Friday, May 28, 2010

జగన్ "ఓదార్పు యాత్ర" సినిమా

సినిమా పేరు: jagan's "ఓదార్పు యాత్ర"

హీరో: ఎవరూ లేరు (... నిజం చెప్పాలంటే ఈ సినిమా లో అందరూ విలన్లే, కాకపోతే మీ తృప్తి కోసం మీకు ఎవరు నచ్చితే వాళ్ళని హీరో గా మీరు ఊహించుకోవచ్చు.)
హీరోయిన్: ఎవరు లేరు.

ముఖ్య పాత్రధారులు: జగన్, కెసిఆర్
ఇతర పాత్ర ధారులు: కొండా సురేఖ, కొండా మురళి, యెర్రబల్లి దయాకర్
ఇతరులు: 15 నుంచి 25 యేళ్ళ మధ్య ఉన్న విద్యార్ధులు/యువకులు
ప్రత్యేక అతిధి పాత్రలో: హరికృష్ణ

మాటలు: కెసిఆర్ (ఈయన ఒక range లో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు బాగా పండాయి)
fights: రాళ్ళు రువ్వటం (jac ల ఆధ్వర్యంలో ), తుపాకీ fights (పోలీసులు, గన్ మెన్ల ఆధ్వర్యంలో)

దర్శకత్వం: ఎక్కువ సన్నివేశాలకు కెవిపి, climax మాత్రం కెసిఆర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది.
నిర్మాత: జగన్, రాష్ట్ర ప్రభుత్వం.


గౌరవ దర్శకత్వం: నారా చంద్రబాబు నాయుడు గారు (యెర్రబల్లి, హరికృష్ణ గారి సన్నివేశం ఈయన అత్యంత చాకచక్యంతో చిత్రీకరించారు)
మీడియా పార్ట్నర్స్: సాక్షి, రాజ్ న్యూస్

విశిష్ట ప్రేక్షకులు: గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య గారు, హోమ్ మినిస్టర్ సబిత గారు (వీరు చివరి వరకు ఏమీ చేయకుండా సినిమా చూస్తూ కూర్చున్నారు)

మిగతా ప్రేక్షకులు: రైల్వే స్టేషన్ లో వేచియున్న ప్రయాణికులు, tv ల ముందు కూర్చున్న ప్రజానీకం

విశ్లేషణ: ఇక కొంచెం serious గా మాట్లాడుకుందాం.... ఈ సినిమా వల్ల రాష్ట్రం లో ఏ ఒక్కరికి ఒరిగిందేమీ లేదు. ఎవరికి వారు వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి ఎప్పటిలాగే అమాయకులను బలి చేశారు. ఈ సంఘటనకు కాంగ్రెస్, TRS ల పాత్ర ఎంత ఉందో తెలుగు దేశం పాత్ర కూడా అంతే ఉంది. నిజం చెప్పాలంటే ఈ యాత్ర కు అసలు ప్రాముఖ్యతే లేదు. అలాంటి దాన్ని అనవసరం గా limelight లోకి తీసుకువచ్చాడు యెర్రబల్లి తన వివాదాస్పద వ్యాఖ్యలతో. దాంతో అప్పటివరకు కొద్దో గోప్పో విమర్శలు చేస్తున్న TRS కు మద్దతు లభించినట్లయింది. ఇక షరా మామూలుగా మన కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, మన మీడియా వాటిని పతాక శీర్షికన వేయటం, ఇక కుర్రాళ్లు రెచ్చిపోవటం మామూలుగా జరిగిపోయాయి. ఇక కెసిఆర్ గారు బంద్ కు పిలుపు ఇచ్చి రెక్కాడితేగానీ డొక్కాడని కూలీల కడుపు మరోసారి కొట్టాడు. ఇంట్లో కూర్చొని బిర్యాని తింటూ, కార్లో తిరుగే వాడికి బస్సులు తిరగక సామాన్య మానవుడు పడే అవస్థలు ఎలా తెలుస్తాయి. ఇక జగన్ అనుయాయులు రాష్ట్రం లో చేస్తున్న విధ్వంసాలు అంతా ఇంతా కాదు. తిరుపతి లో రైలు కి నిప్పు పెట్టారు, షాపులను ధ్వంసం చేశారు. ఇలాంటి వాటిని చేయించిన వాళ్ళను, చేసిన వాళ్ళను జైళ్లలో పెట్టి ఎక్కడ కొడుతున్నారో చూడకుండా కుళ్లబొడిచెయ్యాలి.

మన రాష్ట్రం మాత్రం ఎటు వెళ్తుందో అర్ధం కావటం లేదు. ఇలాంటి రాజకీయ పార్టీల ఆటవిక చేష్టలతో మన రాష్ట్రం బీహార్, ఉత్తర ప్రదేశ్ ల సరసన నిలబడే రోజు అతి దగ్గర్లోనే ఉంది అనిపిస్తుంది.

Wednesday, May 19, 2010

చిరు పోలవరం యాత్ర vs 'ఈనాడు'

'పోలవరం' కోసం 'చిరు' చెప్పట్టిన యాత్ర మిగతా రాజకీయ పార్టీలకు సమస్యలపై ఎలా ఉద్యమించాలో దిశానిర్దేశం చేసేలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఒకే అంశం మీద ఇంత తీవ్రతతో చిరు చేస్తున్న ఉద్యమం అభినందనీయం.

ఇక పోతే ఎప్పటిలాగే మన దిక్కుమాలిన మీడియా మాత్రం ఇంత మందికి మేలు చేసే ఒక పర్యటనకు సరైన coverage ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ పార్టీలకు మేలు చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి. మండే వేసవిలో సాయంత్రం నాలుగు గంటలకు రోడ్ షో లో మొదలు పెట్టి రోజుకి కనీసం 15 నుంచి 20 చోట్ల ప్రసంగిస్తూ రాత్రి 1 గంట వరకు యాత్ర, తర్వాత ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి ప్రయాణం, వేరే ప్రాంతం చేరుకొనే సరికి రాత్రి 2, మళ్ళీ పొద్దున 9 కల్లా ఆ ఊళ్ళో కార్యకర్తలతో, అభిమానులతో సమావేశాలు, ఆ తర్వాత మీడియా సమావేశం, తర్వాత భోజనం, కాసేపు విశ్రాంతి మల్లి రోడ్ షో షురూ...స్థూలంగా గత 14 రోజులు చిరు దినచర్య ఈ విధంగానే జరిగింది. ఇకపోతే వచ్చిన ప్రజా స్పందన మాత్రం అపూర్వం. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఊళ్లకు ఊళ్ళు పోటీ పడ్డట్లుగా ఒక ఊరిని మించి ఇంకో ఊళ్ళో జనాలు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట దాటినా, యాత్ర మూడు నాలుగు గంటలు ఆలస్యమైనా అలసట లేకుండా ఎదురు చూశారు. 15 రోజుల పాటు దాదాపు 6 జిల్లాల్లో ఏకబిగిన పర్యటిస్తూ జనాల మధ్యలో గడిపాడు. ఇంత చేసినా పాపం చిరు కి ఒకటి రెండు రోజులు మినహా ఈనాడు paper లో ముఖ్యవార్తలలో చోటు లభించలేదు. విడ్డూరం ఏంటంటే కనీసం రాష్ట్ర రాజకీయాల గురించి రాసే పేజీ లో అతి తక్కువ సార్లు చిరు గురించి రాశాడు. సాధ్యమైనన్ని సార్లు ఏదో ఒక మూలనో, వసుంధర పక్కనో లేక ఆటల పేజీ పక్కనో వేస్తాడు. ఇక ఆ మూల వేసిన వార్త online edition లో మాత్రం బూతద్దం తో వెతికితే తప్ప కనిపించదు. మన చంద్రబాబు అండ్ కో లు మాత్రం ఇంట్లో కూర్చొని బిర్రుగా తిని మధ్యానం దిట్టంగా నిద్రపోయి సాయంత్రం బోర్ కొట్టి జనాలకు ఒక్క పైసా కూడా ఉపయోగపడని ఒక చౌక బారు విమర్శ చేయగానే దానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చి తాటికాయంత అక్షరాలతో రాస్తాడు. ఇది ఈనాడు తీరు.

జిల్లా పేపర్లు ఈ విషయం లో బాగా నయం. వాళ్ళకు ఆ పేపర్ల హైకమాండ్ నుంచి అంతా ఒత్తిడి ఉండదేమో బహుశా. యాత్ర కు వస్తున్న స్పందన గురించి ఎక్కువ శాతం నిజాలు రాశారు, బాగానే coverage ఇచ్చారు.

Friday, May 14, 2010

'పోలవరం' ఆవశ్యకత తెలిపే వీడియో

ఒక ప్రాజెక్ట్ ఆవశ్యకత ను ఇంత చక్కగా చెప్పే వీడియో ఎప్పుడైనా చూశారా?


Friday, May 7, 2010

చిరు పోలవరం యాత్ర effect...ఒత్తిడి లో congress, TDP

ఒక చిన్న పార్టీ అయినా ఈ విషయం లో పెద్ద పార్టీలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచింది ప్రజారాజ్యం. పకడ్బందీ ప్రణాళిక తో రూపొందించిన ఈ యాత్ర రెండో రోజుకు చేరుకోనేలోపే సత్ఫలితాలను ఇస్తుంది. ఒక పక్క యాత్ర కు విశేషమైన జన స్పందన లభిస్తుండగా ఇంకో పక్క మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి ప్రాజెక్టులకోసం నడుం బిగిస్తున్నాయి. congress MP లు ఇప్పటికే ప్రధానిని కలిసి పోలవరం ప్రాజెక్టు జాతీయహోదా కోసం విజ్ఞప్తి చేయగా తెలుగు దేశం కూడా పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామంటుంది. మొత్తానికి అన్నీ పార్టీలు ప్రజా హితమైన ప్రాజెక్టుల మీద దృష్టి సారించాయి. ఈ బుద్ధేదో ముందే ఉంది ఉంటే మనకు ఇన్ని సంవత్సరాల పాటు రైల్వేలలో, కేంద్ర నిధులలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదేమో.

ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక కొత్త పార్టీ రావటం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు అన్న దానికి ఇది perfect ఉదాహరణ. పోతే ప్రజారాజ్యం కూడా చిన్నగా గాడిలో పడుతుంది అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కల్లా prp ఉండదు అని, prp congress లో కలిసి పోతుంది అని దుష్ప్రచారం చేసే వాళ్ళకు చిరంజీవి చెప్పే సమాధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది.



Tuesday, May 4, 2010

ఆసక్తి రేపుతున్న చిరు "పోలవరం" యాత్ర

రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్, దశాబ్దాలుగా మూలుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పై చిరంజీవి చేపట్టిన పోలవరం యాత్ర పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతుంది. రాజకీయాల్లో అడుగు పెట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకపోయినా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రజారాజ్యం భారీ కసరత్తే చేసింది. మొదట మండల స్థాయి సమావేశాలు, తర్వాత జిల్లా స్థాయి సమావేశాలతో జిల్లాలలో ఇప్పటికే ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసింది. దానికి తోడు రెండు మూడు రోజుల క్రితం, పోలవరం ఆవశ్యకత ను చాటి చెప్పే cd లను posters ను విడుదల చేశారు. పార్టీకి ఉన్న తక్కువ వనరులను ఉపయోగించుకుంటూ ఇంత చక్కగా plan చేసి ఒక ప్రజా హిత కార్యక్రమం కోసం ఉద్యమించటం చాలా బాగుంది.

ఇకపోతే సందట్లో సడేమియా లాగా తెరాస పోలవరం ప్రాజెక్ట్ తెలంగాణ కు వ్యతిరేకం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. గోదావరి పరివాహక ప్రాంతం లో చిట్ట చివర కట్టే ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఎలా నష్టపోతుందో వారికే తెలియాలి. పోలవరం ద్వారా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఆ మాటకి వస్తే మునిగి పోయే ప్రాంతాలు తూర్పు, పశ్చిమ గోదావరి లోనూ, చత్తీస్గడ్, ఒరిస్సాలోను ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ జిల్లాలకు వచ్చే తాగునీరు, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా అందే తాగు నీరు, పోలవరం ద్వారా రాయలసీమ కు నీళ్ళు ఇవ్వటం ద్వారా, శ్రీశైలం నుంచి రాయలసీమ కు ఇవ్వాల్సిన నీటి పై ఒత్తిడి తగ్గి, తెలంగాణ కు ఎక్కువ నీరు అందుతుంది. ఇదే కాకుండా పోలవరం లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణ లోని ఎత్తి పోతల పధకాలకు ఉపయోగపడుతుంది

ఇకపోతే చిరు పర్యటన మొదలు కాకముందే దాని effect కొద్ది కొద్దిగా కనపడుతుంది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన రెండు కళ్ళ చంద్రబాబు మొన్నే ప్రధాన మంత్రికి లేఖ రాశాడు, ప్రాణహిత, పోలవరం ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించమని. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని ప్రాజెక్టుల కోసం ఇలా యాత్ర చేపట్టాలని చూస్తున్నారట. ఇలా ఉద్యమం పేరు చెప్పుకొని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పైసా పని కూడా చేయకుండా పబ్బం గడుపుకుతున్న వారు కూడా ఇలా నిజమైన ప్రజాహిత కార్యక్రమాల మీద దృష్టి సారించటం చిరు సాధించిన మొదటి విజయంగా చెప్పుకోవచ్చు.

ఈ యాత్ర విజయవంతమౌతుందని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతుందని ఆశిద్దాం.