Monday, April 26, 2010

'పోలవరం' కోసం ప్రజారాజ్యం పోరు








ఇంతకు ముందు ఒకటి రెండు సమస్యలపై (ఉదా: విద్యుత్ సమస్య, కాకినాడ గాస్ లో వాటా) ప్రజా రాజ్యం ఉద్యమాలు చేసినా పెద్ద ఎత్తున ఒక చక్కటి ప్రణాళిక తో ఇలా ఉద్యమించటం ఇదే మొదటి సారి అనుకుంట.

ఇకపోతే ఈ లింక్ ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడుతుంది, 1941 లో బ్రిటీష్ వాళ్ళ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఆలోచన రూపు దిద్దుకుందట. మరి ఇప్పుడు design మారిందో లేదో తెలీదు కానీ, జాతీయహోదా కోసం ప్రయత్నిస్తున్నారంటే ఇది కచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యుండాలి. దీని శంకుస్థాపన జరిగి కూడా చాలా యేళ్లయినా, కారణాలు ఏవైనా ప్రాజెక్ట్ మాత్రం ముందుకు జరిగినట్లు లేదు.

ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ గురించి, ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం మరి ఎందుకు పట్టించుకోలేదో తేలేదు కానీ, ప్రజారాజ్యం మాత్రం serious గా తీసుకున్నట్లుంది. ఇంతకు ముందు కొన్ని సమస్యలపై ప్రజారాజ్యం ఉద్యమాలు చేసినా (ఉదా: విద్యుత్ కోత, కాకినాడ గాస్) అవి ముఖ్యంగా ఒకటి రెండు రోజులు మాత్రమే సాగాయి. మొదటి సారి ఇప్పుడు ఏకంగా ఇలాంటి సమస్యపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించటం అభినందనీయం. రైతులకు అవగాహన పెంచటం కోసం CD కూడా రూపొందించారట. కచ్చితంగా ఇలాంటి నిజమైన ప్రజాహిత కార్యక్రమాలు, ఉద్యమాలు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాయని భావిద్దాం.
మొత్తానికి ప్రజారాజ్యం మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదుగుతుంది అనిపిస్తుంది.
All The Best PRP.

4 comments:

Anonymous said...

ఎన్ని పోరాటాలు చేసినా, ఈ పోలవరం ప్రోజక్ట్ ను కలియుగం చూడలేదు.

వృధా ప్రయాస. ఆయాసం తప్ప ఉపయోగం లేని పోరాటం ఇది.

దీనికి బదులు ఒక పేపరి పెట్టుకొని, నలుగురు మాటకర్లను ఎపాయింట్ చేసుకొని తెలుగుదేశం, కాంగ్రెస్ లను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటే సరి.

పుల్లాయన said...

:)

పుల్లాయన said...

a2z,
చంద్రబాబు కచ్చితంగా అదే చేసేవాడు అనుకుంట. ఈ ఉద్యమానికి అయ్యే ఖర్చు తో ఒక ఖాయిలా పడ్డ paper/tv కొని జీవితాంతం వాడు తనకు ఋణ పడేటట్లు చేసుకొనేవాడు.

Anonymous said...

All the best PRP.