుకోదు...!! అడ్డుకోదు...!!! అని చెప్తున్నాను.
కొంతమంది ఈ తెలంగాణా వాదం అనే ఓడను... తెప్పను ఎక్కి అవసరం తీరిపోగానే తెప్ప తగలబెట్టే రకంగా తయారవుతున్నారు!!
మరికొంతమంది ఓడ ఎక్కిని తరువాత ఓడ మల్లన్న అంటున్నారు. ఓడ దిగిన తరువాత బోడి మల్లన్న అంటున్నారు !!
ఇలాంటి అవమానాలకు గురయ్యే కదా మీ ''ఆత్మ గౌరవం'' దెబ్బతింది?! కనుక- మీ ఆత్మగౌరవానికి ప్రథమ పీట వేస్తాం! సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణాకి ప్రథమ పీఠం వేస్తాం!! ""

వేగు చుక్క said...

అప్పుడూ, ఇప్పుడూ అవే లత్తుకోరు మాటలు. తెలంగాణాకి వెళతాను, వెళతాను అని చెప్పడం యెందుకు, వెళ్లి చూపెట్ట వచ్చు కదా?