Friday, December 31, 2010

రాజకీయ బలప్రయోగాలు vs రాజకీయ చేయూత

ప్రార్ధించే పెదవుల కన్నా చేయూతనిచ్చే చేతులు మిన్న అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఈ మధ్య వచ్చిన అకాల వర్షాల వల్ల ఎంతో మంది రైతులు మరణించారు, ఇంకా మారనిస్తూనే ఉన్నారు. వారికి ప్రభుత్వం ప్రకటించిన సాయం పక్కన పెడితే ప్రతిపశాలు మాత్రం దీక్ష లు, గర్జనలు అంటూ తెగ గోల చేస్తున్నాయి.

జగన్ లక్ష దీక్ష అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఇది ఒక నిరాహార దీక్ష లా కాకుండా ఒక బల పరీక్ష లాగా, ఒక పార్టీ announcement సభ లాగా జరిగింది. కొత్తగా రిలీస్ అయ్యే సినిమా కి పబ్లిసిటీ కి ఎంత ఖర్చు పెడతారో అంతకు 100 రెట్లు ఖర్చు పెట్టారు ప్రచారం కోసం ఒక్క కృష్ణా జిల్లాలోనే. ప్రతి ఊళ్లో వందల పోస్టర్లు బానర్లు కట్టారు. ఒక మనిషి దగ్గర లక్ష కోట్లు ఉంటే మీడియా మొత్తాన్ని కొని, ఇంకా డబ్బులతో ఏమేమి చేయవచ్చో దానికి ఈ దీక్ష, జగన్ ప్రత్యక్ష ఉదాహరణలు. ఈ దీక్ష కు పెట్టిన ఖర్చు తో రైతులను ఆడుకోవచ్చు కదా అంటే ఆ పని మాత్రం చేయడు. ఎందుకంటే ఇతనికి కావాల్సింది బలపరీక్ష కానీ రైతు సంక్షేమం కాదు. ఈ దీక్ష వల్ల రైతులకు ఒరిగింది పేద్ద గుండు సున్నా.


ఇక చంద్ర బాబు దీక్షలో పెద్దగా హంగు ఆర్భాటాలు లేవు. కాకపోతే తెలివిగా ప్రచారం కోసం డబ్బులు ఖర్చుపెట్టకుండా, తెలివిగా (ఊరు, పేరు లేని) జాతీయ నేతలతో హంగామా చేసి వాళ్ల కోసం ప్రత్యేక విమానాలు ఈర్పాటు చేసి చివరికి ప్రభుత్వం కొద్దిగా కూడా స్పందించకపోవటంతో సమ్మగా చిన్న డ్రామా ఆది సర్దుకున్నాడు. ఇక ఇప్పుడు బలపరీక్ష మొదలు పెట్టింది తెలుగు దేశం కూడా. రైతుకోసం అని పేరు పెట్టి ఈ సభ కోసం మరి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారో వాళ్లకే తెలియాలి. ఇక వీళ్ళ సొంత మీడియా దీనికి ఇస్తున్న coverage అంతా ఇంతా కాదు. ఇక్కడ కూడా రైతులకు ఒరిగేది ఏమీ లేదు. బండి సున్నా.


ఇక మన అభిమాన నేత kcr తెలంగాణ లో ఇంత మంది రైతులు చనిపోయిన అసలు చీమా కూడా కుట్టినట్లు లేదు ఇతనికి. కనీసం తెలంగాణ రైతుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణ రాకముందే ఇతను ఇలా ఉంటే ఇక తెలంగాణ వచ్చాక ఏంచేస్తాడో మనం ఊహించుకోవచ్చు. ఇక్కడ సున్నా కూడా అనవసరం. నో సున్నా


వీళ్లందరితో పోల్చుకుంటే అంత వనరులు లేకపోయినా, హంగు ఆర్భాటం లేకుండా చిరు అందిస్తున్న సహకారం అభినందనీయం. పై రెండు దీక్షలపై వచ్చిన కధానాలలో కనీసం వందో వంతు కధానాలు కూడా 'చిరు' సహాయం గురించి కనిపించదు మన మీడియా లో. వీరు అందించే 25 వేలు చాలా తక్కువ మొత్తం అయ్యుండొచ్చు. కానీ చనిపోయిన రైతు కుటుంబాలలో ఇదే కొంచెం ధైర్యాన్ని నింపుతుంది.














Friday, December 10, 2010

తెలంగాణ పై వివక్ష

తెలంగాణ పై పాలకులే కాకుండా ప్రకృతి కూడా వివక్ష చూపుతుంది. గత సంవత్సర కాలంగా వచ్చిన తుపానులే ఇందుకు నిదర్శనం. లైలా, జల్ తుఫానులు కోస్తా జిల్లాలో భారీ పంట నష్టం, ప్రాణ నష్టం కలిగించాయి. జల్ తుఫాను అయిన 10 రోజుల తర్వాత కూడా విజయవాడ నుంచి నేను తిరుపతి వెళ్తుంటే నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో నీటిలో మునగకుండా ఒక్క పంట పొలం కూడా కనిపించలేదు. అంతలా దెబ్బ కొట్టింది ఆ తుఫాను. ఈ సంవత్సరం మొదట్లో బాగా వర్షాలు పడటం తో పంట కూడా కొద్దిగా త్వరగా కోతకొచ్చే సమయం లో జల్ తుఫాను కోస్తా జిల్లాలలో రైతులకు గుండె కోత ను మాత్రమే మిగిల్చింది. జల్ తుఫానులో అంతగా నష్టం జరగని జిల్లాలలో ఈ వారం వచ్చిన తుఫాను వల్ల ఎక్కువ అప్పుడు బయటపడి బట్టగట్టిన పంటలు కూడా నాశనం అయిపోయాయి.

ఈ లింక్ http://disastermanagement.ap.gov.in/website/cyclone.htm చూస్తే కనక గత వంద సంవత్సరాలలో వందకు పైగా తుఫానులు కోస్తా జిల్లాలను అతలాకుతలం చేసినట్లు తెలుస్తుంది. ఇంకొంచెం గమనిస్తే నీళ్ళు బాగా ఉండి పంటలు బాగా పండుతాయి ఆనుకొనే గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాలలో తుఫానుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది.

యేతా వాతా నేను చెప్పొచ్చేదేంటంటే తుఫానులు కూడా తెలంగాణ పై వివక్ష చూపుతున్నాయి. ఈ తుఫానులు కొద్దో గోప్పో తెలంగాణ లోనూ ప్రతాపం చూపుతున్నా, కోస్తా తో పోలిస్తే తెలంగాణ జిల్లాలలో జరిగే నష్టం కొంచెమే. మా నీళ్ళు దోచుకుంటున్నారు అని తెగ బాధ పడే తెలంగాణా వాదులు (అందరు తెలంగాణ వాదులు కాదు...కొంత మంది మాత్రమే) తుఫానులలో కూడా తెలంగాణ కు వాటా కావాలని కోరుకోరెoదుకు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. తుఫానులు చూపుతున్న వివక్ష ను ఖండిస్తూ తుఫాను దిష్టి బొమ్మ దగ్ధం చేసి తెలంగాణ వ్యాప్త బంద్ కు OU JAC పిలుపు ఇవ్వాలని ఆశిస్తున్నాను.

Friday, December 3, 2010

"ఆరెంజ్" సినిమా "బానే ఉంది"

PS: అదిరింది > బాగుంది > బానే ఉంది > average > చెత్త

సినిమా ని variety గా cut చేసి చూస్తే ఇలా ఉంది

ఫస్ట్ హాఫ్:
మొదటి 20 నిముషాలు = average
తర్వాత గంట = బాగుంది
సెకండ్ హాఫ్:
ఫ్లాష్ బ్యాక్ ముందు= బానే ఉంది
ఫ్లాష్ బాక్, ముగింపు = average

Overall: సినిమా "బానే ఉంది"
చివరి 40 నిముషాలు భాస్కర్ అంత convincing గా తీయలేక పోయాడు. But oveall pretty descent effort by Bhaskar and the movie is any day much better than regular telugu commercial flicks.

సినిమా లో నాకు నచ్చిన విషయాలు:

* first half బాగుంది
* రూబా రూబా పాట theatre లో అదిరిపోయింది. theatre sound system కి ఆ బీట్స్ సూపర్ గా వచ్చాయి. ఆ పాటలో ఒక step నాకు పిచ్చపిచ్చగా నచ్చింది.
* చరణ్ చివర్లో జెనీలియా ని అనుకరించే సీన్ బాగుంది. జెనీలియా 'యో'..'యో' episode నచ్చింది నాకు.

ఎవరు ఈ సినిమా చూడొచ్చు:

* youth కు ఎక్కువ శాతం నచ్చే అవకాశం ఉంది ఈ సినిమా
* మీకు ఆర్య-2, డార్లింగ్ సినిమాలు నచ్చితే మీరు ఈ సినిమా కూడా ఒక సారి try చేయొచ్చు.

ఎవరికి నచ్చదు ఈ సినిమా:
పొరపాటున మీకు బృందావనం, సింహా, కొమరం పులి లేకపోతే రవితేజ సినిమాలు నచ్చాయనుకోండి మీరు ఈ సినిమా కి వెళ్లకపోవటం బెటర్. ఎందుకంటే ఈ సినిమా లో బృందావనం లో లాంటి అద్భుతమైన bus ఫైట్ లాంటి ఫైట్ గానీ లేకపోతే JNTR sound రాకుండా బృందావనం లో చేసిన ఫైట్ ఇలాంటివి ఈ సినిమాలో ఉండవు. కాబట్టి మీరు సాధ్యమైనంత దూరంగా ఉంటే better.

Tuesday, November 23, 2010

పోలవరం కోసం చిరు మరో ప్రయత్నం

పోలవరం ప్రాజెక్ట్ కోసం రెండో సారి చిరు ప్రధానిని కలిసి జాతీయ హోదా కోసం విన్నవించారు. అలాగే రాష్ట్రం లోని పలు సమస్యలను ప్రధాని దృష్టి కి తీసుకువెళ్ళారు. మరి మన 33 మంది MP లకు రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేయాలని ఎప్పుడు కనువిప్పు కలుగుతుందో.

ప్రధాని ని కలిసి వివరించిన సమస్యలను సరిగ్గా ప్రస్తావించకుండా, విలేఖరుల సమావేశం లో అన్న ఒక మాట ని head line గా పెట్టి జనాలను పక్కదోవ పట్టించే ఈనాడు రాసిన కధానాన్ని కూడా కింద చూడొచ్చు.



Wednesday, September 15, 2010

చంద్ర బాబు కి అభినందనలు

తెలంగాణ రైతులు రోడ్లెక్కి ఎరువుల కోసం రాస్తా రోకోలు చేస్తుంటే so called తెలంగాణ నాయకులం అని చెప్పుకొనే ఒక్కడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్రిక్త పరిస్తుతులు ఉన్నా అక్కడికి వెళ్ళి ఆ సమస్య రాష్ట్రం మొత్తం వినపడేలా చేసినందుకు బాబు కు అభినందనలు.
చిన్నప్పుడు క్లాస్ లో చివరి బెంచి లో కూర్చొని గొడవ చేస్తున్న కొంత మందిని మా టీచర్ ఇలా తిట్టే వాళ్ళు "ఒరేయ్ నువ్వు ఎలాగూ చదివి చచ్చేది లేదు ఎందుకురా పక్కన వాళ్ళని కూడా చెడగొడతావ్" అని. సరిగ్గా ఇది kcr కి వర్తిస్తుంది. తెలంగాణ వారి ప్రయోజనాల కోసం ఈ మహానుభావుడు చేసిన ఒక్క మంచి పని లేదు, అది సరి కదా, కనీసం ప్రజల సమస్యల మీద వేరే పార్టీ వారు ధర్నాలు చేస్తుంటే కనీసం వాళ్ళను కూడా చేయనీయడు. వీడి ఉద్దేశం ఎంతో అర్థం కాదు. ఆ రైతులు ఎరువులు దొరక్క వాళ్ళ శ్రమ అంతా వృధా కావాలని వీడి కొరికేమో మరి. బాబ్లీ మీద ఉద్యమం చేస్తుంటే ఎన్నికలున్నాయని చేస్తున్నారు అంటాడు. మరి ఇప్పుడు ఎన్నికలు లేవు కదా, మరి ఇప్పుడు ఈ ఏడుపు ఏంటో అర్థం కాదు. పక్క రాష్ట్రం వాడు మన నీళ్ళు దోచుకుంటే మనకు నష్టం లేదు, అదే గోదావరి చివరలో ఒక ప్రాజెక్ట్ కడుతుంటే దాని మీద పది ఏడుస్తాడు. ఒక వేరే దేశపు యువతి ఒక పార్టీ కి అధ్యక్షురాలుగా ఉంటే మనకు నష్టం లేదు, సాటి తెలుగు వాడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉంటే తెలుగు దేశం ఆంధ్ర పార్టీ అని చెత్త ప్రచారాలు మొదలు పెడతాడు. నిజం చెప్పాలంటే తెలంగాణ మీద నిర్ణయం తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీ. కానీ వాళ్ళని నిలదీయకుండా ఎంత సేపు తెలుగుదేశాన్ని target చేసి kcr చేసే విష ప్రచారాలు వీడు కాంగ్రెస్ తో కుమ్మక్కయిన విషయాన్ని చెప్పకనే చెపుతున్నాయి.
కాకపోతే ఇక్కడ తెలుగు దేశం కూడా కొన్ని సందర్భాలలో నిందించాలి. జగన్ తెలంగాణ వస్తుంటే మొట్ట మొదట జగన్ ను ఇక్కడ తిరగనివ్వం అని ఎర్రబల్లి చేసిన వివాదం అంతా ఇంతా కాదు. ఇలా వాళ్ళ రాజకీయ ప్రత్యర్ధులను అడ్డుకోవటానికి మొదట తెలంగాణ వాదాన్ని వాడుకోవటానికి ప్రయత్నించింది తెలుగు దేశం వాళ్ళే. ఇప్పుడు అదే వాళ్ళకి ఎసరు పెట్టింది.
ఇక పోతే బాబు కాన్వాయ్ మీద దాడి అందరూ ముక్త కంఠం తో ఖండించాల్సిన విషయం. దేశం లో ఎవరు ఎక్కడికైనా వెళ్లొచ్చు ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేని kcr అండ్ కాంగ్రెస్ తెలంగాణ నాయకులకు బుద్ధి ఎప్పుడూ వస్తుందో అర్థం కావటం లేదు. చివరికి బాబు పై ఈ దాడిని కూడా రాజకీయ పార్టీల నాయకులు ('చిరు' మినహా)ఖండించలేక పోగా, ఇందులో తప్పేమీ లేదు అన్నట్లు మాట్లాడిన kcr, vh లు నేటి రాజకీయాల దిగజారుడు తనానికి నిదర్శనం. ఏది ఏమైనా బాబు కి హృదయ పూర్వక అభినందనలు.

Sunday, September 5, 2010

HCA పై కన్నేసిన TRS

ఇది రెండు రోజుల క్రితం ఈనాడు లో వచ్చిన వార్త. ఆంధ్ర దోపిడీ దారులు, దొంగలు అంటూ నిరంతరం తెలంగాణ యువకులని రెచ్చగొట్టి అమాయకులైన చాలా మంది విద్యార్ధుల ప్రాణాలు పోవటానికి ఏకైక కారణం kcr/trs. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట విద్యార్ధులను, నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగానే ఉంటుంది. ఇక ఉద్యమం లో ఇంతమంది విద్యార్ధులు బలిదానం చేసుకుంటే TRS నాయకుడు ఒక్కడికి కూడా ఏమీ కాలేదు. హాయిగా పండగ చేసుకుంటున్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా ప్రజలు TRS నే నమ్మి వాళ్ళకు పట్టం కట్టారు. ఇక group 1 విషయం లో కూడా విద్యార్ధులను రెచ్చగొట్టి వాళ్లని విధ్వంసాలకు ఉసిగొల్పుతూ ఈ KCR మహానుభావుడు వెనకాల చేస్తుందేoటయ్యా అంటే వాళ్లకి HCA మీద పట్టు కావాలంట. ఉద్యమం ఇంత ఉధృతంగా నడుస్తూ పిల్లలు బలిదానాలు ఇస్తుంటే వీళ్ళు చేసే పని ఇది. రాష్ట్రం లో చిచ్చు పెట్టి నీ పని నువ్వు సమ్మగా చేసుకుపోతున్నందుకు నీకు వందనాలు KCR.

Tuesday, August 17, 2010

శ్రీరామ్ కి ఫస్ట్ వస్తే తెలుగోళ్లకేంటి?

అందరూ indian idol లో తెలుగు తేజం అంటూంటే నేను కూడా ఉత్సాహంగా ఒకట్రెండు తెలుగు ఛానళ్ల వాళ్ళు ఈ పోటీ గురించి, ఈ పోటీలో అతను పాడిన పాటలను చూపిస్తూ వేసిన కార్యక్రమాలు చూసాను. ఇక పోతే ఇక్కడ నేను మాట్లాడేది అతను బాగా పాడాడా లేదా అన్న విషయం కాదు, అతను అందరికన్నా బాగా పాడాడు. అయితే నాకేంటి? ఆ కార్యక్రమం నేను చూడటానికి ఏకైక కారణం అతను తెలుగు వాడు కాబట్టి. ఇక ఆ కార్యక్రమం లో హేమమాలిని అతన్ని రెండు మూడు ప్రశ్నలు తెలుగు లో అడిగింది. అతను ఒకట్రెండు ప్రశ్నలకు తెలుగు లో జవాబు చెప్పి ఆమె తెలుగు లో మాట్లాడుతున్నా ఇతడు హిందీ అందుకున్నాడు. సరే కదా అని ఆ కార్యక్రమం చూస్తుంటే ఒకళ్లెవరో మీ south కి సంబంధించిన ఒక dialog చెప్పండి అని ఎవరో అడిగారు అతన్ని. వెంటనే అతను రజనీకాంత్ ఏదో ఒక సినిమాలోని ఒక తమిళ డైలాగ్ చెప్పాడు. కనీసం రజనీకాంత్ నటించిన తెలుగు డైలాగ్ ఏమన్నా చెప్పినా నాకు ok అనిపించేదేమో.
మరి అతను ఎన్ని పాటలు పాడాడో అందులో తెలుగు పాటలు ఎన్ని ఉన్నాయో నాకు అసలు తెలియదు. జాతీయ స్థాయి లో వచ్చే కార్యక్రమం లో అతను కల్పించుకు మరీ తెలుగు పాట పాడాల్సిన అవసరం లేదు, తెలుగు మాటలు మాట్లాడాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ ఒకళ్లు request చేసిన తర్వాత కూడా అతను తెలుగు కి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోవటం నాకు నచ్చలేదు. కాబట్టి నేను vote వెయ్యలేదు.

Sunday, August 8, 2010

ఉప్పొంగిన అభిమానం అంటే ఇది

ఉప్పొంగిన అభిమానం అంటే సొంత పత్రికలో, సొంత ఛానెల్ లో, అరువు తెచ్చుకున్న ఇంకో ఛానెల్లోనో 24 గంటలు ఉప్పొంగిన అభిమానం అంటూ ఊదరు కొట్టుకోవటం కాదు, రెండు నెలల ముందు యాత్ర తేదీలను చెప్పి యేర్పాట్లు చేయమని MLA, MP ల వారసులతో కోట్లు ఖర్చు పెట్టించి 100 కి పైగా వాహనాలతో కాన్వ్యాయ్ పెట్టి, లారీ లలో జనాలను తరలించి అది సొంత బలంగా డబ్బా కొట్టుకోవటం కాదు. అతి తక్కువ ప్రచారం తో ఒకరు తరలించకుండా సొంతంగా అడుగడుగునా, ఊరూరా, పల్లె పల్లెనా వేలల్లో తరలివస్తే దాన్ని ఉప్పొంగిన అభిమానం, జన నీరాజనం అంటారు.




Tuesday, June 8, 2010

కాంగ్రెస్ గడ్డి తింటే మేమూ తింటాం...

తీరు లాగా ఉంది తెలుగు దేశం పార్టీ తీరు.
తెలంగాణ గురించి చంద్రబాబు ని వైఖరి చెప్పమంటే కాంగ్రెస్ అధ్యక్షురాలు తన వైఖరి చెప్తే చెప్తాడంట...
తెలంగాణ తెదేపా నాయకులని రాజీనామా చేయమని అడిగితే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే చేస్తారంట...
ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది కాబట్టి మేమూ పోటీ చేస్తాం అంటున్నారు ఇప్పుడు...
అంటే కాంగ్రెస్ గడ్డి తింటే మీరూ తింటారా? కాంగ్రెస్ తో ఇంత భావ సారూప్యం పెట్టుకున్న మీకు ఒక పార్టీ అవసరమా? మీరు కూడా కాంగ్రెస్ లో విలీనం అయిపోయి హాయిగా heritage వ్యాపారం చేసుకోవచ్చు కదా. అప్పుడు ఇన్ని వెధవ కారణాలు వెతుక్కోనే అవసరం రాదు.
మీకు నిజంగా దమ్ముంటే ఎన్నికలు కాబట్టి పోటీ చేస్తున్నాం అని ధైర్యంగా చెప్పండి. సంవత్సరం తిరక్కుండానే రాజీనామా ఏంటి అని ఎదిరించండి అంతే కానీ కాంగ్రెస్ వాళ్ళు ప్రతి దాన్ని అధిష్టానం మీదకు తోసినట్లు మీరు కాంగ్రెస్ మీద తోయటం దేనికి?
ఇక అన్నిటికన్నా హైలైట్ ఇవ్వాళ ఈనాడు లో రాసిన కింద వార్త. covering అంటే ఎలా ఉండాలో ఈ వార్త ను చూసి నేర్చుకోవాలి మిగతా రాజకీయ పార్టీలను సపోర్ట్ చేసే వార్తా పత్రికల వాళ్ళు. ఇది చదివిన వాళ్ళు మాత్రం నువ్వు నాకు నచ్చావ్ సినిమా లో సునీల్ కళ్ళ నీళ్ళు పెట్టుకొని "మీరు కలెక్టర్ అవుతారు బాబు" అన్నట్లు "తెలుగుదేశం పోటీ చేయాల్సిందే బాబు" అనుకోవటం మాత్రం ఖాయం.

హాయిగా బాబు లాగా ఈనాడు లాంటి ఒక paper ని కొనుక్కుంటే ప్రధాన ప్రతిపక్షం గా ఉండి ప్రజలకు పైసా పని చేయకపోయినా రాష్ట్రాన్ని అంతా మనమే ఉద్ధరిస్తున్నట్లు ఫోసు కొడుతూ happy గా టైమ్ పాస్ చేయొచ్చు.

Monday, June 7, 2010

పోలవరం నిర్వాసితులతో 'చిరు'

ఒక ప్రొజెక్టు ను ఎంత బాగా చేసినా దాన్ని ఒక logical end/conclusion కు తీసుకు రావటం చాలా ముఖ్యం. చిరు కు మంచి మార్కులు తెచ్చిపెట్టిన పోలవరం యాత్ర లో భాగంగా చిరు ఖమ్మం, గోదావరి జిల్లాల్లోని నిర్వాసితులతో మాట్లాడి వాళ్ళ సమస్యలు విన్నారు. మొక్కుబడిగా 'మమ' అనిపించటమో లేకపోతే "రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా?" అంటూ ఒక standard చౌక బారు విమర్శ చేయటమో కాకుండా ఒక పద్ధతి ప్రకారం నిర్వాసితులతో కూడా భేటీ అయ్యి రాజకీయ ప్రసంగాలతో సమయం వృధా చేయకుండా ఎక్కువ సమయం నిర్వాసితులతోటే మాట్లాడించి వారి సమస్యలను విని వాటిని ప్రధాని దృష్టికి తీసుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు చిరు.All the Best Chiru.



Friday, May 28, 2010

జగన్ "ఓదార్పు యాత్ర" సినిమా

సినిమా పేరు: jagan's "ఓదార్పు యాత్ర"

హీరో: ఎవరూ లేరు (... నిజం చెప్పాలంటే ఈ సినిమా లో అందరూ విలన్లే, కాకపోతే మీ తృప్తి కోసం మీకు ఎవరు నచ్చితే వాళ్ళని హీరో గా మీరు ఊహించుకోవచ్చు.)
హీరోయిన్: ఎవరు లేరు.

ముఖ్య పాత్రధారులు: జగన్, కెసిఆర్
ఇతర పాత్ర ధారులు: కొండా సురేఖ, కొండా మురళి, యెర్రబల్లి దయాకర్
ఇతరులు: 15 నుంచి 25 యేళ్ళ మధ్య ఉన్న విద్యార్ధులు/యువకులు
ప్రత్యేక అతిధి పాత్రలో: హరికృష్ణ

మాటలు: కెసిఆర్ (ఈయన ఒక range లో చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలు బాగా పండాయి)
fights: రాళ్ళు రువ్వటం (jac ల ఆధ్వర్యంలో ), తుపాకీ fights (పోలీసులు, గన్ మెన్ల ఆధ్వర్యంలో)

దర్శకత్వం: ఎక్కువ సన్నివేశాలకు కెవిపి, climax మాత్రం కెసిఆర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పోలీసుల ఆధ్వర్యంలో జరిగింది.
నిర్మాత: జగన్, రాష్ట్ర ప్రభుత్వం.


గౌరవ దర్శకత్వం: నారా చంద్రబాబు నాయుడు గారు (యెర్రబల్లి, హరికృష్ణ గారి సన్నివేశం ఈయన అత్యంత చాకచక్యంతో చిత్రీకరించారు)
మీడియా పార్ట్నర్స్: సాక్షి, రాజ్ న్యూస్

విశిష్ట ప్రేక్షకులు: గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య గారు, హోమ్ మినిస్టర్ సబిత గారు (వీరు చివరి వరకు ఏమీ చేయకుండా సినిమా చూస్తూ కూర్చున్నారు)

మిగతా ప్రేక్షకులు: రైల్వే స్టేషన్ లో వేచియున్న ప్రయాణికులు, tv ల ముందు కూర్చున్న ప్రజానీకం

విశ్లేషణ: ఇక కొంచెం serious గా మాట్లాడుకుందాం.... ఈ సినిమా వల్ల రాష్ట్రం లో ఏ ఒక్కరికి ఒరిగిందేమీ లేదు. ఎవరికి వారు వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి ఎప్పటిలాగే అమాయకులను బలి చేశారు. ఈ సంఘటనకు కాంగ్రెస్, TRS ల పాత్ర ఎంత ఉందో తెలుగు దేశం పాత్ర కూడా అంతే ఉంది. నిజం చెప్పాలంటే ఈ యాత్ర కు అసలు ప్రాముఖ్యతే లేదు. అలాంటి దాన్ని అనవసరం గా limelight లోకి తీసుకువచ్చాడు యెర్రబల్లి తన వివాదాస్పద వ్యాఖ్యలతో. దాంతో అప్పటివరకు కొద్దో గోప్పో విమర్శలు చేస్తున్న TRS కు మద్దతు లభించినట్లయింది. ఇక షరా మామూలుగా మన కెసిఆర్ రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, మన మీడియా వాటిని పతాక శీర్షికన వేయటం, ఇక కుర్రాళ్లు రెచ్చిపోవటం మామూలుగా జరిగిపోయాయి. ఇక కెసిఆర్ గారు బంద్ కు పిలుపు ఇచ్చి రెక్కాడితేగానీ డొక్కాడని కూలీల కడుపు మరోసారి కొట్టాడు. ఇంట్లో కూర్చొని బిర్యాని తింటూ, కార్లో తిరుగే వాడికి బస్సులు తిరగక సామాన్య మానవుడు పడే అవస్థలు ఎలా తెలుస్తాయి. ఇక జగన్ అనుయాయులు రాష్ట్రం లో చేస్తున్న విధ్వంసాలు అంతా ఇంతా కాదు. తిరుపతి లో రైలు కి నిప్పు పెట్టారు, షాపులను ధ్వంసం చేశారు. ఇలాంటి వాటిని చేయించిన వాళ్ళను, చేసిన వాళ్ళను జైళ్లలో పెట్టి ఎక్కడ కొడుతున్నారో చూడకుండా కుళ్లబొడిచెయ్యాలి.

మన రాష్ట్రం మాత్రం ఎటు వెళ్తుందో అర్ధం కావటం లేదు. ఇలాంటి రాజకీయ పార్టీల ఆటవిక చేష్టలతో మన రాష్ట్రం బీహార్, ఉత్తర ప్రదేశ్ ల సరసన నిలబడే రోజు అతి దగ్గర్లోనే ఉంది అనిపిస్తుంది.

Wednesday, May 19, 2010

చిరు పోలవరం యాత్ర vs 'ఈనాడు'

'పోలవరం' కోసం 'చిరు' చెప్పట్టిన యాత్ర మిగతా రాజకీయ పార్టీలకు సమస్యలపై ఎలా ఉద్యమించాలో దిశానిర్దేశం చేసేలా విజయవంతంగా ముందుకు సాగుతుంది. ఒకే అంశం మీద ఇంత తీవ్రతతో చిరు చేస్తున్న ఉద్యమం అభినందనీయం.

ఇక పోతే ఎప్పటిలాగే మన దిక్కుమాలిన మీడియా మాత్రం ఇంత మందికి మేలు చేసే ఒక పర్యటనకు సరైన coverage ఇవ్వకుండా వాళ్ళ వాళ్ళ పార్టీలకు మేలు చేసే పనిలోనే నిమగ్నమయ్యాయి. మండే వేసవిలో సాయంత్రం నాలుగు గంటలకు రోడ్ షో లో మొదలు పెట్టి రోజుకి కనీసం 15 నుంచి 20 చోట్ల ప్రసంగిస్తూ రాత్రి 1 గంట వరకు యాత్ర, తర్వాత ఒక జిల్లా నుంచి మరో జిల్లాకి ప్రయాణం, వేరే ప్రాంతం చేరుకొనే సరికి రాత్రి 2, మళ్ళీ పొద్దున 9 కల్లా ఆ ఊళ్ళో కార్యకర్తలతో, అభిమానులతో సమావేశాలు, ఆ తర్వాత మీడియా సమావేశం, తర్వాత భోజనం, కాసేపు విశ్రాంతి మల్లి రోడ్ షో షురూ...స్థూలంగా గత 14 రోజులు చిరు దినచర్య ఈ విధంగానే జరిగింది. ఇకపోతే వచ్చిన ప్రజా స్పందన మాత్రం అపూర్వం. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఊళ్లకు ఊళ్ళు పోటీ పడ్డట్లుగా ఒక ఊరిని మించి ఇంకో ఊళ్ళో జనాలు బారులు తీరారు. రాత్రి ఒంటిగంట దాటినా, యాత్ర మూడు నాలుగు గంటలు ఆలస్యమైనా అలసట లేకుండా ఎదురు చూశారు. 15 రోజుల పాటు దాదాపు 6 జిల్లాల్లో ఏకబిగిన పర్యటిస్తూ జనాల మధ్యలో గడిపాడు. ఇంత చేసినా పాపం చిరు కి ఒకటి రెండు రోజులు మినహా ఈనాడు paper లో ముఖ్యవార్తలలో చోటు లభించలేదు. విడ్డూరం ఏంటంటే కనీసం రాష్ట్ర రాజకీయాల గురించి రాసే పేజీ లో అతి తక్కువ సార్లు చిరు గురించి రాశాడు. సాధ్యమైనన్ని సార్లు ఏదో ఒక మూలనో, వసుంధర పక్కనో లేక ఆటల పేజీ పక్కనో వేస్తాడు. ఇక ఆ మూల వేసిన వార్త online edition లో మాత్రం బూతద్దం తో వెతికితే తప్ప కనిపించదు. మన చంద్రబాబు అండ్ కో లు మాత్రం ఇంట్లో కూర్చొని బిర్రుగా తిని మధ్యానం దిట్టంగా నిద్రపోయి సాయంత్రం బోర్ కొట్టి జనాలకు ఒక్క పైసా కూడా ఉపయోగపడని ఒక చౌక బారు విమర్శ చేయగానే దానికి ఎక్కడ లేని ప్రాధాన్యం ఇచ్చి తాటికాయంత అక్షరాలతో రాస్తాడు. ఇది ఈనాడు తీరు.

జిల్లా పేపర్లు ఈ విషయం లో బాగా నయం. వాళ్ళకు ఆ పేపర్ల హైకమాండ్ నుంచి అంతా ఒత్తిడి ఉండదేమో బహుశా. యాత్ర కు వస్తున్న స్పందన గురించి ఎక్కువ శాతం నిజాలు రాశారు, బాగానే coverage ఇచ్చారు.

Friday, May 14, 2010

'పోలవరం' ఆవశ్యకత తెలిపే వీడియో

ఒక ప్రాజెక్ట్ ఆవశ్యకత ను ఇంత చక్కగా చెప్పే వీడియో ఎప్పుడైనా చూశారా?


Friday, May 7, 2010

చిరు పోలవరం యాత్ర effect...ఒత్తిడి లో congress, TDP

ఒక చిన్న పార్టీ అయినా ఈ విషయం లో పెద్ద పార్టీలకు ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలిచింది ప్రజారాజ్యం. పకడ్బందీ ప్రణాళిక తో రూపొందించిన ఈ యాత్ర రెండో రోజుకు చేరుకోనేలోపే సత్ఫలితాలను ఇస్తుంది. ఒక పక్క యాత్ర కు విశేషమైన జన స్పందన లభిస్తుండగా ఇంకో పక్క మిగతా రాజకీయ పార్టీలు కూడా ఇలాంటి ప్రాజెక్టులకోసం నడుం బిగిస్తున్నాయి. congress MP లు ఇప్పటికే ప్రధానిని కలిసి పోలవరం ప్రాజెక్టు జాతీయహోదా కోసం విజ్ఞప్తి చేయగా తెలుగు దేశం కూడా పోలవరం, ప్రాణహిత ప్రాజెక్టుల కోసం పోరాటం చేస్తామంటుంది. మొత్తానికి అన్నీ పార్టీలు ప్రజా హితమైన ప్రాజెక్టుల మీద దృష్టి సారించాయి. ఈ బుద్ధేదో ముందే ఉంది ఉంటే మనకు ఇన్ని సంవత్సరాల పాటు రైల్వేలలో, కేంద్ర నిధులలో రాష్ట్రానికి ఇంత అన్యాయం జరిగి ఉండేది కాదేమో.

ఇక చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, ఒక కొత్త పార్టీ రావటం వల్ల ప్రజలకు మేలే జరుగుతుంది కానీ కీడు జరగదు అన్న దానికి ఇది perfect ఉదాహరణ. పోతే ప్రజారాజ్యం కూడా చిన్నగా గాడిలో పడుతుంది అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల కల్లా prp ఉండదు అని, prp congress లో కలిసి పోతుంది అని దుష్ప్రచారం చేసే వాళ్ళకు చిరంజీవి చెప్పే సమాధానం చూస్తుంటే ముచ్చటేస్తుంది.



Tuesday, May 4, 2010

ఆసక్తి రేపుతున్న చిరు "పోలవరం" యాత్ర

రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్, దశాబ్దాలుగా మూలుగుతున్న పోలవరం ప్రాజెక్ట్ పై చిరంజీవి చేపట్టిన పోలవరం యాత్ర పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతుంది. రాజకీయాల్లో అడుగు పెట్టి రెండు సంవత్సరాలు కూడా పూర్తి కాకపోయినా, ఈ ప్రాజెక్ట్ కోసం ప్రజారాజ్యం భారీ కసరత్తే చేసింది. మొదట మండల స్థాయి సమావేశాలు, తర్వాత జిల్లా స్థాయి సమావేశాలతో జిల్లాలలో ఇప్పటికే ఈ అంశాన్ని బాగా ప్రచారం చేసింది. దానికి తోడు రెండు మూడు రోజుల క్రితం, పోలవరం ఆవశ్యకత ను చాటి చెప్పే cd లను posters ను విడుదల చేశారు. పార్టీకి ఉన్న తక్కువ వనరులను ఉపయోగించుకుంటూ ఇంత చక్కగా plan చేసి ఒక ప్రజా హిత కార్యక్రమం కోసం ఉద్యమించటం చాలా బాగుంది.

ఇకపోతే సందట్లో సడేమియా లాగా తెరాస పోలవరం ప్రాజెక్ట్ తెలంగాణ కు వ్యతిరేకం అంటూ ప్రచారం మొదలుపెట్టింది. గోదావరి పరివాహక ప్రాంతం లో చిట్ట చివర కట్టే ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ ఎలా నష్టపోతుందో వారికే తెలియాలి. పోలవరం ద్వారా ఖమ్మం జిల్లాలో కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయి. ఆ మాటకి వస్తే మునిగి పోయే ప్రాంతాలు తూర్పు, పశ్చిమ గోదావరి లోనూ, చత్తీస్గడ్, ఒరిస్సాలోను ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ జిల్లాలకు వచ్చే తాగునీరు, మరీ ముఖ్యంగా నల్గొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా అందే తాగు నీరు, పోలవరం ద్వారా రాయలసీమ కు నీళ్ళు ఇవ్వటం ద్వారా, శ్రీశైలం నుంచి రాయలసీమ కు ఇవ్వాల్సిన నీటి పై ఒత్తిడి తగ్గి, తెలంగాణ కు ఎక్కువ నీరు అందుతుంది. ఇదే కాకుండా పోలవరం లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను తెలంగాణ లోని ఎత్తి పోతల పధకాలకు ఉపయోగపడుతుంది

ఇకపోతే చిరు పర్యటన మొదలు కాకముందే దాని effect కొద్ది కొద్దిగా కనపడుతుంది. ఆలస్యంగానైనా నిద్ర లేచిన రెండు కళ్ళ చంద్రబాబు మొన్నే ప్రధాన మంత్రికి లేఖ రాశాడు, ప్రాణహిత, పోలవరం ప్రాజెక్ట్ లకు జాతీయ హోదా కల్పించమని. అలాగే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కూడా కొన్ని ప్రాజెక్టుల కోసం ఇలా యాత్ర చేపట్టాలని చూస్తున్నారట. ఇలా ఉద్యమం పేరు చెప్పుకొని అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటూ ప్రజలకు ఉపయోగపడే పైసా పని కూడా చేయకుండా పబ్బం గడుపుకుతున్న వారు కూడా ఇలా నిజమైన ప్రజాహిత కార్యక్రమాల మీద దృష్టి సారించటం చిరు సాధించిన మొదటి విజయంగా చెప్పుకోవచ్చు.

ఈ యాత్ర విజయవంతమౌతుందని ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతుందని ఆశిద్దాం.

Monday, April 26, 2010

'పోలవరం' కోసం ప్రజారాజ్యం పోరు








ఇంతకు ముందు ఒకటి రెండు సమస్యలపై (ఉదా: విద్యుత్ సమస్య, కాకినాడ గాస్ లో వాటా) ప్రజా రాజ్యం ఉద్యమాలు చేసినా పెద్ద ఎత్తున ఒక చక్కటి ప్రణాళిక తో ఇలా ఉద్యమించటం ఇదే మొదటి సారి అనుకుంట.

ఇకపోతే ఈ లింక్ ప్రకారం, పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రం లోని 15 జిల్లాలకు ఉపయోగపడుతుంది, 1941 లో బ్రిటీష్ వాళ్ళ హయాంలో ఈ ప్రాజెక్ట్ ఆలోచన రూపు దిద్దుకుందట. మరి ఇప్పుడు design మారిందో లేదో తెలీదు కానీ, జాతీయహోదా కోసం ప్రయత్నిస్తున్నారంటే ఇది కచ్చితంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయ్యుండాలి. దీని శంకుస్థాపన జరిగి కూడా చాలా యేళ్లయినా, కారణాలు ఏవైనా ప్రాజెక్ట్ మాత్రం ముందుకు జరిగినట్లు లేదు.

ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్ గురించి, ప్రతిపక్షం లో ఉన్న తెలుగుదేశం మరి ఎందుకు పట్టించుకోలేదో తేలేదు కానీ, ప్రజారాజ్యం మాత్రం serious గా తీసుకున్నట్లుంది. ఇంతకు ముందు కొన్ని సమస్యలపై ప్రజారాజ్యం ఉద్యమాలు చేసినా (ఉదా: విద్యుత్ కోత, కాకినాడ గాస్) అవి ముఖ్యంగా ఒకటి రెండు రోజులు మాత్రమే సాగాయి. మొదటి సారి ఇప్పుడు ఏకంగా ఇలాంటి సమస్యపై ఇంత పెద్ద ఎత్తున ఉద్యమించటం అభినందనీయం. రైతులకు అవగాహన పెంచటం కోసం CD కూడా రూపొందించారట. కచ్చితంగా ఇలాంటి నిజమైన ప్రజాహిత కార్యక్రమాలు, ఉద్యమాలు ప్రభుత్వం పై ఒత్తిడి పెంచుతాయని భావిద్దాం.
మొత్తానికి ప్రజారాజ్యం మంచి నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదుగుతుంది అనిపిస్తుంది.
All The Best PRP.

Thursday, April 22, 2010

చిరoజీవి తెలంగాణ ద్రోహి కాదు...

సమైక్యరాష్ట్రం కోరుకొనే వాళ్ళు తెలంగాణ ద్రోహులు కాదు. రాష్ట్రం లో ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. తెలంగాణ ప్రజలలో కూడా సమైక్యం కోరుకొనే వాళ్ళు ఉన్నారు.

ద్రోహి అంటే పైకి ఒకటి చెప్తూ వెనకాల వెన్నుపోటు పొడిచే వారు.
ఉదా:
1) తెలంగాణ తెచ్చేది ఇచ్చేది కాంగ్రెస్సే అని తెలంగాణ లో చెప్తూ తెలంగాణ ను అడ్డుపెట్టుకొని పెద్ద పెద్ద పదవులను కొట్టేసి తెలంగాణా కి పైసా పని చేయని కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెలంగాణ ద్రోహులు.
2) తెలంగాణ కు అనుకూలం అని చెప్తూ సీమాంధ్ర లో నిరాహార దీక్షలు, బస్సు యాత్రలు చేయించి అక్కదేమో సమైక్యం అని, ఇక్కడేమో జై తెలంగాణా అని రెండు ప్రాంతాల ప్రజలను మభ్య పెడుతున్న తెలుగుదేశం రెండు ప్రాంతాల ద్రోహి
౩) అదుగో తెలంగాణ, ఇదిగో తెలంగాణా అంటూ ఉద్యమం పేరు చెప్పుకొని డబ్బులు గుంజుకుంటూ, సొంత నియోజక వర్గం లో వరదలు వచ్చి అంతా పోతే కనీసం ఏమీ చేయకుండా...దోపిడీ దారులు, వలస వాదులు, ఉద్యోగాలు, వివక్ష, వెనకబాటుతనం అంటూ రెచ్చగొట్టుడు ప్రసంగాలు చేసి అమాయక విద్యార్ధుల ప్రాణాలు బలి దీసుకొని, చివరికి శ్రీకృష్ణ కమిటీ దగ్గర స్వయంపాలన అంటూ మాట మార్చి, సమ్మగా ఇప్పుడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం మీటింగులు పెట్టుకుంటున్న kcr/TRS తెలుగు ప్రజల అతి పెద్ద ద్రోహి.


వీళ్లందరు చేసిన ఏ ఒక్క దుర్మార్గపు పని చిరంజీవి చేయలేదు. తన నిర్ణయం మార్చుకున్నాడు తప్ప, నిర్ణయం మార్చుకోలేదు అని చెపుతూ రెండు ప్రాంతాలు, రెండు నాల్కలు, రెండు కళ్ళు అని వేదాలు వల్లే వేయట్లేదు.

చివరిగా: చిరంజీవి కి సమైక్యంగా ఉండాలంటు తెలంగాణ లో పర్యటించే అన్నీ హక్కులు ఉన్నాయి. Really looking forward to it.

పదునెక్కుతున్న చిరు మాటలు













రాష్ట్ర కమిటీ సమావేశం లో చిరు ఉద్వేగంతో చేసిన ప్రసంగం బాగుంది. ఎంతో ఆకర్షణ ఉన్న సినిమా రంగంలో 30 యేళ్లుగా character/వ్యక్తిత్వం కాపాడుకున్నాను అంటూ తెలుగు బిడ్డనైన నాకు రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటూ తెలంగాణా లో పర్యటించే అన్ని హక్కులు ఉన్నాయి అని చెప్పటం బాగుంది. ఇది చాలా correct. సమైక్యంగా ఉండాలని కొంత మంది తెలంగాణా వారు కూడా కోరుకుంటున్నారు. సమైక్యం అన్నంత మాత్రాన వారిని తెలంగాణా దోషులుగా TRS చిత్రించటానికి ప్రయత్నించటం దారుణo.

Thursday, April 8, 2010

ప్రజారాజ్యం నివేదిక సమర్పణ


రాష్ట్రం లో వెనుకపాడిన జిల్లాలే ఉన్నాయి ప్రాంతాలు కాదు అన్న statement నూటికి లక్ష పాళ్లు correct. నివేదికతో పాటు కొన్ని పరిష్కారాలను సూచించటం కూడా బాగుంది. TDP, congress లాగా ద్వంద్వ వైఖరితో double game ఆడకుండా ఒక స్పష్టమైన, కఠినమైన నిర్ణయాన్ని తీసుకొని ఆ మేరకు నివేదిక ఇచ్చిన ప్రజారాజ్యానికి మరో సారి అభినందనలు. TDP, congress లకు రాష్ట్రం లో వాళ్ళ వాళ్ళ పార్టీలను కాపాడుకోవటమే కావాలి తప్ప రాష్ట్ర ప్రజల బాగు కాదు అని చెప్పటానికి తెలంగాణ అంశం ఒక్కటి చాలు. TDP, congress go back. Jai ప్రజా రాజ్యం.

Friday, March 19, 2010

శ్రీకృష్ణ కమిటీ కి ప్రజా రాజ్యం నివేదిక


ప్రధాన పార్టీలైన తెలుగుదేశం, కాంగ్రెస్స్ నివేదిక ఎలా సమర్పించాలో కూడా నిర్ణయించుకోలేని స్థితి లో ఉంటే కొత్త పార్టీ అయిన PRP ఒక స్పష్టమైన నిర్ణయం తో నివేదిక ముసాయిదా తయారుచేయటం ఆలోచించదగ్గ విషయం. ఒక విషయం పై తమ వైఖరి కూడా స్పష్టంగా చెప్పని ఈ పార్టీలు రెండు ప్రాంతాలవారిని మభ్యపెడుతూ ద్వంద్వ వైఖరి అవలంబించటం దారుణం.
నేను వార్తలలో చూసినంత వరకు ఇప్పటి వరకు లగడపాటి రెండు మూడు నివేదికలు, టిజి వెంకటేష్ ఒక నివేదిక సమైక్యాంధ్ర గురించి ఇవ్వగా, TVS వాళ్ళు తెలంగాణ తరుపున రెండు నివేదికలు సమర్పించారు. ఇక మొదటి నుంచి తెలంగాణ వాదం నెత్తిన పెట్టుకున్న TRS ని ఏమనాలో మాత్రం అర్థం కావట్లేదు. మాకు అక్కడ అన్యాయం జరిగింది, ఇక్కడ జరిగింది అని మీడియా సమావేశం లో ఆంధ్ర/సీమ ల మీద దొంగల ముద్ర వేసిన వీళ్ళు నివేదిక సమర్పించటానికి ఇన్ని రోజులు ఎందుకో అర్థం కాదు. అసలు ఏమీ లెక్కలూ లేకుండా ఇన్నాళ్లు ఇన్ని ఆరోపణలు ఎలా చేశారో వాళ్లకే తెలియాలి. మరి TRS పార్టీ సంగతి పక్కన పెడితే professors అని చెప్పుకుంటున్న కోదండరామ్, జయశంకర్ లు నివేదిక తయారు చేయకుండా యే గడ్డి పీకుతున్నారో వాళ్లకే తెలియాలి. తెలంగాణ గురించి ఉత్తిత్తి సంధార్భాలలో మీడియా లో ప్రగల్భాలు పలికే జీవన్ రెడ్డి, దామోదర్ రెడ్డి, వీహెచ్, కాకా, కేకే, అందరికన్నా మించి మధుయాస్కీ వాళ్ళ వాళ్ళ నివేదికలు ఎందుకు సమర్పించట్లేదో వాళ్లకే తెలియాలి. రాజ్యసభ సీటు కోసం వెహెచ్ అన్నీ మూసుకొని అధిష్టానాన్ని వెనకేసుకొస్తున్నాడు. కమిటీ నిర్ణయం అనుకూలంగా లేక పోతే రాజీనామా చేస్తాడట మధుయాస్కీ గాడు. అనుకూలంగా రావటానికి మీరెవరన్నా నివేదికలు సమర్పిస్తే కదా. ఇంకా ఎన్నాళ్ళు తెలంగాణ sentiment అని చెప్పి అమాయకపు విద్యార్ధుల ప్రాణాలు బలిగొంటారు? ఎన్నాళ్ళు మీరు మీ పదవుల్లో తెలంగాణా కు ఏమీ వెలగబెట్టలేక కోస్తా సీమల మీద విష ప్రచారం చేస్తారు?
ఇక మంచో చెడో ఒక నిర్ణయం తీసుకున్న చిరంజీవి కి అభినందనలు. ఇంక ప్రజారాజ్యం రాసిన పాయింట్లలో నాకు నచ్చినది పసుపు పచ్చ రంగు లో అలికాను. ఒక తెలంగాణ వ్యక్తి, రాయలసీమ నుంచి పోటీ కి నిలబడితే ఒక కోస్తా వ్యక్తి అతనికి పోటీ కూడా పెట్టకుండా ఉండటం అనేది ప్రాంతాలు వేరైనా తెలుగు వాడు ఒక్కటే అన్న ఇకమత్యాన్ని సూచిస్తుంది. ఈ విషయం లో తెలుగు వారి ఆరాధ్యదేవుడు NTR rocks. ఆయన ఇప్పుడు ఉండి ఉంటే తెలుగు జాతి కలిసే ఉండాలి అనే నినాదంతో బహుశా మొదట తెలంగాణా లోనే పర్యటించేవాడేమో, ఆయన వాక్పటిమకి తెలంగాణా సోదరులు అగ్ర తాంబూళం పట్టి నీరాజనాలు పలికే వారేమో. ఎంతైనా NTR లేని లోటు తెలుగుజాతికి పూడ్చలేని లోటు.

Monday, February 22, 2010

రైల్వే బడ్జెట్ గురించి ముందు చూపేది?




రైల్వే బడ్జెట్ లో అన్యాయం జరగగానే అందరూ విమర్శించటం, కేంద్ర మంత్రులు కొద్దిగా అసంతృప్తి నటించి తర్వాత చిన్నగా ఒక వినతి పత్రం సమర్పించటం, దాన్ని రైల్వే వాళ్ళు ఒక చెత్త బుట్ట లో పడేయటం, ఒక వారం రోజులు కాగానే మీడియా ఇంకో కొత్త సంచలనాత్మక వార్తను ఎంచుకొని ఈ సమస్యను గాలికి వదిలేయటం, చిన్నగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోవటం. ఇది ప్రతి సంవత్సరం మార్చి లో మన రాష్ట్రం లో జరిగే తంతే. ఈ మాత్రం దానికి మనకు కేంద్రం లో మంత్రులు, MPs అవసరమా, రాష్ట్రంమ్ లో ప్రభుత్వం, ప్రతిపక్షం అవసరమా? ఇక 30 యేళ్లుగా రాజకీయాల్లో ఉండి, 9 యేళ్లు ముఖ్యమంత్రి గా ఉన్న పెద్దాయన, ఒక రోజు అకస్మాత్తుగా నిద్ర లేచి "అసలు రాష్ట్రం లో ప్రభుత్వం ఉందా" అని ఒక statement మీడియా కి పడేసి మళ్ళీ ఎప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం వస్తుందా అని చూస్తుంటాడు తప్పితే ప్రభుత్వానికి constructive గా ఒక్క సలహా కూడా ఇవ్వడు, ప్రజలకు మేలు చేసే పని ఒక్కటి చేయడు. అంతా అయ్యాక విమర్శించటానికి మాత్రం రెడీ.

anyways, I really appreciate chiru for doing this


Monday, February 8, 2010

maya bazaar (color)

Two days back I watched Maya Bazaar in color at Prasads. I must admit that this movie is one of the greatest movies we ever had. For a movie that is more than 50 year old, the theatre had packed audience. The audience age group was from 3 to 90 years and each and everyone among them was enjoying the movie to the fullest. While the elder people were enjoying the screen presence of all time greatest actors actors of telugu cinema like SVR, NTR, ANR, Gummadi, Savitri, Relangi at a single place, the children were fully enjoying the fighting sequences and the comedy done by Ghatotkacha's army and the younger croud was fully enjoying the songs and the subtle comedy in the movie. You hardly get to see any movie these days which appeals to such wide age group of audience.
Coming to me, I have fully enjoyed each and every scene in the movie. The sensible and delicate comedy present in many scenes made me even bigger fan of old movies. Felt that each and every scene in the movie was made after detailed thinking and even smaller detail was not missed. The highlights of the movie are
1) Actors performance: Each and every actor in the movie was apt for their role ..be it NTR as srikrishna, Savitri as Sasirekha, or SVR, ANR, Relangi, Ramanareddy..the best casting you can ever imagine. Savitri' action was too good in the movie. Especially when Ghatotkacha enters into her body, her action was awesome. If you are non telugu but want to know how Sri Krishna might have looked like, you have to watch this movie. After watching this movie, when you think of SriKrishna, NTR would come to your mind. I need not say anything about the screen presence, dialogue delivery, action of SVR as Ghatotkacha...I am one of those who believe SVR is the greatest actor we ever had in telugu film industry even better than NTR, though I have my biggest respect for NTR.
2) songs: When "lahiri lahiri lahiri lo..." song started there were claps and whistles whose magnitude was comparable to the response you typically get in a hero's entry scene latest movies. Can you imagine such a response for a movie that was made half a century back? The claps got only bigger in the later part of the song when Srikrishna & Rukmini (NTR and his wife in the movie) go for boating to save Abhimanyu and Sasirekha (ANR and Savitri) from being seen by Sasirekha's parents. And ofcourse then comes the bigger highlight of Balarama and his wife (Gummadi and ?) going for boating and singing again "lahiri lahiri lahiri lo..." .. It was real fun as I never saw gummadi in such romantic scenes. In one of the latest interviews, ANR was telling that this song was shot during day time. But that is never felt in the song when you actually see it on screen, you really feel like it is one of those awesome full moon days.
The other songs like "vivaha bhojanambu", "neevena nanu talachinadi", "sundari" also received very good response.
3) The other highlights are the screenplay of the movie, the special effects in the movie. In the song of "Vivaha bhojanambu", it is still difficult to imagine how they shot the scene of SVR eating laddus in a single shot. All credit to the director, camera man and the producers of the movie.
4) Colors: Goldstone Technologies has done a wonderful job of making the movie into colors and I believe the success of the movie would encourage more companies attempting such things.


In the last I would say that, even if you have the slightest interest for old telugu movies, this is a must watch and you will not regret that experience.

Thursday, January 14, 2010

సంక్రాంతి ని పొంగల్ చేయకండే!

అరవం ఎఫెక్ట్ అంటే ఇదేనేమో. అట్టు దోశ అయింది, చారు కాస్తా సాంబార్ అయింది. కనీసం సంక్రాంతి ని అన్నా సంక్రాంతి అని చక్కగా పిలుచుకుందాం.

అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.

Monday, January 4, 2010

తెలంగాణ, సమైక్య ఉద్యమాలకు పరిష్కారమేంటి?

తెలంగాణా నాయకులకు తెలంగాణా రాష్ట్రం కావాలి. రాష్ట్రం ఏర్పడితే రెండో స్థాయిలో ఉన్న నాయకులకు పెత్తనం వస్తుంది, హైదరాబాదును దోచుకోవచ్చు, అధికారం చలాయించవచ్చు, ఆంధ్రా వ్యాపార సంస్థలను బెదిరించి డబ్బులు పిండుకోవచ్చు. తెలంగాణా ప్రజలకు తెలంగాణా రాష్ట్రం కావాలి, ప్రత్యేక వాదులు ఊదరగొట్టినట్లు రాష్ట్రం ఏర్పడితే ఏమన్నా అభివృద్ధి జరుగుతుందేమోనని, కొత్త ఉద్యోగాలు వస్తాయేమోనని, జీవితాలు ఏమన్నా మారతాయెమోనని. ఆవేశం లో ఉన్నవాళ్లకు, లేని ఉద్యోగాలు ఎక్కడినుంచి వస్తాయని, రాజకీయ వ్యవస్థ మారకుండా జీవితాలు ఎలా మారుతాయని చెప్పినా అర్థం కాదు.
ఇక కోస్తాంధ్ర, సీమ ప్రజల విషయానికి వస్తే కలిసి ఉంటే కలదు సుఖం అనుకుంటున్నారు. ఒకే భాష వాళ్ళు విడిపోతే ఎలా అని ఆలోచిస్తున్నారు.

ఇవన్నీ సంతృప్తి చెందేలా ఒక పరిష్కారం ఆలోచిద్దాం.
ఇప్పటి వరకు తెలంగాణా వాదులు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవటానికి పైకి చెప్పే కారణాలు ఈ కిందవి గా కనిపిస్తున్నాయి.

1) తెలంగాణా జిల్లాల్లో అభివృద్ధి లేదు. ఆంధ్రా ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందాయి.
2) ఇది తెలంగాణా ఆత్మ గౌరవ సమస్య, ఆంధ్రా వలస పాలకులు మాకొద్దు. మా తెలంగాణా ను మేమే పాలించుకుంటాం.
3) "మా తెలంగాణా" సంపద, (ఇక్కడ చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఉద్దేశం "మా హైదరాబాదు") ఉద్యోగాలను వలస ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారు.


ఇందులో మొదటి సమస్య "అభివృద్ధి":
తెలంగాణా నాయకులు గత పది సంవత్సరాలుగా అభివృద్ధి గురించి చేస్తున్న వాదనలలో ఏమాత్రం పస, రుజువు లేదు. ఇప్పటి వరకు ఈ అంశం మీద ప్రచారం చాలా ఏకపక్షం గా జరిగింది. ఏదో ఒకట్రెండు GO లనుపట్టుకొని హరీష్ రావ్ అస్సెంబ్లీ లో స్పీచ్ ఇవ్వగానే, "excellent speach on telangana" అంటూ youtube లో videO పెడతారు, జనాలు దాన్ని చూస్తారు కానీ మిగతా GO లలో తెలంగాణా కు భారీగా నిధులు మళ్లినా, అది అవసరం లేదు, అలాంటి వాటిని బయిటకు చెప్పే నాధుడే లేడు. విచిత్రం ఏంటంటే ఏ తెలంగాణా నాయకుడు కూడా ఇప్పటి వరకు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాడ్డాక 1956 నుంచి ప్రభుత్వ నిధులు ఏఏ ప్రాంతానికి ఎంతెంత ఖర్చు పెట్టారో అడగలేదు. ఎందుకంటే ఎక్కడో మూలాన వాళ్ళకు కూడా తెలుసు నిజాలు. గమ్మత్తేంటంటే అలాంటి శ్వేతపత్రం లగడపాటి, ఉండవల్లి లాంటి ఆంధ్ర నాయకులు అడగటం. ఇక్కడ కిటుకు ఏంటంటే తెలంగాణా అభివృద్ధి లో ఆంధ్రా తో సమానంగా ఉంది అని కాదు, ఇప్పటికీ వెనక పడే ఉంది, కానీ 1956 లో ఆంధ్రా కి తెలంగాణా కి ఉన్న వ్యత్యాసం కన్నా ఇప్పుడు ఉన్న వ్యత్యాసం చాలా తక్కువ. దానికి కారణం సమైక్యాంధ్రప్రదేశ్.
సరే ఆ సంగతి పక్కన పెట్టి అభివృద్ధి సమస్య కు పరిష్కారం ఆలోచిద్దాం. ఇది అన్నటికన్నా సులువైన సమస్య. దీనికి పరిష్కారం అభివృద్ధి చేసుకోవటం కానీ, రాష్ట్రాన్ని విడదీయటం కాదు. ఎందుకంటే రాష్ట్రాన్ని విడగొట్టాక కూడా అభివృద్ధే కదా చేసుకొనేది, అలాంటప్పుడు అదేదో ఇప్పుడే చేసుకోవచ్చు, పైగా సమైక్య రాష్ట్రం లో ప్రభుత్వ నిధులు ఎక్కువ ఉంటాయి కదా. ఇకపోతే రాష్ట్రంలో అభివృద్ధి లేని జిల్లాలు ఇతర ప్రాంతాల్లోనూ ఉన్నాయి కాబట్టి మౌలిక వనరుల ప్రాతిపదికన వెనకబడిన జిల్లాలను గుర్తించి వాటన్నిటికి నిధులు కేటాయించవచ్చు. తెలంగాణా లో ఎక్కువ వెనకబడిన జిల్లాలు ఉన్నాయి కాబట్టి ఈ నిధులలో సింహభాగం తెలంగాణా కే దక్కుతుంది కాబట్టి తెలంగాణా వాదులు కంప్లయింట్ చేయాల్సిన పని లేదు.


ఇక రెండోది: ఆత్మ గౌరవ సమస్య, మమ్మల్ని మేమే పాలించుకుంటాం:
నా దృష్టిలో ఇది అర్థం పద్ధo లేని, అనుమానాస్పదమైన ప్రకటన. ఇప్పుడు తెలంగాణ ను ఎవరు పాలిస్తున్నారో చూద్దాం. ప్రస్తుతానికి తెలంగాణా ఆంధ్ర ప్రదేశ్ లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ను పాలిస్తుంది. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు. అధికారులు ఎలాగూ దేశం లో ఎక్కడివాళ్లైనా అయ్యుండొచ్చు. కాబట్టి వాళ్ళ గురించి ఇక్కడ చర్చ అనవసరo. ఇక మంత్రులు: వాళ్ళు మూడో వంతుకు పైగానే తెలంగాణ నుంచి ఉన్నారు. కాబట్టి అధికారులు, మంత్రుల విషయం లో ఆత్మ గౌరవం అర్థరహితం. ఇకపోతే మిగిలింది ముఖ్యమంత్రి. ఈయన కోస్తాంధ్ర వ్యక్తి. కాబట్టి తెలంగాణా వాదులు వాదించే ఆత్మ గౌరవం ఒక్క ముఖ్యమంత్రి పదవి గురించే అనిపిస్తుంది. తెలంగాణా నాయకులు ఆంధ్రప్రదేశ్ ఏర్పాడ్డాక ముఖ్యమంత్రి పదవుల్లో ఎక్కువ కాలం లేరన్నది వాస్తవం. కాబట్టి కొన్ని సంవత్సరాలు అన్నీ పార్టీలు తెలంగాణా వాళ్లనే ముఖ్యమంత్రులను చెయ్యాలి. అలా ఒక 10 - 15 యేళ్లు అయ్యాక అప్పటికి అన్నీ ప్రాంతాల వారు సమానంగా పాలించినట్లు అవుతుంది. అప్పటి నుంచి రొటేషన్ పద్ధతి లో ఒక్కో ప్రాంతం వారికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలి. ఈ పరిష్కారం తెలంగాణ వాదులకు నచ్చకపోయినా వాళ్ళు ఏమీ చేయలేరు, ఎందుకంటే వాళ్ళకు సంతృప్తి కలగాలంటే వాళ్ళు చేయాల్సింది ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కాదు, ప్రత్యేక దేశం ఉద్యమం. ఎందుకంటే రాష్ట్రం ఏర్పడినా వాళ్ళను కేంద్రం అంటే ప్రధాన మంత్రి పాలిస్తాడు కాబట్టి. So "ఆత్మగౌరవ సమస్య" is also solved.

ఇక మూడోది: తెలంగాణ/హైదరాబాద్ సంపద/హైదరాబాద్ ఫ్రీజోన్ కాదు:
ఇక్కడ తెలబాన్లు చేసే ప్రకటనలు "ఆంధ్ర పెట్టుబడి/భూకబ్జా దారులను, వ్యాపార సంస్థలను తరిమి కొడతాo". ఇందులో చివరిది ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డా అసలు జరిగే పని కాదు ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం దేశ పౌరులు ఎక్కడైనా స్థలాలు కొనుక్కోవచ్చు, వ్యాపారాలు చేసుకోవచ్చు. ఈ విషయం లో ఒక తెలంగాణా వ్యక్తికి ఎన్ని హక్కులు ఉంటాయో మిగతా రాష్ట్రాల వాళ్ళకు కూడా అన్నే ఉంటాయి.
సరే హైదరాబాద్ ఉద్యోగాల సంగతి కి వద్దాం. కోస్తాంధ్ర, రాయలసీమ వాళ్ళు ఎక్కువగా ఇక్కడికి తరలి రావటానికి కారణం ఇక్కడి ఉపాధి సౌకర్యాలు. రాష్ట్ర రాజధాని అవ్వటం చేత, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వివిధ రంగాలు అభివృద్ధి చెందుతుండటం వల్ల ఇక్కడ ఉపాధి మార్గాలు అనేకం. అలాగే రాష్ట్ర రాజధాని కావటంతో వివిధ ప్రభుత్వ శాఖల హెడ్ఆఫీస్ లు హైదరాబాద్ లో పెట్టడం జరిగింది, దాని వల్ల ప్రభుత్వోద్యోగాలు ఇక్కడ అత్యధికం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఈ ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకు వస్తాయనుకోవటం భ్రమ ఎందుకంటే అప్పుడు చిన్న రాష్ట్రానికి అంత మంది ఉద్యోగుల అవసరం ఉండదు కాబట్టి. మళ్ళీ ముందు అనుకున్నట్లు private సంస్థల్లో ఆంధ్ర వాళ్ళ పోటీ ఉందనే ఉంటుంది.
సరే దీనికి పరిష్కారం ఏంటి? రాష్ట్ర రాజధాని కాబట్టి వలస ఆంధ్ర వాళ్ళు వచ్చి ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అదే రాజధానినే కోస్తాంధ్ర/రాయలసీమ కు తరలిస్తే? ఈ ఆలోచనేదో అధ్భుతంగా ఉన్నట్లుంది. ఒక్క దెబ్బ కి రెండు పిట్టలు. ఆంధ్ర వాళ్ళు పెట్టుబడి దారులు, ఉద్యోగులు, వ్యాపారులు అందరూ కొత్త రాజధానికి చెక్కేస్తారు. హైదరాబాద్ లో వాళ్ల పీడా విరగడైపోతుంది. పొమ్మనకుండా పొగ పెట్టడం అంటే ఇదేనేమో! ఆ చేసే రాజధానేదో ఏ కర్నూల్,కడప జిల్లాలోనో లేక ఏ ప్రకాశం జిల్లాలోనో బాగా బీడు భూములు ఎక్కువగా ఉన్న చోట చేస్తే అక్కడ అభివృధ్ధి జరుగుతుంది, విజయవాడ, గుంటూర్ లాంటి ఊళ్లలోని పొలాలు కూడా నాశనం కాకుండా ఉంటాయి, రాష్ట్రంలోని మిగతా అన్నీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నట్లు అవుతుంది. ఎక్కడో తెలంగాణా వాదులు నన్ను బండబూతులు తిడుతున్నట్లు వినిపిస్తుంది. ఆగండాగండి మీకు విషయం అర్థం అయినట్లు లేదు. రాజధానిని హైదరాబాదు నుంచి ఆంధ్రా కి తరలించటం వల్ల ఎక్కువ గా లాభపడేది తెలంగాణా నే! ఎలా అంటారా? ఉదాహరణ కు, తెలంగాణా లో ఆంధ్రప్రదేశ్ ఆదాయం లో 40 శాతం ఖర్చు పెడతారు అనుకుందాం. అందులో హీన పక్షంలో హైదరాబాదు కే దాదాపు సగం అంటే 20 శాతం ఖర్చు పెడతారు, ఎందుకంటే రాష్ట్ర రాజధాని, రాష్ట్రంలోని నలుమూలలనుండి ఇక్కడికే వస్తారు కాబట్టి మౌలిక సదుపాయాలకు బాగా ఖర్చు అవుతుంది. సొ హైదరాబాద్ లో ఖర్చు పోగా మిగిలిన 20 శాతం 9 తెలంగాణా జిల్లాల్లో ఖర్చు పెడతారు. అదే ఇప్పుడు హైదరాబాదే రాష్ట్ర రాజధాని కాదనుకోండి, అప్పుడు ఇప్పట్లాగా అందరు హైదరాబాద్ కు ఎగబడరు, ఇప్పటికే అంత ఇంఫ్రాస్ట్రక్చర్ బాగా ఉంది కాబట్టి హైదరాబాద్ ఖర్చు భారీగా తగ్గిపోతుంది. తెలంగాణా కు ఖర్చు పెట్టాల్సిన మొత్తం 40 శాతం ఆదాయం అలానే ఉంటుంది కాబట్టి తెలంగాణ 9 జిల్లాలకు ఇప్పుదు మనం 40 శాతం రాష్ట్ర ఆదాయం ఉంది. ఇది సక్రమంగ తెలంగాణా జిల్లాల్లో ఖర్చు పెడితే తెలంగాణా ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించండి. ఇలా రాజధాని ని మార్చటం విన్ విన్ సిచువేషన్.

ఎలాగూ ఇన్ని మార్పులు చేస్తున్నాం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ పేరు కూడా అన్నీ ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహించేటట్లు ఏ "తెలుగు నాడు/తెలుగు దేశం" అనో లేక "తెలంగాణాంధ్రసీమ" అనో మార్చేసుకుంటే భవిష్యత్తు లో మళ్ళో కెసిఆర్ పుట్టకుండా ఉంటాడు. So ఇప్పుడు రాష్ట్రం లో ఉన్న అన్నీ సమస్యలకు పరిష్కారo "తెలంగాణాంధ్రసీమ" రాష్ట్రాన్ని "కర్నూలు/కడప/ప్రకాశం" రాజధానిగా ఏర్పాటు చేసి, ఒక తెలంగాణ వ్యక్తి ని వచ్చే 15 సంవత్సరాల వరకు ముఖ్యమంత్రిని చేసి వెనకబడిన ప్రతి జిల్లా కి ప్యాకేజీ ప్రకటిస్తే సరి.
ఇలా తెలంగాణ వారి సమస్యలు, సమైక్యాంధ్ర వారి సమస్యలు అన్నీ తీరతాయి ఈ పరిష్కార మార్గం తో. ఏమంటారు?