సినిమా పేరు: jagan's "ఓదార్పు యాత్ర"
హీరో: ఎవరూ లేరు (... నిజం చెప్పాలంటే ఈ సినిమా లో అందరూ విలన్లే, కాకపోతే మీ తృప్తి కోసం మీకు ఎవరు నచ్చితే వాళ్ళని హీరో గా మీరు ఊహించుకోవచ్చు.)
హీరోయిన్: ఎవరు లేరు.
ముఖ్య పాత్రధారులు: జగన్, కెసిఆర్
ఇతర పాత్ర ధారులు: కొండా సురేఖ, కొండా మురళి, యెర్రబల్లి దయాకర్
ఇతరులు: 15 నుంచి 25 యేళ్ళ మధ్య ఉన్న విద్యార్ధులు/యువకులు
ప్రత్యేక అతిధి పాత్రలో: హరికృష్ణ
మాటలు: కెసిఆర్ (ఈయన ఒక range లో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు బాగా పండాయి)
fights: రాళ్ళు రువ్వటం (jac ల ఆధ్వర్యంలో ), తుపాకీ fights (పోలీసులు, గన్ మెన్ల ఆధ్వర్యంలో)
దర్శకత్వం: ఎక్కువ సన్నివేశాలకు కెవిపి, climax మాత్రం కెసిఆర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది.
నిర్మాత: జగన్, రాష్ట్ర ప్రభుత్వం.
గౌరవ దర్శకత్వం: నారా చంద్రబాబు నాయుడు గారు (యెర్రబల్లి, హరికృష్ణ గారి సన్నివేశం ఈయన అత్యంత చాకచక్యంతో చిత్రీకరించారు)
మీడియా పార్ట్నర్స్: సాక్షి, రాజ్ న్యూస్
విశిష్ట ప్రేక్షకులు: గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య గారు, హోమ్ మినిస్టర్ సబిత గారు (వీరు చివరి వరకు ఏమీ చేయకుండా సినిమా చూస్తూ కూర్చున్నారు)
మిగతా ప్రేక్షకులు: రైల్వే స్టేషన్ లో వేచియున్న ప్రయాణికులు, tv ల ముందు కూర్చున్న ప్రజానీకం
విశ్లేషణ: ఇక కొంచెం serious గా మాట్లాడుకుందాం.... ఈ సినిమా వల్ల రాష్ట్రం లో ఏ ఒక్కరికి ఒరిగిందేమీ లేదు. ఎవరికి వారు వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి ఎప్పటిలాగే అమాయకులను బలి చేశారు. ఈ సంఘటనకు కాంగ్రెస్, TRS ల పాత్ర ఎంత ఉందో తెలుగు దేశం పాత్ర కూడా అంతే ఉంది. నిజం చెప్పాలంటే ఈ యాత్ర కు అసలు ప్రాముఖ్యతే లేదు. అలాంటి దాన్ని అనవసరం గా limelight లోకి తీసుకువచ్చాడు యెర్రబల్లి తన వివాదాస్పద వ్యాఖ్యలతో. దాంతో అప్పటివరకు కొద్దో గోప్పో విమర్శలు చేస్తున్న TRS కు మద్దతు లభించినట్లయింది. ఇక షరా మామూలుగా మన కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, మన మీడియా వాటిని పతాక శీర్షికన వేయటం, ఇక కుర్రాళ్లు రెచ్చిపోవటం మామూలుగా జరిగిపోయాయి. ఇక కెసిఆర్ గారు బంద్ కు పిలుపు ఇచ్చి రెక్కాడితేగానీ డొక్కాడని కూలీల కడుపు మరోసారి కొట్టాడు. ఇంట్లో కూర్చొని బిర్యాని తింటూ, కార్లో తిరుగే వాడికి బస్సులు తిరగక సామాన్య మానవుడు పడే అవస్థలు ఎలా తెలుస్తాయి. ఇక జగన్ అనుయాయులు రాష్ట్రం లో చేస్తున్న విధ్వంసాలు అంతా ఇంతా కాదు. తిరుపతి లో రైలు కి నిప్పు పెట్టారు, షాపులను ధ్వంసం చేశారు. ఇలాంటి వాటిని చేయించిన వాళ్ళను, చేసిన వాళ్ళను జైళ్లలో పెట్టి ఎక్కడ కొడుతున్నారో చూడకుండా కుళ్లబొడిచెయ్యాలి.
మన రాష్ట్రం మాత్రం ఎటు వెళ్తుందో అర్ధం కావటం లేదు. ఇలాంటి రాజకీయ పార్టీల ఆటవిక చేష్టలతో మన రాష్ట్రం బీహార్, ఉత్తర ప్రదేశ్ ల సరసన నిలబడే రోజు అతి దగ్గర్లోనే ఉంది అనిపిస్తుంది.
నేడు తెలుగు భాషా దినోత్సవం
16 years ago
2 comments:
ఈ చెత్త రాజకీయాలతో చిరాకెత్తిపోతుంది..ఎందుకొచ్చిన బంద్లూ అని జనం విసిగి పోతున్నారు..ఈ వెదవలు మాత్రం ప్రపంచాన్ని జయించి నట్లు ఫీలయిపోతున్నారు...
అందర్నీ కవర్ చేసారు కాని, ఈ సినేమాలో కాస్తో కూస్తో చివరికి లాభ పడ్డాను అనుకొంటున్న కమెడియన్ చిరు ను మీరు కవర్ చేయటం మర్చిపోయినట్లున్నారు :))
Post a Comment