Thursday, April 22, 2010

చిరoజీవి తెలంగాణ ద్రోహి కాదు...

సమైక్యరాష్ట్రం కోరుకొనే వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు. రాష్ట్రం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తెలంగాణ ప్రజలలో కూడా సమైక్యం కోరుకొనే వాళ్ళు ఉన్నారు.

ద్రోహి అంటే పైకి ఒకటి చెప్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వారు.
ఉదా:
1) తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే అని తెలంగాణ లో చెప్తూ తెలంగాణ ను అడ్డుపెట్టుకొని పెద్ద పెద్ద పదవులను కొట్టేసి తెలంగాణా కి పైసా పని చేయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ద్రోహులు.
2) తెలంగాణ కు అనుకూలం అని చెప్తూ సీమాంధ్ర లో నిరాహార దీక్షలు, బస్సు యాత్రలు చేయించి అక్కదేమో సమైక్యం అని, ఇక్కడేమో జై తెలంగాణా అని రెండు ప్రాంతాల ప్రజలను మభ్య పెడుతున్న తెలుగుదేశం రెండు ప్రాంతాల ద్రోహి
౩) అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణా అంటూ ఉద్యమం పేరు చెప్పుకొని డబ్బులు గుంజుకుంటూ, సొంత నియోజక వర్గం లో వరదలు వచ్చి అంతా పోతే కనీసం ఏమీ చేయకుండా...దోపిడీ దారులు, వలస వాదులు, ఉద్యోగాలు, వివక్ష, వెనకబాటుతనం అంటూ రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేసి అమాయక విద్యార్ధుల ప్రాణాలు బలి దీసుకొని, చివరికి శ్రీకృష్ణ కమిటీ దగ్గర స్వయంపాలన అంటూ మాట మార్చి, సమ్మగా ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మీటింగులు పెట్టుకుంటున్న kcr/TRS తెలుగు ప్రజల అతి పెద్ద ద్రోహి.


వీళ్లందరు చేసిన ఏ ఒక్క దుర్మార్గపు పని చిరంజీవి చేయలేదు. తన నిర్ణయం మార్చుకున్నాడు తప్ప, నిర్ణయం మార్చుకోలేదు అని చెపుతూ రెండు ప్రాంతాలు, రెండు నాల్కలు, రెండు కళ్ళు అని వేదాలు వల్లే వేయట్లేదు.

చివరిగా: చిరంజీవి కి సమైక్యంగా ఉండాలంటు తెలంగాణ లో పర్యటించే అన్నీ హక్కులు ఉన్నాయి. Really looking forward to it.

18 comments:

రవిచంద్ర said...

సరిగ్గా చెప్పారు.

Naganna said...

అలాగైతే...చిరంజీవి...తెలంగాణ విషయంలో 100% అబద్దాలాడాడు. జగిత్యాల సభలో మట్లాడుతూ నేను సామాజిక తెలంగాణకు కట్టుబడి వున్నానన్నొడు తీరా ఎన్నికల పరీక్షలొచ్చే సమయానికి ఆంధ్రా గంపలో దూకాడు. పచ్చి మోసం చేసాడు.
ఆత్మ బలిదానం చేసుకున్న ఒక్కరంటె ఒక్కరిని కూడా అతను పలకరించలెదు. ఇక పోతే మా లీడర్ల గురించి చాంతెడు రాసారు. మీకో విషయం తెలుసా ఇపుడు తెలంగాణా లో సాగుతున్న వుద్యమం ప్రజా వుద్యమం.ప్రజలే అన్నీ ..కెసీఅర్ తో గాని మరెవరితో గాని సంబంధం లేదు. అలాగే చిరంజీవితో కూడాను.. ఒక్క చిరు కాదు ప్రతీ లీడర్ నాకొడుకు ద్రొహి కిందే లెక్క.
కాస్త విషయావగాహనతో పలకడం నేర్చుకుంటె మంచిది. ఇదీ ఎవరికీ వ్యతిరేక పోరాటం కాదు. ఇది ఒక బ్రతుకు పోరాటం.
అన్నా..నమస్తే ...జై తెలంగాణ జై జై తెలంగాణ..!

Goutham Navayan said...

జగిత్యాల లో చిరంజీవి అన్న ఈ మాటలను మరో సారి విని చదివి అప్పుడు చెప్పండి చిరంజీవి తెలంగాణా ప్రజలకు మిత్రుడో శత్రువో ...
""కేంద్రం గనక ప్రతిపాదిస్తే ప్రజారాజ్యం దానికి సానుకూలంగా స్పందిస్తుందని మరీమరీ చెప్తున్నాను. ఇంతకంటే ఇంకేమి ''క్లారిటీ'' కావాలి?
నిజంగా మనందరికీ ఆ తెలంగాణా కావాలి అని అందరూ అనుకుంటే గనక కేంద్రం దగ్గర పెద్ద ''సౌండ్‌'' చేద్దాం. పెద్ద ''శబ్ధం'' చేద్దాం.మీ గొంతు అక్కడ వినపడేలాగా చేద్దాం. కేంద్రం నిర్ణయం ... కేంద్రం నిర్ణయించాలి. అది మీ దాకా చెప్పక - ఇక్కడి వాళ్లేదో చేయడం లేదు ... చేయడం లేదు అంటే ...
కేంద్రం నిజంగా - వాళ్లకి చిత్తశుద్ధి వుంటే ... మన అభీష్టానికి అనుకూలంగా వాళ్లు నిర్ణయం తీసుకుని... వాళ్లు ప్రతిపాదిస్తే
గనక మనం సానుకూలంగా స్పందిస్తాం...! మనం అడ్డుగా వుండం!! మనం స్వాగతిస్తాం! ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని! మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!!
ఎందుకంటే ప్రజాభీష్టానికి నేను ఎప్పుడూ తలవంచే మనిషిని! మీ ప్రజాభీష్టాన్ని నేను శిరసావహిస్తాను! స్వాగతిస్తాను!! జగిత్యాల నడిబొడ్డులో వుండి ...జనం మధ్యలో వుండి ... చెప్తున్నాను....చిరంజీవి ... ప్రజారాజ్యం కేంద్రం ప్రతిపాదనకు ఎట్టి పరిస్థితిలో అడ్డుగా వుండదు! వుండదు!! వుండదు!!!
తుది నిర్ణయం మాత్రం కేంద్రందే! కేంద్రం దానికి సానుకూలంగా స్పందించాలి!! కేంద్రం స్పందించి ప్రతిపాదిస్తే మాత్రం ఈ చిరంజీవి .... మీ చిరంజీవి.... మీ ప్రజారాజ్యం ... దానిని ఎట్టి పరిస్థితిలో అడ్డుకోదు ...! అడ్డుకోదు...!! అడ్డుకోదు...!!! అని చెప్తున్నాను.
కొంతమంది ఈ తెలంగాణా వాదం అనే ఓడను... తెప్పను ఎక్కి అవసరం తీరిపోగానే తెప్ప తగలబెట్టే రకంగా తయారవుతున్నారు!!
మరికొంతమంది ఓడ ఎక్కిని తరువాత ఓడ మల్లన్న అంటున్నారు. ఓడ దిగిన తరువాత బోడి మల్లన్న అంటున్నారు !!
ఇలాంటి అవమానాలకు గురయ్యే కదా మీ ''ఆత్మ గౌరవం'' దెబ్బతింది?! కనుక- మీ ఆత్మగౌరవానికి ప్రథమ పీట వేస్తాం! సామాజిక న్యాయానికి, సామాజిక తెలంగాణాకి ప్రథమ పీఠం వేస్తాం!! ""
ChiranjiviJaiTelanganaSpeech

Anonymous said...

Yes, Chiranjeevi is clear now what is good for the people. These idiots wud ask for seperation and regret later for the irriversable process.

He has to change his raw opinions to the aspirations of the majority. TDP is playing politics to block dirty politics of Congress. KCR is a real buffoon, he is Congress's agent, he is not bothered of Sonia's(in power in both center & the State) opinion but wants powerless CBN's opinion!! Is it not dirty politics?

MIM opposed seperation, what TRS is going to do? Are they going to ban them from Telangana? If TRS guys are legitimately born to their parents, they should do that. MIM wud cut these idiots into pieces.

పుల్లాయన said...

నాగరాజు,

మీరు ఇద్దరు చెప్పింది correct. చిరంజీవి మాట మార్చాడు. మొదట తెలంగాణ కి సై అన్నాడు. ఇప్పుడు సమైక్యం మా నినాదం అంటున్నాడు. కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. తమ నిర్ణయం పైకి చెప్పకుండా రెండు ప్రాంతాల వారిని మభ్యపెడుతున్నారు. అది ఈ టపా లో నేను చెప్ప దలుచుకున్నది.
ప్రజలలో ఉన్న తెలంగాణ ఉద్యమం గురించి నేనేమీ చెప్పలేదు ఇక్కడ. ఆ ఉద్యమాన్ని అడ్డం పెట్టుకొని మిగతా నాయకులు జనాలను ఎలా exploit చేస్తున్నారో మాత్రమే చెప్పాను.
బలిదానం చేసుకున్న వారిని మీరు ఎంత మందిని పలకరించారో చెప్తారా ఒక సారి? చిరంజీవి వాళ్లని పలకరించలేదని అంత feel అవుతున్నారు...వాళ్ళ మరణానికి కారణం చిరంజీవి ఆ? ఆ కారణమైన వారు ఎంతమందిని పరామర్శించారు?

gautham,
మీరు రాసింది బాగుంది. అలాంటివి వింటే ఎవరికైనా ముందు కోపం వస్తుంది. కానీ ఒక సారి ఓపిగ్గా ఆలోచించండి. చిరంజీవి తన నిర్ణయాన్ని మార్చుకుంటున్నట్లు పబ్లిక్ లో చెప్పాడు. మిగతా వారిలాగా రాజకీయాలు, నాటకాలు ఆడలేదు. మీరు ఒక్క విషయం చెప్పండి. మీరు ఒక సారి జీవితం లో తీసుకున్న నిర్ణయాలు, అభిప్రాయాలు ఏ ఒక్క సందర్భంలోనూ మార్చుకోలేదా?

Anonymous said...

ఎం చెప్పావు పుల్లాయన ఎక్సెలెంట్!!

Anonymous said...

@Pullayana--- I guess you are a Great Chiru Fan .. Just for one min . Keep your hand one your heart and think " Indeed Had Chiru got the Leader Qualities ?? " .. No one needs to tell anything ,You only will get the answer ..

Frankly to say .. His party had great members(his fans like you...."even ready to give life -one of My fried " ) and had Caliber to win the last elections .. but only because of him and his speech , his Uncertainity on situations , and atlast but not least starting a Committe on every small issue , Party Got Super Duper HIT Results which he had never got in FILM industry ..

Like our state ... THat party is also in Chaos .. that party is Indeed need of a Leader ..I don't feel still he has got Leader Qualities .. what I feel Please People like you go and lead him ..atleast then we will get a good party .. Until and Unless that pary would always continue in the same way,,Can I say one dialogue ??

Elections Levu ,,, janalu Vote Vesindhi Ledhu .. CM peru Chiranjeevi annadanta venakatiki yevado Neelantodu ....Ala Undhi Chiru Situation Ippudu . .. So Pelase save your Chiru and as well as state ..

Anonymous said...

కీలక సమయంలో చిరంజీవి ప్రత్యేక తెలంగానకు జై అనివుంటే ఈ సమస్య కొలొక్కి వచ్చేసేది. కాదనటానికి సీమాంధ్ర ప్రజలు అనర్హులు. ఎందుకంటే ప్రత్యేక తెలంగానకు సై అన్నపుడు వ్యతిరేకించలేదు.

ప్రత్యేక తెలంగాన వలన వ్యక్తిగతంగా ఎటువంటి నష్టం లేదు. మౌనంగా వున్నా సరిపోయేది. ప్రత్యేక తెలంగాన ను వ్యతిరేకించడం BIG WRONG DECISION.

Krishna K said...

మంచి టపా, అంతకు మించి మంచి కామెంట్స్. ఎవరి దృష్టి లో వాళ్ళు చిరు చేసింది తప్పా, నిజాయితీతో కూడిన నిర్ణయమా అని చెబ్తున్నట్లే, నా దృష్టి లో, చిరు చేసింది మాత్రం కాంగీ కనుసన్నలలో వాళ్ళు కోరుకున్నది అని.
మొదటినుండి చిరు కాంగీ వాళ్ళ పర్సులో క్రెడిట్ కార్డ్ తరహాలో, కారణాలు ఏమయినప్పటికీ వాళ్ళు ఏమికావాలంటే అది చేయటానికి సిద్దమవటం తెలిసిందే కదా, ఇది కూడా వాళ్ళు ఆడించిన (ఆడిస్తున్న) నాటకంలో ఓ భాగమనే నా ఉద్దేశ్యం. "ఒకవేళ" తెలంగాణా కు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకొంటే, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న ప్రాంతాలలో కాంగీ తాత్కాలికంగా నయినా, తుడిచిపెట్టుకొని పోవటం ఖాయం అని, అందువల్ల యువరాజు రాహుల్ గారు పీఠం ఎక్కటానికి ఇబ్బంది అని కొందరు కాంగీయుల అనుమానం, ఒకవేళ అలాంటిది ఏమయినా జరిగితే, కాంగీ కి నష్టం వాటిల్లకుండా చిరు ఎటూ ఎలా కావాలంటే అలా (జెండా పీకియినా, జెండాతో మద్దతు ఇచ్చి అయినా) తన సమైక్యాంద్ర క్రెడిబిలిటీ వాడటానికి ఉపయోగాపడతాడు అని, తనను ఇలాంటి నిర్ణయం తీసుకోవటానికి కాంగీ ముందుచూపుతో ప్రేరేపించింది అని నా నామ్మకం.
నిజం పైవాడికే తెలియాలి. ఏది ఏమయినా, ముక్కు దొర లాగానే, చిరుకూడా తెలంగాణా విషయంలో ఓ స్పష్టత కలిగిఉండటం మాత్రం మెచ్చుకోతగ్గదే (కాంగీ, తెగులు దేశాల జంతర్ మంతర్ వేషాలతో పోలిస్తే) .

వేగు చుక్క said...

తెలంగాణా ద్రోహుల లిస్టులో చిరంజీవి మొదటి వ్యక్తి.

కాంగ్రెస్ తెలంగాణా ఇస్తామాని చెప్పారు. ఆ దిశలోనే వెళ్ళు తున్నారు. అడ్డంకులు వచ్చినపుడు కమిటీ వేశారు. ఇవ్వమని ఏప్పుడూ చెప్పలేదు పార్టీ పరంగా.

తెలుగుదేశం కూడా పార్టీ పరంగా ఎప్పుడూ ప్రణబ్ ముఖర్జీకి ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నట్టు చెప్ప లేదు.

ఎం ఐ ఎం మొదట సమైఖ్యాంధ్ర ఇవ్వాలని చెప్పింది. ఇప్పుడు సమైఖ్యాంధ్ర వీలు కాక పొతే రాయల తెలంగాణా ఇవ్వమని చెపుతుంది. అంటే ఒక విధంగా తెలంగాణా వైపే అడుగేస్తోంది. పూర్తిగా వ్యతిరేకించా లేదంటే ఏదైనా ఫరవా లేదనేగా అర్థం?

ఎలక్షన్ల ముందు ఓట్లడుక్కునే టప్పుడు 'ఓడ మల్లయ్య' అన్న చిరంజీవి, తరువాత 'బోడి మల్లయ్య' అన్నాడంటే ద్రోహి కాకుండా ఏలా ఉంటాడు? పూర్తిగా యూ టర్న్ తీసుకున్న చిరంజీవి కన్నా పెద్ద ద్రోహు లేవరుంటారు, తెలంగాణాకి?

ఇక టీఆరెస్ మీద మీ అక్కసంతా వెల్ల గక్కినట్టున్నారు. మంచో చెడో, టీఆరెస్ మొదటి నుండి ప్రత్యేక వాదానికి కట్టుబడి ఉంది. ఇప్పుడు టీఆరెస్ లేక పోయినా కూడా ప్రజా ఉద్యమం ఆగని స్థాయికి చేరిందంటే అది ఎవరి చాలవో అందరికీ తెలుసు, వేరే చెప్ప వలసిన పని లేదు.

తెలంగాణా ద్రోహులెవరో తెలంగాణా వారికి బాగా తెలుసు. ఆ విషయం ఏ సమైక్య వాదీ పనిగట్టుకొని చెప్ప వలసిన అవసరం లేదు.

Shiva Bandaru said...

సరిగ్గా చెప్పారు పుల్లాయన గారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయంలో క్లారిటీని మెయింటైన్ చేస్తుంది ఒక్క చిరంజీవే. మిగతా వాల్లందరూ ఏ ఎండకాగొడుగు పట్టే రకాలే.వాళ్ళు రాబోయే ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోక తప్పదు

Naganna said...
This comment has been removed by the author.
Naganna said...

BAYYA anonymous.....are U born legitimately..if so u can think about real cause about present life and death issue of TELANGANITES. U need not to worry about our leaders or their activities...now the movement is in the hands of field level people. Abusing is easy i can but thinking divergently is civilized manner. try to learn more about many kinds of historic movements of world and especially TELANGANA. May be u are a low standard thinker. BAYYA..namaste ..fir milengee...!

Anonymous said...

' ఓ అబ్బకు పుట్టినోడైతే ' అనేది తెలంగాణ వాడుక భాష, మరి గోల్కొండ నాగరాజుకి ఇందులో అసభ్యం ఎందుకు కనిపించిందబ్బా? ఈ భాషను వాడిన ముక్కోడిని సపోర్ట్ చేసే వాళ్ళందరిని ఈ భాషలో ప్రశ్నించవచ్చు. ఈ భాష మా అధికారయాస అని ముక్కోడు ప్రకటించాడు, కాబట్టి అది మీ యాస, మీ సంస్కృతి. దాన్ని గౌరవించడం మీ కర్తవ్యం. నిజాం మీ ప్రభువు, వాడిని నెత్తికెక్కించుకోవడం మీ ధర్మం. ఒవైసీ నిజాం/రజాకార్ల పార్టే ప్రతినిధి, అతని అనుసరించండి.
తెలంగాణా సమస్య ఒళ్ళు కొవ్వెక్కినవాళ్ళు తెచ్చుకున్న సమస్య, 'దిక్కుమాలిన ,గడ్డిపీకుడు కమిటీ' అంటూనే దానిముందు తైతక్క లాడాడుగా ముక్కోడు, ఇక మూసుకుని కమిటీ రిపోర్ట్ వచ్చేవరకూ గుడంబా తాగి సంబురాలు , చేసుకోండి. ప్రతి దానయ్యతోనూ ' జై తెలంగాణ ' అనిపించి శునకానందం పొందడం చాలు. హ్హా హ్హా

పుల్లాయన said...

krishna,
మీరు చెప్పింది కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. అది నిజమైన plan అయితే కనక congress ను అభినందించాల్సిందే అంత తెలివైన sketch గీసినందుకు.

వేగు చుక్క
మనమందరం ముందు భారతీయులం. ఈ ప్రపంచం లో ఎవరిగురించి అయిన అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు మనం.
ఇకపోతే మీరు congress తెలంగాణ ఇవ్వమని చెప్పలేదుగా అంటున్నారు. మరి ఇస్తామని ఎప్పుడూ చెప్పారు? ఇస్తామని చెపితే ఎందుకు ఇవ్వలేదు? TDP pranab కమిటీ కి లేఖ రాసిందన్నారు. మరి తెలంగాణా కు వ్యతిరేకంగా సీమాంధ్ర నాయకులతో నివేదిక ఇవ్వతాన్ని మీరు ఎలా సమర్ధిస్తారు?
ఒక్కడు సినిమా లో అన్నట్లు చిరంజీవి అబద్ధం చెప్పాడు. మోసం చేయలేదు. అధికారం అనుభవిస్తు తెలంగాణా నిధులను పక్క ప్రాంతాలకు తరలించలేదు, తెలంగాణ ప్రాజెక్టులు ఆపి వేరే ప్రాంతాలలో ప్రాజెక్టులు కట్టలేదు, విలీనం లో జరిగిన ఒప్పందాల్ని అతిక్రమించడానికి కారణం కాదు, విద్యార్ధుల ఆత్మ హత్యలకు కారణం కాదు. మరి ఏ రకంగా ద్రోహి అంటారు? నిర్ణయాన్ని మార్చుకున్నందుకా? మరి దానికే ద్రోహి అంటే పైన చెప్పినవన్నీ చేసిన వాళ్ళని ఏమనాలో మీరే చెప్పండి.

పుల్లాయన said...

naagaraaju, anonymous:

దయ చేసి ఇక్కడ పరస్పర దూషణలు చేయకండి.

Anonymous said...

తమ తిక్కవాదానికి ఎవరు సపోర్ట్ చేయకున్నా వాళ్ళను ' తెలంగాణా ద్రోహి ' అనడం ఈ మూర్ఖులకు మామూలైపోయింది. వీళ్ళకు తెలుగు పదాలకు అర్థం తెలియదు, చెబితే అర్థం చేసుకునే పజ్ఞా లేదు, నోటికొచ్చినట్టు వాడేస్తారు.

ముక్కోడికి మొన్న ' అంతర్యుద్ధం ' అని వాడాడు, తెరాస వాళ్ళు వసూలైన సొమ్ములో భాగాలకు కొట్టుకోవడం అని వాడి అర్థం. అంతర్యుద్ధం చేయాలంటే ఒవైసీతో చేయండి. లేదా రాయల తెలంగాణా ఏర్పాటు చేసి, జగన్ ను ముఖ్యమంత్రిగా పొంది, ఆ వైఎస్సార్ ఇంకా మిగలబెట్టిన భూములు ఆయనకు కైంకర్యం చేసుకోండి. అదే వాడి మిగిలిపోయిన కల!

Krishna K said...

రాజ్యసభ ఎన్నికలకోసం, తరువాత రాబోయే పురపాలక ఎన్నికలలో కాంగీ తో జతగడతానికి రెడీ అవుతున్న చిరును చూస్తూ ఉంటె మీకేమనిపిస్తుంది ఇప్పుడు? కొద్దిఓజుల క్రితం కూడా కాంగీ తో లోపాయకార ఒప్పందాలు ఏమీలేవని ఆ రెండు పత్రికలు అంటూ సభలలో అమాయకత్వం ప్రదర్సించిన మన అభిమాననటుడు నటన గుర్తుకు తెచ్చుకొంటే ముద్దేయటం లేదూ? తనూ ముద్రిపోయిన రాజకీయనాయకుడో, వాళ్లకంటే ఇంకో రెండాకులు ఎక్కువ చదువుకోవటమో జరిగింది అని ఒప్పుకొంటారా?

ఇప్పటికీ చిరు నోట్లో వేలు పేడితే కొరకలేనివాడే, ఆ రెండు పత్రికలే తనని బదనాం చేస్తున్నాయి అంటారా? రాజకీయమనే పేకాటలో, కాంగీ కి ఉపయోగపడే జోకర్ కార్డ్ నని, చిరు మరో సారి గట్టిగా చెబ్తున్నా, ఆ కాంగీ వాళ్లకు పనికి వచ్చే జోకర్లగా మారాలో లేదో అని, ఈ బావా బామ్మర్దుల నాటకాలకు ఎంతకాలం అభిమానమనే కారణంతో వంత పాడాలని నిర్ణయించుకోవాల్సింది చిరు వీరాభిమానులే!!

బాధాకరమయిన విషయం ఏమిటి అంటే నిజానికి చిరుకు కాంగీ పంచన చేరాల్సిన అవసరం లేదు, ఏ తాత్కాలిక ప్రలోభాలకు లొంగి ఇలా తయారవుతున్నాడో ఆయనకు, ఆయన బామ్మర్దికి మాత్రమే తెలియాలి!!