Tuesday, May 4, 2010

ఆసక్తి రేపుతున్న చిరు "పోలవరం" యాత్ర

రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్, దశాబ్దాలుగా మూలుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పై చిరంజీవి చేపట్టిన పోలవరం యాత్ర పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతుంది. రాజకీయాల్లో అడుగు పెట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకపోయినా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రజారాజ్యం భారీ కసరత్తే చేసింది. మొదట మండల స్థాయి సమావేశాలు, తర్వాత జిల్లా స్థాయి సమావేశాలతో జిల్లాలలో ఇప్పటికే ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసింది. దానికి తోడు రెండు మూడు రోజుల క్రితం, పోలవరం ఆవశ్యకత ను చాటి చెప్పే cd లను posters ను విడుదల చేశారు. పార్టీకి ఉన్న తక్కువ వనరులను ఉపయోగించుకుంటూ ఇంత చక్కగా plan చేసి ఒక ప్రజా హిత కార్యక్రమం కోసం ఉద్యమించటం చాలా బాగుంది.

ఇకపోతే సందట్లో సడేమియా లాగా తెరాస పోలవరం ప్రాజెక్ట్ తెలంగాణ కు వ్యతిరేకం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. గోదావరి పరివాహక ప్రాంతం లో చిట్ట చివర కట్టే ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఎలా నష్టపోతుందో వారికే తెలియాలి. పోలవరం ద్వారా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఆ మాటకి వస్తే మునిగి పోయే ప్రాంతాలు తూర్పు, పశ్చిమ గోదావరి లోనూ, చత్తీస్గడ్, ఒరిస్సాలోను ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ జిల్లాలకు వచ్చే తాగునీరు, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా అందే తాగు నీరు, పోలవరం ద్వారా రాయలసీమ కు నీళ్ళు ఇవ్వటం ద్వారా, శ్రీశైలం నుంచి రాయలసీమ కు ఇవ్వాల్సిన నీటి పై ఒత్తిడి తగ్గి, తెలంగాణ కు ఎక్కువ నీరు అందుతుంది. ఇదే కాకుండా పోలవరం లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణ లోని ఎత్తి పోతల పధకాలకు ఉపయోగపడుతుంది

ఇకపోతే చిరు పర్యటన మొదలు కాకముందే దాని effect కొద్ది కొద్దిగా కనపడుతుంది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన రెండు కళ్ళ చంద్రబాబు మొన్నే ప్రధాన మంత్రికి లేఖ రాశాడు, ప్రాణహిత, పోలవరం ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించమని. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని ప్రాజెక్టుల కోసం ఇలా యాత్ర చేపట్టాలని చూస్తున్నారట. ఇలా ఉద్యమం పేరు చెప్పుకొని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పైసా పని కూడా చేయకుండా పబ్బం గడుపుకుతున్న వారు కూడా ఇలా నిజమైన ప్రజాహిత కార్యక్రమాల మీద దృష్టి సారించటం చిరు సాధించిన మొదటి విజయంగా చెప్పుకోవచ్చు.

ఈ యాత్ర విజయవంతమౌతుందని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతుందని ఆశిద్దాం.

5 comments:

GKK said...

ఇది చిరంజీవి సాధించిన తొలి విజయం. పోలవరం నిర్మాణం అయ్యేవరకు ఈ ప్రయత్నం ఆగకూడదు. పోలవరం తెలుగువారి గుండెచప్పుడుగా మారాలి.

oremuna said...

పోలవరంతోపాటు ఇచ్చంపల్లి కూడా మొదలు పెడితే బాలన్స్ అవుతుంది.

పుల్లాయన said...

oremuna,

తెలంగాణ ప్రాజెక్టుల కోసం కూడా ముందు చిరు నే ఉద్యమిస్తాడని ఆశిద్దాం :)

Shiva Bandaru said...

చిరు చేసే ఉద్యమాల వల్ల ఫలితాలు వస్తున్నాయి. కొద్ది నెలల క్రితం గోదావరి గ్యాస్ పై చిరు ఉద్యమం ఫలితంగా ఉబయగోదావరి జిల్లాల్లొని గ్యాస్ పవర్ ప్లాంట్స్ కి ఇప్పుడు గ్యాస్ కొరత లేదు.అందువల్ల పవర్ కట్స్ కూడా దాదాపుగా లేనట్టే ఇక్కడ

ఇక పోలవరం విషవానికి వస్తే దిగువ ప్రాజెక్టులపై ఎగువున్నవారు అభ్యంతరం వ్యక్తం చెయ్యడం రాజకీయం తప్ప మరేమీ కాదు.

Krishna K said...

మూడునాళ్ళ ముచ్చట లాగా కాకుండా, చిరు గట్టిగానే ఈ యాత్ర చేయాలని, అది విజయవంతం కావాలని ఆశిద్దాం. ఆ యాత్రలో కాస్తో, కూస్తో కాంగీ ని తిడితే (రాష్ట్రం, కెంద్రం లలో అధికారం లో ఉండి కూడా ఉదాశీనం గా ప్రవర్తిస్తున్నందుకు) కాంగీ కొంగుపట్టుకొని తిరిగేవాడన్న మాటను కూడా తుడిచేసినవాడవుతాడు.