'పోలవరం' కోసం 'చిరు' చెప్పట్టిన యాత్ర మిగతా రాజకీయ పార్టీలకు సమస్యలపై ఎలా ఉద్యమించాలో దిశానిర్దేశం చేసేలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఒకే అంశం మీద ఇంత తీవ్రతతో చిరు చేస్తున్న ఉద్యమం అభినందనీయం.
ఇక పోతే ఎప్పటిలాగే మన దిక్కుమాలిన మీడియా మాత్రం ఇంత మందికి మేలు చేసే ఒక పర్యటనకు సరైన coverage ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ పార్టీలకు మేలు చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి. మండే వేసవిలో సాయంత్రం నాలుగు గంటలకు రోడ్ షో లో మొదలు పెట్టి రోజుకి కనీసం 15 నుంచి 20 చోట్ల ప్రసంగిస్తూ రాత్రి 1 గంట వరకు యాత్ర, తర్వాత ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి ప్రయాణం, వేరే ప్రాంతం చేరుకొనే సరికి రాత్రి 2, మళ్ళీ పొద్దున 9 కల్లా ఆ ఊళ్ళో కార్యకర్తలతో, అభిమానులతో సమావేశాలు, ఆ తర్వాత మీడియా సమావేశం, తర్వాత భోజనం, కాసేపు విశ్రాంతి మల్లి రోడ్ షో షురూ...స్థూలంగా గత 14 రోజులు చిరు దినచర్య ఈ విధంగానే జరిగింది. ఇకపోతే వచ్చిన ప్రజా స్పందన మాత్రం అపూర్వం. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఊళ్లకు ఊళ్ళు పోటీ పడ్డట్లుగా ఒక ఊరిని మించి ఇంకో ఊళ్ళో జనాలు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట దాటినా, యాత్ర మూడు నాలుగు గంటలు ఆలస్యమైనా అలసట లేకుండా ఎదురు చూశారు. 15 రోజుల పాటు దాదాపు 6 జిల్లాల్లో ఏకబిగిన పర్యటిస్తూ జనాల మధ్యలో గడిపాడు. ఇంత చేసినా పాపం చిరు కి ఒకటి రెండు రోజులు మినహా ఈనాడు paper లో ముఖ్యవార్తలలో చోటు లభించలేదు. విడ్డూరం ఏంటంటే కనీసం రాష్ట్ర రాజకీయాల గురించి రాసే పేజీ లో అతి తక్కువ సార్లు చిరు గురించి రాశాడు. సాధ్యమైనన్ని సార్లు ఏదో ఒక మూలనో, వసుంధర పక్కనో లేక ఆటల పేజీ పక్కనో వేస్తాడు. ఇక ఆ మూల వేసిన వార్త online edition లో మాత్రం బూతద్దం తో వెతికితే తప్ప కనిపించదు. మన చంద్రబాబు అండ్ కో లు మాత్రం ఇంట్లో కూర్చొని బిర్రుగా తిని మధ్యానం దిట్టంగా నిద్రపోయి సాయంత్రం బోర్ కొట్టి జనాలకు ఒక్క పైసా కూడా ఉపయోగపడని ఒక చౌక బారు విమర్శ చేయగానే దానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చి తాటికాయంత అక్షరాలతో రాస్తాడు. ఇది ఈనాడు తీరు.
జిల్లా పేపర్లు ఈ విషయం లో బాగా నయం. వాళ్ళకు ఆ పేపర్ల హైకమాండ్ నుంచి అంతా ఒత్తిడి ఉండదేమో బహుశా. యాత్ర కు వస్తున్న స్పందన గురించి ఎక్కువ శాతం నిజాలు రాశారు, బాగానే coverage ఇచ్చారు.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
5 comments:
మీడియా కవరేజి గురించి పట్టించుకోకపోవటమే మంచింది. మీడియా వ్రాసిందా, లేదా అని కాకుండా చిరు తను నమ్మిన యాత్ర తను చేయటం బెట్టర్.
ఇక అదే మీడియా చిరు గురించి వచ్చిన క్రొత్తలో తెగ ఊదర గొట్టింది అని కూడా మర్చిపోకండి.
కారణం తెలియదు కాని, చిరు ఏమి చేసినా రాజకీయ లబ్ది కోసమే చేస్తున్నాడనే ఫీలింగ్ ప్రజలలో వుంది. ఆ ఫీలింగ్ ను చెరపగల శక్తి మీడియాకే వుంది. సొంత మీడియా అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈనాడు చాలా చాలా బెటర్. సాక్షి, ఆంధ్ర జ్యోతి మాదిరి చిరంజీవిపై బురద జల్లదు.
anonymous,
మీతో ఏకీభవిస్తున్నాను. మీడియా coverage పట్టించుకోకుండా చిరు ప్రజా సమస్యలపై ముందుకు వెళ్లాలి
a2zdreams,
జనాలు ఇప్పుడు కొంచెం చిరు గురించి ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది.
సాక్షి, ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడుకోవటమే waste. అందుకే వాటి గురించి రాయలేదు.
chaalu ... inka veedi venaka ela tirugutunnaru babuuuu...
As Medha Patkar said, Polavaram is a social & environmental disaster in making. Depriving thousands of tribals for "third crop" is inhuman.
Post a Comment